మంగ‌ళ‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి ఈ రోజు ఒక శుభ‌దినంగా మిగిలిపోతుంది..!

Today Horoscope | చాలా మంది జ్యోతిష్యాన్ని అనుస‌రిస్తుంటారు. రోజు వారి రాశిఫ‌లాల‌కు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త ప‌నుల‌ను ప్రారంభిస్తారు. దిన ఫ‌లాలు చూడ‌నిదే కొంద‌రు ఏ ప‌ని ప్రారంభించ‌రు. మ‌రి నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మంగ‌ళ‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి ఈ రోజు ఒక శుభ‌దినంగా మిగిలిపోతుంది..!

మేషం

మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు వారి రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఆదాయం వృద్ధి చెందుతుంది.

వృషభం

వృషభరాశి వారికి ఈ రోజు సంతోషకరమైనది. మీ జీవితంలో ఈ రోజు ఒక శుభదినంగా మిగిలిపోతుంది. మానసిక ఆనందం కలిగే సంఘటనలు జరుగుతాయి. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాల్లో చక్కని పురోగతి ఉంటుంది. విశేషమైన ఆర్థిక లాభాలున్నాయి. సన్నిహితులతో ఆహ్లాదంగా గడుపుతారు.

మిథునం

మిథునరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ముఖ్యమైన పనులను వాయిదా వేయడం మంచిది. వ్యాపారంలో ఏర్పడే ఒడుదొడుకులు మీకు మానసికంగా ఇబ్బంది కలగవచ్చు.

కర్కాటకం

కర్కాటకరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. తెలియని బాధతో విచారంగా ఉంటారు. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తారు. మీ అర్హతలకు తగిన ఉద్యోగం రావాలంటే మరి కొంతకాలం వేచి ఉండక తప్పదు. ఆత్మవిశ్వాసంతో ఉంటే మంచిది. ఈ సమయంలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి.

సింహం

సింహరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అందరితో స్నేహంగా ఉండటం మీ సహజ స్వభావం కాబట్టి ప్రతి ఒక్కరు మిమ్మల్ని ఇష్టపడతారు. సన్నిహితులతో సంబంధాలు, అనుబంధాలు దృఢ పడతాయి. వృత్తి వ్యాపారాల్లో అసాధారణమైన విజయాలను సాధిస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది.

కన్య

కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. మీ మాట తీరుతో ఇతరులను ఆకట్టుకుంటారు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఎప్పటినుంచో వాయిదా పడిన పనులు ఈ రోజు పూర్తయ్యే అవకాశాలున్నాయి. అనుకోని అదృష్టం మీ ఆనందానికి కారణమవుతుంది.

తుల

తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ రంగాలవారు పనిలో చూపించే నైపుణ్యం మంచి గుర్తింపునిస్తుంది. ఇతరుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. ఆర్థికంగా బలపడతారు.

వృశ్చికం

వృశ్చికరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. ఆర్ధికంగా అభివృద్ధి చెందుతారు. కుటుంబ వ్యవహారాల్లో గొడవకు దారితీసే పరిస్థితులు ఉండవచ్చు కాబట్టి మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.

ధనుస్సు

ధనుస్సురాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. లాభాలు సంతృప్తికరంగా ఉంటాయి. కుటుంబంలో కలహాలు ఏర్పడవచ్చు. కోపావేశాలు తగ్గించుకుంటే మంచిది. సహనంతో ఉంటే మంచిది.

మకరం

మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. గత కొంత కాలంగా వేధిస్తున్న సమస్యలు దూరమై ప్రశాంతంగా ఉంటారు. వృత్తి వ్యాపారాల్లో ఎదుగుదల ఉంటుంది. ఉద్యోగస్థులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ప్రమోషన్ అందుకుంటారు. ఆర్ధిక ప్రయోజనాలు కూడా ఉంటాయి.

కుంభం

కుంభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యాపారస్థులకు పోటీదారులతో అనవసర వాదనలు ఏర్పడవచ్చు. సమయానుకూలంగా నడుచుకుంటే మంచిది. స్వల్ప అనారోగ్య సమస్యలుండవచ్చు. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

మీనం

మీనరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో చెప్పుకోద‌గిన మార్పులేమీ ఉండవు. అవసరానికి ధనం చేతికి అందుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తే మంచిది. జీవిత భాగస్వామితో విందు వినోదాల్లో పాల్గొంటారు.