Shastipoorthi | ‘షష్ఠి పూర్తి’ ఎందుకు చేసుకోవాలి.. దాని ప్రయోజనం మీకు తెలుసా..?
Shastipoorthi | పురుషుడి వయసు 60 ఏళ్లు నిండగానే షష్ఠి పూర్తి వేడుక నిర్వహిస్తారు. అయితే ఎగువ మధ్యతరగతి వాళ్లు, సంపన్నులే ఎక్కువగా ఈ వేడుక జరుపుకుంటారు. మధ్యతరగతి, పేద వర్గాల్లో ఇది అంతగా కనిపించదు. అయితే మనిషి జీవితకాలంలో సగం పూర్తయిన తర్వాత జరుపుకునే ఈ క్రతువు చాలా ముఖ్యమైనదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ షష్ఠి పూర్తి వేడుక జరుపుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలియజేస్తున్నాయి.

Shastipoorthi : పురుషుడి వయసు 60 ఏళ్లు నిండగానే షష్ఠి పూర్తి వేడుక నిర్వహిస్తారు. అయితే ఎగువ మధ్యతరగతి వాళ్లు, సంపన్నులే ఎక్కువగా ఈ వేడుక జరుపుకుంటారు. మధ్యతరగతి, పేద వర్గాల్లో ఇది అంతగా కనిపించదు. అయితే మనిషి జీవితకాలంలో సగం పూర్తయిన తర్వాత జరుపుకునే ఈ క్రతువు చాలా ముఖ్యమైనదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ షష్ఠి పూర్తి వేడుక జరుపుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలియజేస్తున్నాయి.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనిషి సంపూర్ణాయుష్షు నూట ఇరవై సంవత్సరాలు. అర్ధాయష్షు అంటే అరవై ఏళ్లు నిండేసరికి వివిధ గ్రహాలు జాతకుని జన్మ కుండలిలోని స్థానాలకు వచ్చి చేరతాయి. పుట్టిన సంవత్సరమే మళ్లీ పునరావృతం అవుతుంది. ఆ సందర్భంలో గ్రహ సంధులవల్ల కొన్ని దోషాలు కలిగే అవకాశం ఉంది. అంతేగాక అప్పటివరకు గడచిన అరవై ఏళ్లలో చేసిన పాపఫలం రెండో ఆవృత్తంలో అంటే 61 నుంచి 120 ఏండ్లు వచ్చే వరకు అనుభవించాల్సి వస్తుంది.
కాబట్టి గ్రహ దోషాలు తొలగిపోవాలన్నా, రెండో ఆవృత్తంలో తక్కువ కష్టంతో, బాధ తెలియకుండా జీవించాలన్నా రుద్రుణ్ణి ఆరాధించాలి. ఈ రుద్రులు అనేక రకాలుగా ఉంటారు. వారిలో ఉగ్ర రథుడు అనే రుద్రుడు మనిషిని అరవయ్యో ఏట హింసిస్తాడు. ఉగ్ర రథుడు అనే ఆ రుద్రుడి హింసకు తట్టుకోలేక ఆయుష్షు తీరడం, శరీరం అనారోగ్యం పాలై అవయవాలు శిథిలమవడం లాంటి పరిణామాలుంటాయి. కాబట్టి ఉగ్ర రథుడనే ఆ రుద్రుడిని శాంతింపజేయడం అనేది అత్యంత ముఖ్యం.
ఇలా ఉగ్ర రథుడు అనే రుద్రుడిని శాంతింపజేయడానికి చేసే కార్యాన్నే షష్ట్యబ్దపూర్తి లేదా షష్టిపూర్తి అంటారు. దీని వెనుక ఒక ఆసక్తకరమైన పురాణ కథ ఉన్నది. కృతయుగం నాటి వైశంపాయన మహర్షి కలియుగంలో మనుషుల ఆయుర్దాయం తగ్గుతుందని చింతించాడు. దాంతో వేద వ్యాసుని కలిసి ‘మహర్షీ.. దేహం ఉంటేనే కదా ధర్మాలను పాటించగలిగేది..! మరి శరీరం లేకున్నా, వ్యాధిగ్రస్తమైనా కర్మలను ఎలా ఆచరించడం..?’ అని అడిగారట.
అంతేగాక ‘కలియుగంలో ఆయుష్షు పెరిగి, పుత్ర పౌత్రులతో, సర్వ సంపదలూ అనుభవించేందుకు ఏ ధర్మాన్ని ఆచరించాలో చెప్పండి..?’ అని కోరారట. అందుకు సమాధానంగా వ్యాస మహర్షి.. ‘ఆయుష్షును, దేహపటుత్వాన్ని పెంచేదే షష్ట్యబ్ది వ్రతం. కలియుగంలో మనుషులు 60 ఏళ్లు రాగానే, శ్రద్ధతో భక్తితో ఈ వ్రతాన్ని ఆచరిస్తే వృద్ధాప్య బాధలు తగ్గుతాయి’ అని బదులిచ్చారట. ఆ విధంగా వచ్చిందే ఈ షష్ఠిపూర్తి ఆచారం.