Vada Mala | హనుమంతుడికి వడమాల సమర్పించి పూజిస్తే.. శని బాధలు ఉండవట..!
Vada Mala | హనుమంతుడికి మంగళవారం ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. ప్రతి మంగళవారం భక్తులు హనుమంతుడిని( Hanuman ) ఎంతో భక్తిశ్రద్ధలతో పూజిస్తుంటారు. తద్వారా ఆ ఇంట్లో సంతోషాలు వెల్లివిరుస్తాయని నమ్మకం. ఆంజనేయుడికి ఎంతో ఇష్టమైన సింధూరం( Sindhuram), తమలపాకులు, వడమాల( Vada mala )తో పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయట.

Vada Mala | హనుమంతుడికి మంగళవారం ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. ప్రతి మంగళవారం భక్తులు హనుమంతుడిని( Hanuman ) ఎంతో భక్తిశ్రద్ధలతో పూజిస్తుంటారు. తద్వారా ఆ ఇంట్లో సంతోషాలు వెల్లివిరుస్తాయని నమ్మకం. ఆంజనేయుడికి ఎంతో ఇష్టమైన సింధూరం( Sindhuram), తమలపాకులు, వడమాల( Vada mala )తో పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయట. అంతేకాకుండా శని బాధలు తొలగిపోయి.. జీవితమంతా సంతోషంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. మరి వడమాల పూజ ఎందుకు చేస్తారో తెలుసుకుందాం..
వడమాల సమర్పించడం వెనుకున్న రహస్యం ఇదే..
హనుమంతుడి ఆలయాలన్నీ ప్రతి మంగళవారం భక్తులతో కిటకిటలాడుతుంటాయి. ఇక ఆంజనేయుడికి మొక్కులు చెల్లించుకుంటుంటారు. కొంత మంది భక్తులు స్వామి వారికి విశేషంగా వడమాలలు సమర్పిస్తూ ఉంటారు. ఇలా చేయడం వెనుక ఉన్న రహస్యం ఏంటంటే, హనుమంతుడు ఒకసారి రావణుడి నుంచి శని దేవుడిని రక్షించాడు. అందుకుగాను శని దేవుడు హనుమంతుడిని ఆశీర్వదించి, హనుమను కొలిచిన వారికి శని బాధలు ఉండవని ఒక వరం ఇస్తాడు. కావున శనిదేవునికి ప్రీతిపాత్రమైన మినుములతో తయారు చేసిన వడలను మాలగా చేసి వాయుపుత్రుడికి సమర్పించినట్లైతే శని భగవానుని అనుగ్రహం పొంది మనలను పీడించే శని బాధల నుంచి ఉపశమనం పొందవచ్చు. అందుకే శని బాధలతో సతమతమయ్యేవారు మంగళవారం ఆంజనేయుడికి వడమాల సమర్పిస్తుంటారు.
ఈ శ్లోకం పఠిస్తే.. ఎంతటి కష్టమైనా పనైనా సులభంగా పూర్తవుతుంది..
క్లిష్ట సమయాలలో అసాధ్యం అనుకున్న కార్యం సాధ్యం చేసుకోవాలంటే ఒంటె వాహనారూఢుడైన హనుమను దర్శించుకుంటే ఏ కార్యమైనా సాధించ గల మనోధైర్యం కలుగుతుంది. అలాగే ‘అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వధ రామదూతం కృపాసింధుమ్ మత్కార్యం సాధయ ప్రభో !’ అను ఈ శ్లోకాన్ని మంగళవారం చదువుకుంటే ఎంతటి కష్టమైనా పని అయినా హనుమంతుడి అనుగ్రహంతో సులభంగా పూర్తి అవుతుంది అని పండితులు అంటున్నారు.