IRCTC Divine Karnataka। అక్టోబర్ మూడో వారంలో కర్ణాటక పుణ్యక్షేత్రాల దర్శనానికి ఐఆర్సీటీసీ బంపర్ ప్యాకేజ్
‘డివైన్ కర్ణాటక’ ప్రతి మంగళవారం ఈ టూర్ మొదలవుతుంది. అయితే.. అక్టోబర్ 22, 29 తేదీల్లో ఈ టూర్ టికెట్లు ఇప్పుడు ఐఆర్సీటీసీ సైట్లో అందుబాటులో ఉన్నాయి. కర్ణాటక పుణ్యక్షేత్రాలను దర్శించాలనుకునేవారు ఈ ప్యాకేజీతో తమ కల నెరవేర్చుకోవచ్చు.

IRCTC Divine Karnataka Tour Package। హాలిడే ట్రిప్పులు, విహార యాత్రలకే కాదు.. ఆధ్యాత్మిక యాత్రలకు సైతం ఐఆర్సీటీసీ అనేక ప్యాకేజీలను తీసుకొస్తుంటుంది. తాజాగా పుణ్యక్షేత్రాల దర్శనానికి ఒక తిరుగులేని ప్రాకేజీని తీసుకొచ్చింది. కర్ణాటక అనేక పుణ్యక్షేత్రాలకు, చారిత్రక కట్టడాలకు ప్రాముఖ్యం పొందిన రాష్ట్రం. ఉడిపి శ్రీకృష్ణ మందిరం వంటి అనేక దర్శనీయ స్థలాలు అక్కడ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక పుణ్యక్షేత్రాల దర్శనానికి ఐఆర్సీటీసీ బంపర్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్యాకేజీలో ఉడిపి, శృంగేరి, ధర్మస్థల, కుక్కే సుబ్రహ్మణ్యస్వామి ఆలయాల సందర్శన ఉంటుంది.
‘డివైన్ కర్ణాటక’ ప్రతి మంగళవారం ఈ టూర్ మొదలవుతుంది. అయితే.. అక్టోబర్ 22, 29 తేదీల్లో ఈ టూర్ టికెట్లు ఇప్పుడు ఐఆర్సీటీసీ సైట్లో అందుబాటులో ఉన్నాయి. కర్ణాటక పుణ్యక్షేత్రాలను దర్శించాలనుకునేవారు ఈ ప్యాకేజీతో తమ కల నెరవేర్చుకోవచ్చు.
టూర్ వివరాలు ఇవీ..
హైదరాబాద్‌లోని కాచిగూడ స్టేషన్ నుంచి ఈ టూర్ మొదలవుతుంది. తొలి రోజు ఉదయం 6.05 గంటలకు కాచిగూడ నుంచి మంగళూరు వెళ్లే సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నెంబర్ 12789) ఎక్కడంతో డివైన్ కర్ణాటక టూర్ స్టార్ట్ అవుతుంది. రాత్రంతో ప్రయాణంలోనే గడిచిపోతుంది. మరుసటి రోజు ఉదయం తొమ్మిదిన్నరకు రైలు మంగళూరు చేరుకుంటుంది. అక్కడి నుంచి ఉడిపికి వెళ్తారు. ముందే ఏర్పాటు చేసిన హోటల్లో దిగుతారు. అక్కడ ప్రఖ్యాత శ్రీకృష్ణ ఆలయ సందర్శన ఉంటుంది. అనంతరం సమీప మాల్పే బీచ్‌కు తీసుకొని వెళతారు. ఆ రోజు రాత్రికి ఉడిపిలోనే బస ఉంటుంది.
మూడో రోజు హోటల్ ఖాళీ చేసి.. శృంగేరి వెళతారు. అక్కడి శారదాంబ ఆలయాన్ని సందర్శించుకుంటారు. అనంతరం మంగళూరుకు తిరుగు ప్రయాణం. మంగళూరులో బస కోసం ముందే ఏర్పాటు చేసిన హోటల్లో రాత్రికి నిద్రిస్తారు.
నాలుగవ రోజు ధర్మస్థల సందర్శన ఉంటుంది. అక్కడ మంజునాథ స్వామి ఆలయం ప్రఖ్యాతి పొందినది. అక్కడ మంజునాథ స్వామిని దర్శించుకున్న అనంతరం.. మరో ప్రఖ్యాత పుణ్యక్షేత్రం కుక్కే సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం ఉంటుంది. సాయంత్రం మంగళూరుకు తిరిగి వచ్చేస్తారు. రాత్రికి మంగళూరులోనే బస.
ఐదవ రోజు మంగళాదేవి, కదిరి మంజునాథ ఆలయాల దర్శనం ఉంటుంది. సాయంత్రం తన్నేరభవి బీచ్‌లో సేదదీరవచ్చు. అనంతరం కుద్రోలి గోకర్ణాథ ఆలయ దర్శనం ఉంటుంది. అక్కడి నుంచి మంగళూరు రైల్వే స్టేషన్.. 8 గంటలకు రైలు.. తెల్లారి 11.40 గంటలకు కాచిగూడ చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది.
ప్యాకేజీలు ఇలా..
ఒకరు-ముగ్గురు బుక్ చేసుకుంటే కంఫర్ట్‌లో (థర్డ్‌క్లాస్ ఏసీ) సింగిల్ షేరింగ్ 38,100 చార్జి ఉంటుంది. ట్విన్ షేరింగ్‌కు అయితే.. 22,450, ట్రిపుల్ షేరింగ్‌లో 18,150గా చార్జీ చేస్తారు. ఐదేళ్ల నుంచి 11 ఏళ్ల పిల్లలు ఉండేట్టయితే బెడ్‌తో కలుపుకొని 11,430, బెడ్ లేకుండా అయితే 9,890 చెల్లించాలి.
ఇక స్టాండర్డ్‌లో అంటే.. స్లీపర్ బెర్తుతో సింగిల్ షేరింగ్‌కు రూ.35,070, డబుల్ షేరింగ్‌కు రూ.19,430, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.15,130 చెల్లించాల్సి ఉంటుంది. 5-11 ఏళ్ల మధ్య పిల్లలు ఉంటే.. బెడ్‌తో కలిపి 8,410, బెడ్ లేకుండా అయితే 6,860 చార్జ్ చేస్తారు.
నలుగురు నుంచి ఆరుగురు కలిసి బుక్ చేసుకుంటే.. కంఫర్ట్‌లో(థర్డ్ ఏసీ) డబుల్ షేరింగ్‌కు 19,190, ట్రిపుల్ షేరింగ్ రూ.17,110 చెల్లించాల్సి ఉంటుంది. 5-11 ఏళ్ల మధ్య పిల్లలు ఉంటే.. బెడ్ కావాలంటే రూ.11,430, బెడ్ అవసరం లేదనుకుంటే రూ.9,890 చెల్లించాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు https://www.irctctourism.com/pacakage_description?packageCode=SHR086 లింకును క్లిక్ చేయండి.