ఆదివారం రాశిఫలాలు.. ఈ రాశి వారికి ఆదాయానికి మించిన ఖర్చులు..!
Today Horoscope | చాలా మంది జ్యోతిష్యాన్ని అనుసరిస్తుంటారు. రోజు వారి రాశిఫలాలకు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త పనులను ప్రారంభిస్తారు. దిన ఫలాలు చూడనిదే కొందరు ఏ పని ప్రారంభించరు. మరి నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మేషం
మేషరాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. ఈ రాశివారిని ఈ రోజు అదృష్టం వరిస్తుంది. చేతికి అంది వచ్చిన అవకాశాలను సమర్ధవంతంగా వినియోగించుకుంటారు. ఆదాయం వృద్ధి చెందుతుంది. భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు ప్రణాళిక వేసుకుంటారు. అన్ని రంగాల వారికి ఊహించని శుభఫలితాలు ఉంటాయి.
వృషభం
వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అభివృద్ధి, ధన లాభం చేకూరుతాయి. ఉద్యోగులకు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న విదేశీ అవకాశాలు లభిస్తాయి. మొదలు పెట్టిన అన్ని పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. విందువినోదాలలో పాల్గొంటారు. ఇంట్లో శుభకార్య సంబంధిత చర్చలు జరుగుతాయి.
మిథునం
మిథున రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. మీ మాటతీరు, ప్రవర్తన ఇతరులను ఆకట్టుకునేలా ఉంటేనే మంచిది. ఆవేశంతో, తొందరపాటుతో తీసుకునే నిర్ణయాలు చేటు చేస్తాయి. ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మంచిది. వివాదాలు, వాదనలకు దూరంగా ఉంటే మంచిది. అనారోగ్య సమస్యలు ఉంటాయి.
కర్కాటకం
కర్కాటక రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ఈ రోజంతా సరదాగా గడుపుతారు. ఆర్ధిక సంబంధమైన లావాదేవీలు అనుకూలిస్తాయి. ఊహించని ధనలాభాలను అందుకుంటారు. వృత్తివ్యాపారస్తులకు పురోగతి ఉంటుంది. నూతన వస్తువాహనాలు కొనుగోలు చేస్తారు.
సింహం
సింహ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆర్ధిక ప్రయోజనాలు మెరుగ్గా ఉంటాయి. తీర్ధ యాత్రలకు వెళతారు. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. విదేశీ బంధువుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఉద్యోగులు ఏకాగ్రతతో పనిచేస్తే పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. బంధువులలో ఒకరి ప్రవర్తన మనస్తాపం కలిగించవచ్చు.
కన్య
కన్యా రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. సంఘంలో మంచి పేరు ప్రతిష్ఠలు సంపాదిస్తారు. వ్యాపారులకు, వారి భాగస్వాములకు మధ్య అనుకూలత ఉంటుంది. మంచి లాభాలను గడిస్తారు. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారు విపరీతమైన లాభాలను అందుకుంటారు. నూతన వస్త్రలాభం. కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు.
తుల
తులా రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. మానసికంగా విపరీతమైన ఒత్తిడి వుంటుంది. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వృత్తి నిపుణులకు, ఉద్యోగులకు ఆశించిన ఫలితాలు ఉండకపోవచ్చు. వ్యాపారులు నష్టాలను చవి చూస్తారు. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి.
వృశ్చికం
వృశ్చిక రాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. ఇంటా బయటా ఘర్షణలకు దూరంగా ఉంటే మంచిది. సంతానం చదువు పట్ల ఆందోళనతో ఉంటారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వారికి మంచిరోజు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. ధననష్టం సూచితం. స్థిరాస్తి రంగం వారు రుణాలు చేయాల్సి వస్తుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తే మంచిది.
ధనుస్సు
ధనుస్సు రాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. తీవ్రమైన అనారోగ్య సమస్యలు కారణంగా అధిక ధనవ్యయం ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ రోజు ప్రతికూలతలు ఎదురవుతాయి. అనుకోని రీతిలో వ్యాపారంలో నష్టాలు వస్తాయి. ఆర్ధికంగా ఆశించిన ప్రయోజనాలు ఉండకపోవచ్చు. ఆస్తికి సంబంధించిన విషయాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.
మకరం
మకర రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వాదనలకు దారితీసే చర్చలకు దూరంగా ఉండండి. కుటుంబంలో అశాంతి నెలకొంటుంది. ఆర్ధిక సమస్యలు చుట్టుముడతాయి. ఉద్యోగులు సహోద్యోగులపై సహకారంతో అన్ని పనులలో విజయం సాధిస్తారు. పని ప్రదేశంలో మీ ప్రతిభకు ప్రశంసలు అందుకుంటారు. పదోన్నతి యోగం ఉంది.
కుంభం
కుంభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజంతా మీరు సంతోషంగా ఉంటారు. వృత్తి వ్యాపార రంగాల వారు, ఉద్యోగులు చేపట్టిన అన్ని పనులు సకాలంలో పూర్తి చేసి మంచి పేరు, గుర్తింపు సాధిస్తారు. ఇంటా బయటా సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది.
మీనం
మీన రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తిలో పురోగతి ఉంటుంది. ఆదాయం బాగా పెరుగుతుంది. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా శుభవార్తలు అందుకుంటారు. సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.