Vastu Tips to CCTV Cameras | బీ కేర్ఫుల్.. సీసీటీవీ కెమెరాలకు కూడా వాస్తు నియమాలు..!
Vastu Tips to CCTV Cameras | మీరు మీ ఇంటి( House ) భద్రత కోసం, మీ పిల్లల రక్షణ కోసం సీసీటీవీ కెమెరాలను( CCTV Cameras ) ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నారా..? అయితే బీ కేర్ ఫుల్( Be Care Full ). ఎక్కడంటే అక్కడ, ఏ దిశలో అంటే ఆ దిశలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవద్దట. ఈ కెమెరాల ఏర్పాటుకు కూడా వాస్తు నియమాలు( Vastu Tips ) ఉన్నాయట.

Vastu Tips to CCTV Cameras | ఇంటి( House ) నిర్మాణంతో పాటు ఇతర నిర్మాణాలకు ప్రతి ఒక్కరూ వాస్తు నియమాలు( Vastu Tips ) పాటిస్తుంటారు. ఇక ఇంటి నిర్మాణం తర్వాత చెప్పుల స్టాండ్ నుంచి మొదలుకుంటే.. భోజనం చేసే డైనింగ్ హాల్, నిద్రించే బెడ్రూం( Bed Room ) వరకు ప్రతి విషయంలో తూచా తప్పకుండా వాస్తు నియమాలను కచ్చితంగా పాటిస్తుంటారు. వీటన్నింటి విషయంలో వాస్తు నియమాలు పాటించే వారు.. ఆ ఇంటి రక్షణ కోసం ఏర్పాటు చేసుకునే సీసీటీవీ కెమెరాల( CCTV Cameras ) విషయంలో మాత్రం వాస్తు నియమాలు పాటించరు. ఇంటి పరిసరాల్లో ఎక్కడంటే ఎక్కడ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఆ ఇంటికి ముప్పు పొంచి ఉంటుందని వాస్తు పండితులు( Vastu Experts ) హెచ్చరిస్తున్నారు. సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు కచ్చితంగా వాస్తు నియమాలు పాటించాలని సూచిస్తున్నారు. మరి ఏ దిశలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలి.. ఏ దిశలో ఏర్పాటు చేయకూడదో ఈ కథనంలో తెలుసుకుందాం.
సీసీటీవీ కెమెరాల ఏర్పాటు.. జాగ్రత్తలు..
- పొరపాటున కూడా ఆగ్నేయం, నైరుతి, పశ్చిమ, వాయువ్య దిశల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయకూడదట. ఒక వేళ ఈ దిశల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తే.. ఆ ఇంట్లో అనేక రకాల సమస్యలు ఉత్పన్నమై, గొడవలు జరిగే అవకాశం ఉందని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
- అయితే సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు వాస్తు ప్రకారం ఈశాన్య దిశ సరైందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఈ దిశలో రెండు కెమెరాలు ఏర్పాటు చేసినట్లైతే.. ఎదురెదురు దిశల్లో ఉండకూడదట. ఒక వేళ అలా అమర్చితే విబేధాలు పెరుగుతాయట.
- ఇక నైరుతి దిశలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం కారణంగా ఆ ఇంట్లో ఆర్థిక నష్టం సంభవించడంతో పాటు దొంగతనాలు జరిగే అవకాశం ఉంటుందట.
- గోదాముల వద్ద సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు ఉత్తరం లేదా తూర్పు దిశ ఉత్తమమట. వ్యాపార ప్రదేశాల్లో కెమెరాలు ఎప్పుడూ దక్షిణం, నైరుతి దిశల్లో ఉంచకూడదు.. ఇది వ్యాపారంలో ప్రతికూల శక్తికి కారణం అవుతుంది. ఆర్థికంగా నష్టపోతారు. కాబట్టి మీరు మీ ఇంటి వద్ద కానీ, వ్యాపార ప్రదేశంలో కానీ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. సో బీ కేర్ ఫుల్.