iBomma Case | వందకుపైగా పైరసీ వెబ్‌సైట్ల నెట్‌వర్క్ – వీడు మామూలోడు కాదు
ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ చేసిన విచారణలో 100+ వెబ్‌సైట్లు, 21,000 సినిమాలు, ₹20 కోట్లు సంపాదన, 50 లక్షల యూజర్ల డేటా వంటి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
100+ Piracy Sites, 21,000 Movies – Shocking Revelations on iBomma Ravi
‘ఐబొమ్మ’ ఇమ్మడి రవి దగ్గర 21 వేల సినిమాలు, 50 లక్షల యూజర్ల డేటా
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఐబొమ్మ వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేసిన తర్వాత, రోజు రోజుకు షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి. రవి కేవలం ఒకే వెబ్‌సైట్‌ను కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో కొన్నేళ్లుగా భారీ పైరసీ నెట్‌వర్క్‌ను నడుపుతున్నట్టు పోలీసులు ధృవీకరించారు.
- 100 కి పైగా వెబ్‌సైట్లు – ప్రపంచవ్యాప్తంగా పైరసీ నెట్‌వర్క్

చంచల్‌గూడ జైలులో రవిని సమగ్రంగా విచారిస్తున్న పోలీసులు అతడు నిర్వహించిన నెట్‌వర్క్ పరిమాణాన్ని చూసి అవాక్కయ్యారు. అధికారిక వివరాల ప్రకారం:
- రవి 100+ పైరసీ వెబ్‌సైట్లు కొనుగోలు చేసి, వాటిని నిరంతరం మారుస్తూ సినిమాలు అప్‌లోడ్ చేస్తుండేవాడు.
- ఒక వెబ్‌సైట్ బ్లాక్ అయితే వెంటనే కొత్త మిర్రర్ సైట్ క్రియేట్ చేసి ఆపరేషన్ కొనసాగించేవాడు.
- రవికి చెందిన కంపెనీలు Getting Up, ER Infotech పేర్లపై నడిచేవి.
- యూకే నుంచి VPN, ప్రాక్సీ సర్వర్లు ఉపయోగించి సినిమాలు అప్‌లోడ్ చేయడంలో ప్రత్యేక నైపుణ్యం కలిగి ఉన్నాడు.
- రవి ఇంట్లో స్వాధీనం చేసిన నూర్ల కొద్దీ హార్డ్‌డిస్కుల్లో 2,000+ సినిమాలు ఉన్నట్టు గుర్తించారు.
- ఇమ్మడి రవి ఒక గొప్ప హ్యాకర్ అని కూడా తెలిసింది.
సైబర్ క్రైమ్ టీమ్ ఈ డేటా మొత్తంను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించింది. రవిపై ఇప్పటివరకు 7 కేసులు నమోదయ్యాయి.
దిమ్మదిరిగే విషయాలు వెల్లడించిన కమిషనర్ సజ్జనార్
టాలీవుడ్ పెద్దలైన చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, దిల్‌రాజు సీపీ సజ్జనార్‌ను కలిసిన తరువాత, ఆయన మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు మరిన్ని దిగ్భ్రాంతికరమైన వాస్తవాలను బయటపెట్టాయి. ఆయన అందించిన వివరాల ప్రకారం,
- రవి దగ్గర ఉన్న హార్డ్‌డిస్కుల్లో 21,000 సినిమాలు ఉన్నాయి(1972 “Godfather” నుంచి 2025 “OG” వరకు)
- పైరసీ ద్వారా రవి ₹20 కోట్లకు పైగా సంపాదించాడు
- ఐబొమ్మను వాడే 50 లక్షల మందికి పైగా వినియోగదారుల డేటా అతడి వద్ద ఉంది
- పైరసీతో పాటు, బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ కూడా చేస్తున్నాడు
- రవి 65 మిర్రర్ వెబ్‌సైట్లు నిర్వహించేవాడు
- ఈ సమాచార పరిమాణం ప్రజల గోప్యతకు కూడా చాలా ప్రమాదకరమని కమిషనర్ పేర్కొన్నారు.
రవి అరెస్ట్ తరువాత, పోలీసులు అతడితోనే ఐబొమ్మను డిలీట్ చేయించారు. అరెస్ట్ తర్వాత రెండో రోజే ఐబొమ్మ వెబ్‌సైట్‌లో మెసేజ్ కనిపించింది: “మీ దేశంలో మా సేవలను శాశ్వతంగా నిలిపివేస్తున్నాం… క్షమించండి.” ఈ మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
వాడిది వాళ్లమ్మలా క్రిమినల్ బ్రెయిన్ : రవి తండ్రి అప్పారావు
ఇమ్మడి రవి అరెస్టుపై అతడి తండ్రి అప్పారావు చేసిన వ్యాఖ్యలు మరో కోణాన్ని బయటపెట్టాయి. ఆయన చెప్పిందాని ప్రకారం,
- “మా అబ్బాయికి మద్యం, సిగరెట్ అలవాట్లు లేవు… కానీ అతడికి వాళ్ల అమ్మ లాంటి క్రిమినల్ బ్రెయిన్ వచ్చిందేమో.”
- “నాది సాదాసీదా కుటుంబం… మా వంశంలో ఇలాంటి ఖిలాడీలు ఎవరూ లేరు.”
- “కొడుకు కోట్లు సంపాదించినా… నాకు తినడానికి కూడా ఏమీ ఇవ్వలేదు.”
- “ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు… ఎందుకు విడిపోయారో నాకు తెలియదు.”
- విదేశాల్లో నివసిస్తున్నాడని కూడా నాకు తెలియదు.
- “అరెస్టు అయ్యాడని బంధువులు చెప్పేదాకా నాకు తెలియదు.”
ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్రచర్చకు దారితీశాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram