Horoscope | ఏప్రిల్ 30, బుధవారం రాశిఫలాలు.. ఈ రాశివారికి ప్రయాణాలు అనుకూలం..!
Horoscope | చాలా మంది జ్యోతిష్యాన్ని అనుసరిస్తుంటారు. రోజు వారి రాశిఫలాలకు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త పనులను ప్రారంభిస్తారు. దిన ఫలాలు చూడనిదే కొందరు ఏ పని ప్రారంభించరు. మరి నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మేషం
మేషరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. తల పెట్టిన పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేస్తారు. కలహాలకు, వివాదాలకు దూరంగా ఉండాలి. వృత్తి ఉద్యోగాలలో శ్రమ పెరగకుండా చూసుకోండి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.
వృషభం
వృషభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ధర్మబుద్ధితో చేసే పనులు సత్ఫలితాన్నిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో సున్నితంగా నడుచుకోవాలి. కుటుంబ సభ్యుల అభిప్రాయానికి విలువ ఇవ్వడం మంచిది. ఆర్ధిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. వృత్తి పరమైన శుభవార్తలు వింటారు.
మిథునం
మిథునరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి విజయ పరంపర కొనసాగుతుంది. వ్యాపారంలో ధనప్రవాహం ఉంటుంది. ఉద్యోగంలో కోరుకున్న హోదా దక్కడంతో ఆనందంగా ఉంటారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలం. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి.
కర్కాటకం
కర్కాటకరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. గ్రహసంచారం అద్భుతంగా ఉంది కాబట్టి ఈ శుభ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి, పెట్టుబడులు సేకరించడానికి అనుకూలమైన సమయం. ఉద్యోగంలో ఉన్నత స్థానం లభిస్తుంది. స్నేహితుల నుంచి ఆర్థిక సంబంధమైన లబ్ధి ఉండవచ్చు. అవివాహితులకు కల్యాణ సిద్ధి ఉంది.
సింహం
సింహరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. సానుకూల ఆలోచనలతో, కృత నిశ్చయంతో లక్ష్యాలను సాధిస్తారు. ఆర్ధికంగా ఉన్నతస్థానానికి చేరుకుంటారు. సామాజికంగా మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. భూమి, ఆస్తి విషయాల్లో అనుకూలత ఉంటుంది. షేర్ మార్కెట్లో పెట్టుబడులు మంచి లాభాన్ని అందిస్తాయి.
కన్య
కన్యారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఆశించిన ఫలితాలు రాబట్టడానికి శ్రమ పడాల్సివస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో మనోబలం కోల్పోవద్దు. పనిగట్టుకుని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళుంటారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగవద్దు. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఖర్చులు తగ్గించుకోండి.
తుల
తులారాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ధన, వస్త్ర లాభాలున్నాయి. వృత్తి ఉద్యోగాలలో వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వెయ్యాలి. ఎవరితోనూ వాదనల్లోకి దిగవద్దు. మిమ్మల్ని మీరు అదుపులో ఉంచుకోవాలి. మాట్లాడే మాటలు జాగ్రత్తగా మాట్లాడండి. అనుకోకుండా ఆర్థిక లాభం ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.
వృశ్చికం
వృశ్చికరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. మనోధైర్యంతో ముందుకు సాగి సత్ఫలితాలు సాధిస్తారు. అనూహ్యంగా ఆదాయం పెరగడంతో సరదాగా, సంతోషంగా ఉంటారు. స్నేహితులతో విహారయాత్రలకు వెళ్తారు. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. స్థిరాస్తులు పెరుగుతాయి.
ధనుస్సు
ధనుస్సురాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యం, సంపద, సంతోషం, అదృష్టం అన్నీ కలిసివస్తాయి. ఇంటి వాతావరణం ఆనందోత్సాహాలతో ఉంటుంది. ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాల్లో చురుగ్గా వ్యవహరిస్తారు. వృత్తి ఉద్యోగాలలో సహచరుల సహకారంతో సకాలంలో అన్ని పనులు పూర్తి చేస్తారు.
మకరం
మకరరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. నమ్మిన వారి కారణంగా మోసపోతారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు నిరాశ కలిగిస్తాయి. కీలక విషయాలు వాయిదా వేస్తే మంచిది. కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యలు చికాకు కలిగిస్తాయి. జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలతో మనశ్శాంతి లోపిస్తుంది. ఎవరితోనూ వాదనల్లోకి దిగవద్దు.
కుంభం
కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో శుభ ఫలితాలు పొందుతారు. అన్ని రంగాల వారికి చేపట్టిన పనుల్లో పురోగతి ఉంటుంది. విజయకాశాలు మెరుగ్గా ఉన్నాయి. ఆర్థికాభివృద్ధి ఉంటుంది. ఆస్తికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్త వహించండి. వృధా ఖర్చులు నివారించండి.
మీనం
మీనరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి లాభనష్టాలు సరి సమానంగా ఉంటాయి. కీలక వ్యవహారాల్లో ఆచి తూచి నిర్ణయాలు తీసుకోండి. కొన్ని సంఘటనలు విచారం కలిగిస్తాయి. జీవిత భాగస్వామి సహకారం సంపూర్ణంగా ఉంటుంది. విహారయాత్రలు, విందు వినోదాలతో కాలక్షేపం చేస్తారు.