Vastu Tips | ఈ ఐదు మీ ఇంట్లో ఉంటే.. సంపద, సంతోషానికి కొదవ ఉండదట..!
Vastu Tips | మీ ఇంట్లో ఆర్థిక సమస్యలా( Financial Problems )..? సంతోషం( Happiness ) కరువైందా..? అయితే మీరు ఈ ఐదు వస్తువులను ఇంట్లో ఉంచుకుంటే.. సంపద( Wealth ), సంతోషానికి కొదవ ఉండదని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

Vastu Tips | ప్రతి వ్యక్తి తన ఇల్లు సుఖసంతోషాలతో, సంపదతో కళకళలాడాలని కోరుకుంటారు. కానీ కొన్ని పొరపాట్లు చేయడం కారణంగా అవి జరగవు. అంటే వాస్తు పరంగా కొన్ని నియమాలు పాటిస్తేనే ఆ ఇంట అష్టైశ్వర్యాలు సమకూరుతాయి. సంపద( Wealth ), సంతోషం( Happiness ) కలగాలంటే ప్రతి ఇంట్లో ఈ ఐదు వస్తువులు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడు తప్పకుండా సంతోషానికి, సంపదకు ఆ ఇంట్లో కొదవ ఉండదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. మరి ఆ ఐదు వస్తువులు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం..
తులసి మొక్క( Tulasi Plant )
ప్రతి ఇంటి ముందు తులసి మొక్క ఉంటుంది. ఇక ఈ తులసి మొక్క వద్ద పూజలు కూడా చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ప్రతికూల శక్తిని తొలగించి, సానుకూల శక్తిని పెంపొందిస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆ ఇంట్లో సంపద పెరిగి, సంతోషాలు వెల్లివిరుస్తాయట. అయితే తులసిని ఇంటి ఆవరణలో ఈశాన్యం లేదా తూర్పు దిశలో పెట్టడం మంచిదని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
వెదురు మొక్క( Bamboo Plant )
వాస్తు శాస్త్రంలో వెదురు మొక్కకు అధిక ప్రాధాన్యత ఉంది. ఇది చాలా మంది నివాసాల్లో కనిపించదు. కానీ ప్రతి ఇంట్లో వెదురు మొక్కను ఉంచుకోవాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. వెదురు మొక్కను ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఆర్థిక సమస్యలు తొలిగిపోయి, డబ్బు సమకూరుతుందట. అదృష్టానికి చిహ్నమైన ఈ మొక్కను లివింగ్ రూమ్లో ఆగ్నేయ దిశలో ఉంచడం వలన ఆర్థికంగా కలిసి వస్తుందంట.
తాబేలు( Tortoise )
తాబేలు విగ్రహాలు చాలా మంది తమ నివాసాలతో పాటు కార్యాలయాల్లోనూ ఏర్పాటు చేసుకుంటుంటారు. సంపదకు, స్థిరత్వాన్ని చిహ్నమైన తాబేలు విగ్రహాలను ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఆ ఇంట సంపద పెరుగుతుందట. అదృష్టం కూడా కలిసివస్తుందట. అయితే దీనిని ఉత్తర దిశలో ఉంచడం వలన అన్ని విధాలా కలిసి వస్తుందంట.
లాఫింగ్ బుద్ధ( Laughing Buddha )
ఇల్లు నిత్యం సుఖసంతోషాలతో వెల్లివిరియాలంటే లాఫింగ్ బుద్ధను ఇంట్లో ఉంచుకోవాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. లాఫింగ్ బుద్ధ వల్ల ఆ ఇంట్లో అదృష్టం కూడా వరిస్తుందట. శ్రేయస్సు, సానుకూల శక్తి పెరుగుతుందట. దీనిని ఇంటి ప్రధాన ద్వారం వద్ద పెట్టడం చాలా మంచిదని చెబుతున్నారు వాస్తు నిపుణులు.
చేపల అక్వేరియం( Fish Aquarium )
ఇంట్లో అక్వేరియం ఉంచుకోవడం వల్ల ఇంటి వాతావరణం బాగుంటుంది. అలాగే ఇది ఇంట్లో సానుకూలతను పెంచుతుంది. చేపల కదలికలు జీవితంలో పురోగతి మరియు సంపద ప్రవాహాన్ని సూచిస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.