ఏప్రిల్ 29, మంగ‌ళ‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి ప‌ట్టింద‌ల్లా బంగార‌మే..!

Horoscope | చాలా మంది జ్యోతిష్యాన్ని అనుస‌రిస్తుంటారు. రోజు వారి రాశిఫ‌లాల‌కు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త ప‌నుల‌ను ప్రారంభిస్తారు. దిన ఫ‌లాలు చూడ‌నిదే కొంద‌రు ఏ ప‌ని ప్రారంభించ‌రు. మ‌రి నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

ఏప్రిల్ 29, మంగ‌ళ‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి ప‌ట్టింద‌ల్లా బంగార‌మే..!

మేషం

మేషరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా కాస్త పట్టు విడుపు ధోరణి పాటిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యుల అవసరాలు, కోరికలు మొట్టమొదటి ప్రాధాన్యతగా ఉండాలి. కోపం అదుపులో పెట్టుకోవాలి. ఉన్నతాధికారులతో జాగ్రత్తగా మాట్లాడాలి. మిత్రులతో వాదనల్లోకి దిగి అపవాదుల్ని మీదకు తెచ్చుకోకండి. అనవసర ఖర్చులు పెట్టకండి.

వృషభం

వృషభరాశి రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఆర్థికంగా అభివృద్ధి, ధన లాభం చేకూరే మార్గాలు పుష్కలంగా ఉన్నాయి. అనుకున్నది అనుకున్నట్లుగా జరగడంతో సంతోషంగా ఉంటారు. ప్రారంభించిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. విందు వినోదాల కోసం అధికంగా డబ్బు ఖర్చు చేస్తారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.

మిథునం

మిథునరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఆశించిన ప్రయోజనాల కోసం అధికశ్రమ అవసరం. కోపావేశాలతో తోటి ఉద్యోగులు, ఉన్నతాధికారులతో సమయానుకూలంగా నడుచుకోవాలి. ఎవరితోనూ ఘర్షణలు వద్దు. మొండిపట్టు విడిచిపెట్టి రాజీపడేందుకు ప్రయత్నించండి. విలాసవంతమైన వాటిపై అధికంగా ఖర్చు చేస్తారు.

కర్కాటకం

కర్కాటకరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. బంధుమిత్రులను కలుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలను పట్టుదలతో అధిగమిస్తారు. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. సన్నిహితులతో విహారయాత్రలకు వెళ్లారు. ఖర్చులు పెరగకుండా చూసుకోండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టండి.

సింహం

సింహరాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం , దృఢ నిశ్చయంతో అద్భుతమైన విజయాలు సొంతం చేసుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో విజయవంతంగా పూర్తి చేస్తారు. తారాబలం అనుకూలంగా ఉన్నందున వ్యాపారంలో పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ ఉండవచ్చు. ఆస్తి వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది.

కన్య

కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. కొత్త పనులు ప్రారంభిస్తారు. ఈ అద్భుతమైన రోజు నుండి అత్యధిక ప్రయోజనాన్ని పొందండి. వ్యాపార భాగస్వాముల నుంచి ప్రయోజనాలను పొందవచ్చు. చేపట్టిన అన్ని పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ వాతావరణం ఉల్లాసభరితంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది.

తుల

తులారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో పట్టుదలతో పనిచేస్తే విజయం లభిస్తుంది. కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టేందుకు మంచి రోజు. కీర్తి ప్రతిష్టలు, గౌరవం పెరుగుతాయి. కుటుంబంలో కలహపూరిత వాతావరణం ఉంటుంది. ఆస్తి వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చికం

వృశ్చికరాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో నూతన అవకాశాలు అందుకుంటారు. చేపట్టిన ప్రతీ పనిలోనూ విజయం సాధిస్తారు. మీ పని తీరును ఉన్నతాధికారులు మెచ్చుకుంటారు. సన్నిహితులతో విహారయాత్రలకు వెళ్తారు. సాహసోపేతమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక అంశాలలో శుభ ఫలితాలు ఉంటాయి.

ధనుస్సు

ధనుస్సురాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రియమైనవారు, సన్నిహితులతో మంచి సమయాన్ని గడుపుతారు. చేపట్టిన పనుల్లో సమస్యలు, ఆటంకాలు ఎదురవుతాయి. ఆర్ధిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.

మకరం

మకరరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో రాణించాలంటే పట్టుదల, ఏకాగ్రత అవసరం. లక్ష్యసాధనపై దృష్టి పెట్టండి. సొంత నిర్ణయాల కన్నా సమిష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి. ప్రయాణంలో అప్రమత్తంగా ఉండాలి. ఆర్ధిక నష్టం సంభవించే సూచన ఉంది.

కుంభం

కుంభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఈ రోజంతా చాలా ఇబ్బందులు, ఒత్తిడి వుండే అవకాశం వుంది. తత్ఫలితంగా కోపం, చిరాకు పెరుగుతాయి. చట్టవిరుద్దమైన పనులు చేయవద్దు. ఇతరులను బాధ పెట్టేలా ప్రవర్తించవద్దు. ఇంట్లో శుభకార్యం వలన ఖర్చులు పెరగవచ్చు.

మీనం

మీనరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మంచి విషయాలపై మనసు లగ్నం చేయడం వలన ప్రశాంతత కలుగుతుంది. మొహమాటానికి పోయి చిక్కుల్లో పడే ప్రమాదముంది. బంధువులతో సంబంధబాంధవ్యాలు మెరుగు పరచుకుంటే మంచిది. మీ శక్తియుక్తులను సరైన మార్గంలో వినియోగిస్తే సత్ఫలితాలు ఉంటాయి.