2 జూన్ నుంచి 8 తేదీ వరకు.. ఈ వారం మీ రాశిఫలం ఎలా ఉందంటే..?
చాలా మంది జ్యోతిష్యాన్ని అనుసరిస్తుంటారు. రోజు వారి రాశిఫలాలకు అనుగుణంగా శుభ కార్యాలు, కొత్త పనులను ప్రారంభిస్తారు. దిన ఫలాలు చూడనిదే కొందరు ఏ పని ప్రారంభించరు. మరి ఈ వారం రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మేషం
మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. రాజకీయనాయకులు వారం చివరకు ముఖ్యమైన పదవి లేదా బాధ్యతలు చేపడతారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు విజయం ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఉద్యోగులకు స్థాన చలనం ఉండవచ్చు. ఆర్ధికంగా ఆశించిన ప్రయోజనాలను పొందుతారు. వారం ప్రారంభంలో వృత్తి, వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి అద్భుతమైన అవకాశం ఉంటుంది. మీ వృత్తికి మీరు ఎంత ఎక్కువ సమయం కేటాయిస్తే అంత గొప్ప విజయం సాధిస్తారు.
వృషభం
వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. రాజకీయ నాయకులకు విజయావకాశాలు మెరుగ్గా ఉన్నాయి. గతంలో రావలసిన బకాయిలు చేతికి అందుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగులకు పని ప్రదేశంలో అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ప్రత్యర్థులు లక్ష్యం నుంచి మీ దృష్టిని మరల్చడానికి ప్రయత్నించవచ్చు. జాగ్రత్తగా ఉండండి. ఇంటి మరమ్మతుల నిమిత్తం అధిక ధనవ్యయం ఉంటుంది. ఆదాయ వృద్ధి ఉంటుంది. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
మిథునం
మిథునరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సంతానానికి సంబంధించిన శుభవార్తలతో ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. రాజకీయ నాయకులు దైవబలంతో అనుకున్నది సాధించగలుగుతారు. వృత్తివ్యాపార రంగాల వారు విజయం కోసం తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం. వ్యాపారులు వ్యాపార నిమిత్తం దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. ఉద్యోగులకు స్థాన చలనం ఉండవచ్చు. మారుమూల ప్రాంతాలకు బదిలీ కావడం వల్ల కొంత నిరుత్సాహంగా ఉంటారు.
కర్కాటకం
కర్కాటక రాశి వారికి ఈ వారం అంత అనుకూలంగా లేదు. ఆదాయానికి మించిన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. రాజకీయ నాయకులకు ఆశించిన ప్రయోజనాలు ఉండకపోవచ్చు. షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టిన వారు భారీ నష్టాలను చవి చూస్తారు. వ్యాపారులకు బిజినెస్లో డబ్బులు ఆగిపోయి తీవ్ర ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉద్యోగులు పని ప్రదేశంలో అనుకోని సమస్యలు, సవాళ్లు ఎదురవుతాయి.
సింహం
సింహరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. లక్ష్య సాధన కోసం తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. ఉద్యోగులకు కోరుకున్న చోటికి బదిలీ, ప్రమోషన్ ఛాన్స్ ఉంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. రాజకీయ నాయకులకు ఆశించిన ఫలితాలు ఉంటాయి. వారం మధ్యలో కుటుంబ సభ్యులతో విభేదాలు రావచ్చు. సన్నిహితులతో విందు వినోదాలలో పాల్గొంటారు. వ్యాపారులకు భాగస్తులతో కొన్ని అపార్థాలు ఉండవచ్చు. ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుంటే సమస్యలు ఉండవు. కుటుంబంలో అశాంతి నెలకొంటుంది.
కన్య
కన్యారాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. కుటుంబంలో ఘర్షణ వాతావరణం నెలకొంటుంది. వ్యాపారులకు దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ప్రయాణంలో తప్పకుండా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వృత్తి వ్యాపార నిపుణులకు సామాన్య ఫలితాలు ఉంటాయి. ఖర్చులు ఆదాయాన్ని మించి ఉంటాయి. విలాసాల కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. పిల్లల భవిష్యత్ పట్ల ఆందోళన నెలకొంటుంది. రాజకీయ నాయకులు ఆశించిన ఫలితాలు పొందటానికి అవకాశం ఉంది.
తుల
తులారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యాపారులకు అనుకోని సవాళ్లు ఎదురవుతాయి. ఉద్యోగులు ఆశించిన ప్రయోజనాలు పొందటానికి తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. ఆర్ధిక వ్యవహారాల పట్ల అప్రమత్తంగా ఉండడం అవసరం. విద్యార్థులు చదువు పట్ల నిరాసక్తత చూపుతారు. మీ లక్ష్యం నుంచి పక్కకు తప్పుకోవద్దు. నిరాశను వీడి ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే లక్ష్యాన్ని చేరుకుంటారు. ఇంటి అవసరాల కోసం అధిక ధనవ్యయం ఉంటుంది.
వృశ్చికం
వృశ్చికరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు చేపట్టిన పనుల్లో విజయాన్ని సాధిస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. లేకుంటే పనులకు ఆటంకాలు కలుగవచ్చు. వ్యాపారులకు వ్యాపారంలో హెచ్చు తగ్గులు ఉండవచ్చు. కీలమైన వ్యక్తులతో సమావేశమవుతారు. నిర్ణయాలు మీకు అనుకూలంగా వస్తాయి. రాజకీయ నాయకులు అఖండ విజయాన్నిసాధిస్తారు. కుటుంబ సభ్యులతో విహార యాత్రలకు వెళ్తారు.
ధనుస్సు
ధనుస్సు రాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రంగాలవారికి ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. ఆర్ధికంగా బలోపేతం అవుతారు. ఆదాయ వృద్ధి ఉంటుంది. ఉన్నతాధికారుల ప్రశంసలను పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి ఉంది. కుటుంబ సభ్యులతో విహార యాత్రలకు వెళతారు. ఆరోగ్యం బాగుంటుంది. రాజకీయ నాయకులకు శుభసమయం నడుస్తోంది.
మకరం
మకరరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. భూతగాదాలు, ఆస్తి వ్యహారాలు కోర్టు బయట పరస్పర అంగీకారంతో పరిష్కరించుకుంటే మేలు. ఉద్యోగులకు సహోద్యోగుల సహకారం లోపిస్తుంది. పనిలో ఎదురయ్యే సవాళ్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటారు. సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యులతో విహార యాత్రలకు వెళ్తారు. కుటుంబ సంబంధాల పట్ల, ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం.
కుంభం
కుంభరాశి వారికి ఈ వారం అనుకూలంగా లేదు. రాజకీయనాయకులు దైవబలంపై విశ్వాసం ఉంచితే మంచి ఫలితాలు ఉంటాయి. వ్యాపారులకు రుణభారం పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. ఖర్చులు ఆదాయాన్ని మించి ఉంటాయి. ముఖ్యమైన పత్రాలపై సంతకాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. నూతన ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తారు.
మీనం
మీనరాశి వారికి ఈ వారం సామాన్య ఫలితాలు ఉంటాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు శ్రేయోభిలాషుల సలహాను తప్పనిసరిగా పాటించాలి. వారం చివరలో శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. రాజకీయనాయకులకు ఆశించిన మేర ప్రయోజనాలు ఉండే అవకాశం ఉంది. వ్యాపారులు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. లేకపోతే భారీ నష్టాలు ఉండవచ్చు. ఉద్యోగులకు ఆశించిన ప్రయోజనాల కోసం తీవ్రంగా శ్రమించాలి. అవివాహితులకు వివాహం నిశ్చయం కావచ్చు. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. ఆరోగ్యం సహకరిస్తుంది.