Love Propose | శుక్రవారం ఈ సమయాల్లో లవ్ ప్రపోజ్ చేస్తే.. వంద శాతం సక్సెస్ అవుతుందట..!
Love Propose | మీరు ప్రేమించాలనుకుంటున్నారా..? అవతలి వ్యక్తి మిమ్మల్ని ఇష్టపడటం లేదా..? తరుచూ రిజెక్టు( Reject ) చేస్తున్నారా..? అయితే ఆలస్యం ఎందుకు.. శుక్రవారం ఈ మూడు సమయాల్లో లవ్ ప్రపోజ్( Love Propose ) చేస్తే వంద శాతం సక్సెస్ అవుతుందంట..

Love Propose | హిందువులు( Hindus ) శుక్రవారాన్ని ఎంతో పవిత్ర దినంగా భావిస్తారు. ఈ రోజున లక్ష్మీదేవి( Lakshmi Devi )కి పూజలు చేస్తుంటారు. తమ ఇంట్లో ధనం కలగాలని, అప్పుల పాలు కాకూడదని ఎంతో భక్తిశ్రద్ధలతో లక్ష్మీదేవిని ఆరాధిస్తుంటారు. లక్ష్మీదేవిని పూజించడంతో పాటు లక్ష్మీ కటాక్షం కలగడమే కాకుండా ఇంకా ఎన్నో మంచి ఫలితాలను పొందొచ్చని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
ఇక లక్ష్మీ వారమైన శుక్రవారం రోజు ప్రేమికులకు( Lovers ) గొప్పదినం అని పండితులు చెబుతున్నారు. శుక్రవారం రోజు ఎవరైనా సరే.. నచ్చిన వారికి లవ్ ప్రపోజల్( Love Propose ) చేస్తే వంద శాతం సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుందట. అయితే శుక్రవారం ఉదయం 6 నుంచి 7, మధ్యాహ్నం 1 నుంచి 2, రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య శుక్ర హోరు ఉంటుందని, ఈ సమయాల్లో లవ్ ప్రపోజ్ చేస్తే రిజెక్టు చేసే అవకాశం తక్కువగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. కాబట్టి మీ ప్రేమను వ్యక్తపరచడం కోసం ఈ సమయాలను ఎంపిక చేసుకొని, మీకు నచ్చిన వారికి ప్రపోజ్ చేయండి.
అలాగే శుక్రవారం విలాస వస్తువులు కొనుగోలు చేస్తే చాలా మంచిందని తెలిపారు. నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించడానికి శుక్రవారం అనుకూలమైన రోజని అంటున్నారు. బంగారం కొనుగోలు చేయడానికి శుక్రవారం చాలా మంచిదని చెబుతున్నారు. ఇంకా శుక్ర హోరు సమయంలో నూతన అభరణాలు, గాజులు, పువ్వులు, పండ్లు, సెంట్ సీసాల లాంటి డెకరేటివ్ వస్తువులు కొనుక్కుంటే లక్ష్మీ కటాక్షం విశేషంగా కలుగుతుందన్నారు.
శుక్రవారం ఉదయం 6 -7 గంటల మధ్యలో ఉప్పు కొంటే చాలా మంచిది. ఒక గాజు గిన్నెలో ఉప్పు, పసుపు, కుంకుమ కలిపి పూజ గదిలో ఉంచితే శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. వ్యవసాయ దారులు కర్జూర, రేగి, సీతాఫలం, బత్తాయి, నారింజ లాంటి పంటలు శుక్రవారం వేయడం మంచిది. ఇలా చేస్తే అదృష్టం బాగా కలిసివస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.