Goddess Kanyaka Parameshwari | రూ. 6.66 కోట్ల కరెన్సీ నోట్లతో అమ్మవారికి అలంకరణ.. ఎక్కడో తెలుసా..?
Goddess Kanyaka Parameshwari | దసరా నవరాత్రుల( Dasara Navaratri ) నేపథ్యంలో అమ్మవారు( Goddess ) ఒక్కో రోజు ఒక్కో రూపంలో భక్తులకు( Devotees ) దర్శనమిస్తున్నారు. అమ్మవారి ఆలయాలన్నీ( Temples ) భక్తులతో కిటకిటలాడిపోతున్నాయి. అమ్మవారికి భక్తులు కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.

Goddess Kanyaka Parameshwari | దసరా నవరాత్రుల( Dasara Navaratri ) నేపథ్యంలో మహబూబ్నగర్ పట్టణం( Mahabubnagar Town ) బ్రాహ్మణవాడలోని శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయం( Kanyaka Parameshwari Temple )లో ప్రతిష్టించిన అమ్మవారిని ఆర్యవైశ్య సంఘం సభ్యులు ఆదివారం రూ. 6,66,66,666 విలువైన నగదుతో మహాలక్ష్మి( Mahalakshmi )గా అలంకరించారు.
మార్కెట్లో చలామణిలో ఉన్న 10, 20, 50, 100, 200, 500 రూపాయాల నోట్లతో అమ్మవారిని, ఆలయ ప్రాంగణాన్ని అలంకరించారు. మహాలక్ష్మిగా దర్శనమిచ్చిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.
తమిళనాడు రాష్ట్రం( Tamil Nadu State ) సేలం( Selam ) ప్రాంతానికి చెందిన కళాకారులతో ఈ అలంకరణ చేయించినట్లు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు గుండా వెంకటేశ్వర్లు తెలిపారు. ఇక అమ్మవారిని దర్శించుకున్న ప్రతి భక్తుడికీ ఒక రూపాయి నాణెం అందజేసినట్లు పేర్కొన్నారు.