Devi Navaratri 2024 | సంతాన ప్రాప్తి కోసం.. నవరాత్రుల్లో అమ్మవారిని ఈ పూలతో పూజించండి..!
Devi Navaratri 2024 | దసరా( Dasara ) వేడుకల నేపథ్యంలో దేవీ నవరాత్రులు( Devi Navaratri )ప్రారంభమయ్యాయి. భక్తులు తొమ్మిది రోజుల పాటు తొమ్మిది ప్రత్యేక రూపాల్లో అమ్మవారిని ఆరాధిస్తూ.. పూజలు( Puja ) చేస్తుంటారు. కోరుకున్న కోరికలు ఫలించేలా చూడాలని అమ్మవారిని ప్రార్థిస్తుంటారు.

Devi Navaratri 2024 | దేవీ నవరాత్రులు( Devi Navaratri ) నిన్నటి నుంచి ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజుల పాటు కొనసాగే ఈ దేవీ నవరాత్రుల్లో.. అమ్మవారిని భక్తులు( Devotees ) ఆరాధిస్తుంటారు. అమ్మవారికి ఇష్టమైన పుష్పాలతో( Flowers ) పూజిస్తే మనం కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఎన్నో ప్రయోజనాలు కూడా కలుగుతాయని తెలియజేస్తున్నారు. అయితే సంతాన ప్రాప్తి( Child Birth ) కోసం ఎదురుచూస్తున్న దంపతులు( Couples ) ఈ ప్రత్యేకమైన పూలతో పూజిస్తే.. అమ్మవారి అనుగ్రహంతో తప్పకుండా ఆ కోరిక ఫలిస్తుందట. అలాగే కొన్ని రకాల పుష్పాలను అమ్మవారి పూజకు ఎట్టి పరిస్థితుల్లో కూడా వినియోగించకూడదు అని పండితులు సూచిస్తున్నారు.
అమ్మవారి పూజకు వినియోగించాల్సిన పుష్పాలు ఇవే:
పద్మ పుష్పాలు
పద్మ పుష్పాలు అమ్మవారికి ఎంతో ఇష్టం. ఈ పూలతో అమ్మవారిని పూజిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుందని పండితులు చెబుతున్నారు. అంతేకాకుండా సంతాన ప్రాప్తి కూడా కలుగుతుందని దేవీ భాగవతంలో చెప్పినట్లు పండితులు పేర్కొంటున్నారు.
గన్నేరు పూలు
దేవీ నవరాత్రుల్లో అమ్మవారిని గన్నేరు పూలతో పూజిస్తే మంత్ర సిద్ధి త్వరగా కలుగుతుంగదని చెబుతున్నారు. ఇంకా సినీ, రాజకీయ, సోషల్ మీడియా ఇన్ప్లూయెన్సర్లు.. ముఖ్యంగా ఎర్ర గన్నేరు పూలతో పూజిస్తే విపరీతమైన జనాకర్షణ, ప్రజాదరణ కలుగుతుందని తెలుపుతున్నారు.
పారిజాత పుష్పం
కాలసర్ప దోష తీవ్రతను తగ్గించుకోవడానికి అమ్మవారిని పూజించేటప్పుడు పారిజాత పుష్పం సమర్పించాలని చెబుతున్నారు. ఇలా చేస్తే దోషం నుంచి బయట పడవచ్చని వివరిస్తున్నారు.
ఎర్ర మందార పూలు
ఎదుటి వారి ఏడుపు, దిష్టి, అంతర్గత శత్రువులు ఎక్కువగా ఉన్నవారు ఎర్ర మందారాలతో పూజిస్తే ఈ బాధలన్నీ తొలగిపోతాయని వివరించారు.
మరి మల్లెపూలు వాడొచ్చా..?
చండీ అమ్మవారు కూడా ఉగ్రత్వంతో ఉంటుందని.. ఆమెను శాంతింపచేసేలా మల్లెపూలతో పూజించరాదని పండితులు చెబుతున్నారు. అయితే, చండీ దేవత మినహ ఇతర దేవతా స్వరూపాలను నవరాత్రుల్లో మల్లెపూలతో పూజిస్తే విశేషమైన ధనప్రాప్తి పెరుగుతుందని.. వృథా ఖర్చులు తగ్గిపోతాయని చెబుతున్నారు.