Horoscope | ఆదివారం రాశిఫలాలు.. ఈ రాశుల వారికి ఆశాజనకంగా ఆర్థిక పరిస్థితి..!
Horoscope | చాలా మంది జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్ముతుంటారు. అయితే గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా రాశిఫలాలు మారుతుంటాయి. మారుతున్న రాశిఫలాలకు అనుగుణంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ఏ సమయంలో ఏ పని చేస్తే బాగుంటుందో జ్యోతిష్యులు చెబుతుంటారు.

Horoscope | Rasi Phalalu|
జ్యోతిషం, రాశి ఫలాలు అంటే మన తెలుగు వారికి ఏండ్ల తరబడి నమ్మకం ఉంది. లేచిన దగ్గరి నుంచి నిద్రించే వరకు మంచే జరగాలని కోరుకుంటూ ఉంటాం. అందుకే ప్రతీ రోజూ మన రాశి ఫలాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ మన పనులు నిర్వహిస్తూ ఉంటాం. రాశి ఫలాల ప్రకారమే నడుచుకుంటూ ఉంటాం కూడా. అందుకే నిద్ర లేవగానే మొదట చాలామంది వెతికేది ఆ రోజు ఎలా ఉండబోతుందనే. అలాంటి వారందరి కోసం వారి పేర్ల మీద ఈ రోజు ఆదివారం, మార్చి 2 న మీరాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
మేషం
మేషరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమ పెరుగుతుంది. ముఖ్యమైన పనులు ఆలస్యం కావచ్చు. ఉన్నతాధికారులతో జాగ్రత్తగా మసలుకోవాలి. ఓ వార్త మీ ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది. ఆధ్యాత్మికత వైపు మొగ్గుచూపుతారు. అనవసరమైన ఖర్చులు ఎక్కువ కావచ్చు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.
వృషభం
వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనులలో అనుకూలత ఉంటుంది. ఆర్థిక లాభాలు అధికంగా ఉండడం వల్ల సంతోషంగా ఉంటారు. సన్నిహితులతో సరదాగా గడుపుతారు. కొత్త పరిచయాలు, స్నేహాలు వృత్తివ్యాపారాలకు ప్రయోజనకరంగా ఉంటాయి. ఆరోగ్యం సహకరిస్తుంది.
మిథునం
మిథునరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. బ్రహ్మచారులకు తగిన జీవిత భాగస్వామి దొరకవచ్చు. ఆర్థిక ప్రయోజనాలకు మంచి రోజు. శుభవార్తలు అందుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది.
కర్కాటకం
కర్కాటకరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. చేపట్టిన అన్ని పనులు విజయవంతం అవుతాయి. ఉద్యోగులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉన్నతాధికారులతో ముఖ్యమైన చర్చల్లో పాల్గొంటారు. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. పదోన్నతులకు ఆస్కారం ఉంది.
సింహం
సింహరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ధార్మిక, పవిత్రకార్యాలలో నిమగ్నం అవుతారు. కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలకు వెళతారు. కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. విదేశాల్లో ఉన్న ప్రియమైన వారి నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మంచిది.
కన్య
కన్యారాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతలు పొందుతారు. వ్యాపారులకు, వారి భాగస్వాములకు మధ్య అనుకూలత ఉంటుంది. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. స్నేహితులతో విహారయాత్రలకు వెళ్తారు. ప్రయాణాలు అనుకూలం. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.
తుల
తులారాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. కుటుంబ సౌఖ్యం, ఆర్థిక లాభాలు అందుకుంటారు. జీవిత భాగస్వామితో ఆహ్లాదకరమైన క్షణాలను గడుపుతారు, వ్యాపార భాగస్వాములతో, సహోద్యోగులతో మంచి సయోధ్య ఉంటుంది. చేపట్టిన పనులలో సునాయాసంగా వేగవంతమైన ఫలితాలు అందుకుంటారు.
వృశ్చికం
వృశ్చికరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ధర్మసిద్ధి, అర్థలాభం ఉన్నాయి. ఎంతో కాలంగా వాయిదా పడిన పనులు పూర్తవుతాయి. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. సంతోషకరమైన వార్తలు వింటారు. మీ మంచితనమే మీకు శ్రీరామరక్ష! ఇష్ట దేవతారాధన శుభకరం.
ధనుస్సు
ధనుస్సు రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి తీవ్రమైన పని ఒత్తిడి ఉంటుంది. చేపట్టిన పనిలో ఆటంకాలు తొలగిపోతాయి. మీ మనోధైర్యమే మిమ్మల్ని కాపాడుతుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మంచిది. సూర్య ఆరాధన శ్రేయస్కరం.
మకరం
మకరరాశి వారికి మీరు ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో ఉత్సాహం తగ్గకుండా చూసుకోండి. కుటుంబ సభ్యుల సహకారంతో కీలకమైన పనిలో పురోగతి సాధిస్తారు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆస్తికి సంబంధించిన వ్యవహారాలపై శ్రద్ధ వహిస్తారు. ఓ సంఘటన విచారం కలిగిస్తుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.
కుంభం
కుంభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అనుకోని ఖర్చులు రావడం వల్ల ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి. వృథా ఖర్చులు నివారిస్తే మంచిది. కుటుంబ సమస్యల పట్ల సంయమనం పాటించడం ద్వారా ప్రశాంతత కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో శ్రమ పెరగవచ్చు.
మీనం
మీనరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. చేపట్టిన పనుల్లో తీవ్ర ఆటంకాలు చికాకు పెడతాయి. సహనం పాటించడం అవసరం. ఆర్థికంగా కఠినమైన పరిస్థితులు ఉండవచ్చు. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే వివాదాలు రావు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.