తిరుమల: శ్రీవారి ఆలయ ఓయస్డీ డాలర్ శేషాద్రి హఠన్మరణం

విధాత : తిరుమల శ్రీవారి ఆలయ ఓయస్డీ డాలర్ శేషాద్రి హఠన్మరణం చెందారు. వైజాగ్ లో కార్తీక దీపోత్సవం కార్య క్రమంలో పాల్గొనడానికి వెళ్ళిన ఆయన నిన్న సాయంత్రం సింహా చలం వరాహా లక్ష్మి నృసింహ్మస్వామి వారిని దర్శించుకున్నారు. నేడు (సోమవారం) ఆర్కేబీచ్ లో టీటీడీ నిర్వహించనున్న కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉండగా ఈ వేకువ జామున గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించే లోపు మృతి చెందారు. డాలర్ శేషాద్రి గారు 1978 వ సంవత్సరం […]

తిరుమల: శ్రీవారి ఆలయ ఓయస్డీ డాలర్ శేషాద్రి హఠన్మరణం

విధాత : తిరుమల శ్రీవారి ఆలయ ఓయస్డీ డాలర్ శేషాద్రి హఠన్మరణం చెందారు. వైజాగ్ లో కార్తీక దీపోత్సవం కార్య క్రమంలో పాల్గొనడానికి వెళ్ళిన ఆయన నిన్న సాయంత్రం సింహా చలం వరాహా లక్ష్మి నృసింహ్మస్వామి వారిని దర్శించుకున్నారు.

నేడు (సోమవారం) ఆర్కేబీచ్ లో టీటీడీ నిర్వహించనున్న కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉండగా ఈ వేకువ జామున గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించే లోపు మృతి చెందారు.

శేషాద్రి గారి చివరి ఫొటో

డాలర్ శేషాద్రి గారు 1978 వ సంవత్సరం నుంచి శ్రీవారి సేవలో తరిస్తున్నారు. ఐతే 2007లో రిటైర్మెంట్ అయినా.. శేషాద్రి సేవలు టీటీడీకి తప్పనిసరి కావడంతో ఒయస్డీగా కొనసాగిస్తు చివరి క్షణం వరకు స్వామి సేవలో తరించారు.