అయ్య‌ప్ప ఆల‌యంలో వైభవంగా గణపతి హోమం..

అధిక సంఖ్య‌లో హాజరైన భక్తులు… గణపతి నామ స్వరణతో మారు మోగిన ఆలయం.. విధాత, మెదక్ బ్యూరో: జిల్లా కేంద్రం మెదక్ లోని అయ్యప్పస్వామి దేవాలయంలో సోమవారం గణపతి జవనము వైభవంగా జరిగింది. అయ్య‌ప్ప స్వామి మహా మండల పూజ పురస్కరించుకుని ఈ కార్యక్రమం నిర్వహించారు. గ‌ణ‌ప‌తి, అయ్య‌ప్ప నామ స్మ‌ర‌ణ‌తో ఆల‌య ప‌రిస‌రాలు మార్మోగాయి. ఈ సందర్భంగా గురుస్వాములు హరిదాస్, వైద్య రాజు, కృష్ణ యజుర్వేద వేద పండితులు ఆదిత్య వర్ధన శర్మ, దేశాయిపేట అంకుష్ […]

అయ్య‌ప్ప ఆల‌యంలో వైభవంగా గణపతి హోమం..
  • అధిక సంఖ్య‌లో హాజరైన భక్తులు…
  • గణపతి నామ స్వరణతో మారు మోగిన ఆలయం..

విధాత, మెదక్ బ్యూరో: జిల్లా కేంద్రం మెదక్ లోని అయ్యప్పస్వామి దేవాలయంలో సోమవారం గణపతి జవనము వైభవంగా జరిగింది. అయ్య‌ప్ప స్వామి మహా మండల పూజ పురస్కరించుకుని ఈ కార్యక్రమం నిర్వహించారు. గ‌ణ‌ప‌తి, అయ్య‌ప్ప నామ స్మ‌ర‌ణ‌తో ఆల‌య ప‌రిస‌రాలు మార్మోగాయి.

ఈ సందర్భంగా గురుస్వాములు హరిదాస్, వైద్య రాజు, కృష్ణ యజుర్వేద వేద పండితులు ఆదిత్య వర్ధన శర్మ, దేశాయిపేట అంకుష్ వేద మంత్రోచ్ఛారణల‌తో స్థాపిత దేవత హావనము, మూల మంత్ర హావనము, బలి హారణం, పూర్ణాహుతి నిర్వహించారు.

అనంతరం మహిదా ఆశీర్వచనం, అన్నప్రసాదం అందజేశారు. కార్యక్రమంలో పూజారి అశోక్, గురుస్వాములు లక్ష్మీపతి, రామాంజనేయులు, శ్రీకాంత్ రెడ్డి, పార్థివ నాథ్, రమేష్, పురం వెంకట నారాయణ , ఉప్పల శ్రీనివాస్, అయ్యప్ప సమాజం బాధ్యులు చక్రపాణి, కొండ శ్రీనివాస్, వీర్ కుమార్ , భ‌క్తులు అధిక సంఖ్య‌లో పాల్గొన్నారు.