NMDC | హైదరాబాద్ ఎన్ఎండీసీలో 995 కొలువులు.. అర్హతలు ఇవే..!
NMDC | మీరు పదో తరగతి( Tenth Class ) లేదా ఐటీఐ( ITI ) పూర్తి చేశారా..? ప్రభుత్వ కొలువు( Govt Job ) కోసం ఎదురుచూస్తున్నారా..? అయితే మీ లాంటి వారికి ఉద్యోగావకాశాలు( Job Opportunities ) కల్పించేందుకు 955 కొలువులతో ఎన్ఎండీసీ( NMDC ) నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హతలు తదితర వివరాలు తెలుసుకుందాం.

NMDC | హైదరాబాద్( Hyderabad )లోని భారత ప్రభుత్వ సంస్థ నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్( NMDC ).. బైలడిల ఐరన్ ఓర్ మైన్( BIOM ) కిరండూల్ కాంప్లెక్స్, బచేలి కాంప్లెక్స్ దంతేవాడ, దోనిమలై ఐరన్ ఓర్ మైన్( DIOM )లో 955 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ఎన్ఎండీసీ( NMDC ).
ఉద్యోగ ఖాళీలు ఇలా..
బీఐఓఎం కిరండూల్ కాంప్లెక్స్‌లో 389
బీఐఓఎం బచేలి కాంప్లెక్స్‌లో 356
డీఐఓఎం దోనిమలై కాంప్లెక్స్‌లో 250
పోస్టులు :
ఫీల్డ్ అడెంట్, మెయింటెనెన్స్ అసిస్టెంట్(ఎలక్ట్రికల్ /మెకానికల్), బ్లాస్టర్ గ్రూప్2, ఎలక్ట్రీషియన్ గ్రూప్ 2, ఎలక్ట్రానిక్స్ టెక్నీషియన్ గ్రూప్ 3, హెచ్ఈఎం మెకానిక్/ ఆపరేటర్ గ్రూప్ 3, ఎంసీఓ గ్రూప్ 3, క్యూసీఏ గ్రూప్ 3(ఇవన్నీ ట్రైనీ పోస్టులు), మెషినిస్ట్, ఫిట్టర్, వెల్డర్, ఆటో ఎలక్ట్రిషీయన్.
అర్హతలు :
పోస్టులను అనుసరించి పది/ ఐటీఐ, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ.
వేతనం :
నెలకు ఫీల్డ్ అటెండెంట్‌కు రూ. 31,850, మెయింటెనెన్స్ అసిస్టెంట్‌కు రూ. 32,490, ఇతర పోస్టులకు రూ. 35,040.
వయసు :
18 ఏండ్ల నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక :
ఓఎంఆర్/ కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష, ఫిజికల్ ఎబిలిటీ టెస్ట్/ ట్రేడ్ టెస్టులతో.
ఆన్‌లైన్ దరఖాస్తు గడువు : జూన్ 14, 2025
దరఖాస్తుతో పాటు తదితర వివరాల కోసం ఈ వెబ్‌సైట్‌ను సందర్శించండి.. https://www.nmdc.co.in/careers