తిరుమలలో ఉదయం నుంచి వర్షం
విధాత: తిరుమలలో వేకువజామున నుండి ఓ మోస్తరు వర్షం కురుస్తుంది. ఈ సందర్భంగా టీటీడీ ఘాట్ రోడ్డులలో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోగా నాలుగ చక్రాల వాహనాల రాకపోకలు యధావిధిగా కొనసాగుతున్నాయి. వర్షం నిలిచిన సమయాల్లో మాత్రం టిటిడి విజిలెన్స్ విభాగం ద్విచక్ర వాహనాలను అనుమతిస్తుండగా శ్రీవారి పాదాలు, పాపవినాశనం మార్గాలను మూసివేశారు. అక్కడక్కడా వృక్షాలు విరిగిపడుతుండడంతో టీటీడీ సిబ్బంది వెనువెంటనే శుభ్రం చేస్తున్నారు. కాగా అలిపిరి కాలినడక మార్గం కొనసాగుతున్నది.

విధాత: తిరుమలలో వేకువజామున నుండి ఓ మోస్తరు వర్షం కురుస్తుంది. ఈ సందర్భంగా టీటీడీ ఘాట్ రోడ్డులలో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోగా నాలుగ చక్రాల వాహనాల రాకపోకలు యధావిధిగా కొనసాగుతున్నాయి.
వర్షం నిలిచిన సమయాల్లో మాత్రం టిటిడి విజిలెన్స్ విభాగం ద్విచక్ర వాహనాలను అనుమతిస్తుండగా శ్రీవారి పాదాలు, పాపవినాశనం మార్గాలను మూసివేశారు. అక్కడక్కడా వృక్షాలు విరిగిపడుతుండడంతో టీటీడీ సిబ్బంది వెనువెంటనే శుభ్రం చేస్తున్నారు. కాగా అలిపిరి కాలినడక మార్గం కొనసాగుతున్నది.