Horoscope | మార్చి 20, గురువారం రాశిఫలాలు.. ఈ రాశివారికి జలగండం.. జరజాగ్రత్త..!
Horoscope | చాలా మంది జ్యోతిష్యాన్ని అనుసరిస్తుంటారు. రోజు వారి రాశిఫలాలకు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త పనులను ప్రారంభిస్తారు. దిన ఫలాలు చూడనిదే కొందరు ఏ పని ప్రారంభించరు. మరి నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మేషం
మేషరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉన్నప్పటికి అధిగమిస్తారు. అస్థిర బుద్ధితో తీసుకునే నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. ఒక సంఘటన బాధ పెడుతుంది. ఆరోగ్యం ఇబ్బంది పెడుతుంది. కుటుంబ సమస్యలతో విసుగుచెందుతారు. బంధువులతో మనస్పర్ధలు రావచ్చు.
వృషభం
వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారు. ఆరోగ్యం నిక్షేపంగా ఉంటుంది. మీ స్నేహితులతోనూ, కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. సమాజంలో పేరు ప్రఖాత్యలు పొందుతారు. దూరదేశాల నుంచి శుభవార్తలు వింటారు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. అనుకోకుండా ధనసంపదలు కలిసి వస్తాయి.
మిథునం
మిథునరాశి వారికి ఈ రోజు విజయవంతంగా ఉంటుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. గృహంలో ప్రశాంత వాతావరణం ఉండవచ్చు . అదనపు ఆదాయం సమకూరుతుంది. అనవసరమైన ఖర్చులు పెరగవచ్చు. ఆరోగ్యం బాగుంటుంది. సన్నిహితుల సహాయ సహకారాలు ఉంటాయి.
కర్కాటకం
కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. పట్టుదలతో కార్యసిద్ధి ఉంటుంది. కుటుంబ వాతావరణం ఆనందోత్సాహాలతో నిండిఉంటుంది. వృత్తి నిపుణులు, ఉద్యోగస్థులు తమ పనితీరుకు ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో చక్కని సమయం గడుపుతారు. ఉద్యోగులకు ప్రమోషన్ ఛాన్స్ ఉంది.
సింహం
సింహరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో చిన్న చిన్న గొడవల కారణంగా ఈ రోజంతా కోపంగా గడుపుతారు. కోప స్వభావాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. ముఖ్యమైన వ్యవహారాల్లో పురోగతి కోసం తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. జలగండం ఉంది కాబట్టి జలాశయాలకు దూరంగా ఉండండి.
కన్య
కన్యారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలకు దూరంగా ఉండటం మంచిది. కఠిన పరిస్థితుల్లో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకండి. ఆస్తి, కోర్టు వ్యవహారాలు వాయిదా వేస్తే మంచిది. కుటుంబ శ్రేయస్సు కోసం పనిచేస్తారు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.
తుల
తులారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పరీక్షా సమయం. ఓర్పు సహనం ఎక్కువగా ఉండాలి. చేపట్టిన ప్రతి పనిలోనూ ఆటంకాలు చికాకు పెడతాయి. ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది. బంధువుల ప్రవర్తన విచారం కలిగిస్తుంది. ఆర్థిక సమస్యలు ఏర్పడకుండా ఖర్చులు అదుపులో ఉంచుకోండి.
వృశ్చికం
వృశ్చికరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో శుభయోగాలున్నాయి. నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. సన్నిహితులతో పర్యాటక ప్రదేశాలలో పర్యటిస్తారు. ఈ రోజంతా ఉత్సాహంగా ఆనందంగా గడుపుతారు. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. శత్రువుల మీద విజయం సాధిస్తారు.
ధనుస్సు
ధనుస్సురాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. మొండి వైఖరితో సమస్యల్లో చిక్కుకుంటారు. కోపావేశాలు అదుపులో ఉంచుకోకపోతే సన్నిహితులతో మనస్పర్థలు ఏర్పడతాయి. కొన్ని సంఘటనలు విచారం కలిగిస్తాయి. ఆర్థిక సమస్యలు ఆందోళన కలిగిస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.
మకరం
మకరరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. బంధుమిత్రులతో కులాసాగా గడుపుతారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. అవివాహితులకు వివాహ సంబంధాలు చూడడానికి మంచి రోజు. స్నేహితుల నుంచి ఆశ్చర్యకరమైన బహుమతి అందుకుంటారు. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలం. ఖర్చులు పెరగకుండా చూసుకోండి.
కుంభం
కుంభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆపదల్లో చిక్కుకునే ప్రమాదముంది. చేపట్టిన పనుల్లో ఆతనకాలు అధిగమిస్తారు. స్థిరమైన నిర్ణయాలతో సత్ఫలితాలు సాధిస్తారు. ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాల కోసం అధిక ధనవ్యయం చేస్తారు. కుటుంబంలో శాంతి నెలకొంటుంది.
మీనం
మీనరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. మీ ప్రతిభకు ప్రశంసలు అందుకుంటారు. అనైతికమైన కార్యకలాపాలకు దూరంగా ఉంటే మంచిది. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి. కోపం అదుపులో ఉంచుకోవాలి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి.