Pawan Kalyan | “మీరు సమాజానికి ఇంకా ఎంతో చేయాలి.. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు”.. పవన్‌కు మోదీ హితవు
Pawan Kalyan | ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి వెళ్లి ప్రత్యేకంగా పరామర్శించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులతో కూడా ప్రధాని ఎంతో ఆప్యాయంగా ముచ్చటించడం విశేషంగా నిలిచింది.
Pawan Kalyan | ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి వెళ్లి ప్రత్యేకంగా పరామర్శించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులతో కూడా ప్రధాని ఎంతో ఆప్యాయంగా ముచ్చటించడం విశేషంగా నిలిచింది.
ఇటీవల సైనస్ శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి స్వయంగా ఇంటికి వెళ్లిన ప్రధాని మోదీ, ప్రజా జీవితంలో ఉన్నవారు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదని సూచించారు.
ఇంకా ఎంతో చేయాలి..
“మీరు ఈ సమాజానికి ఇంకా ఎంతో చేయాల్సి ఉంది. అందుకే ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయొద్దు. సమాజానికి మరింత విస్తృతంగా సేవలు అందించాలంటే ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం” అంటూ పవన్ కళ్యాణ్‌కు ప్రధాని మోదీ హితవు పలికినట్లు సమాచారం.
సైనస్ సర్జరీ, భుజ గాయాలపై మోదీకి వివరించిన పవన్
ఈ సందర్భంగా తన ఆరోగ్య సమస్యల గురించి పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రికి వివరించారు. గత కొన్నేళ్లుగా ప్రజా పర్యటనల్లో దుమ్ము, ధూళి కారణంగా సైనస్ సమస్య తీవ్రమై ఇన్ఫెక్షన్‌కు దారితీసిందని తెలిపారు. కంటిపై కూడా ప్రభావం చూపడంతో ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ చేయించుకోవాల్సి వచ్చిందని చెప్పారు.
అదేవిధంగా గతంలో భుజాల దగ్గర తగిలిన గాయాల వల్ల రొటేటర్ కఫ్ ఇంజ్యూరీ సమస్య ఉందని, స్పైనల్ కార్డ్‌కు సంబంధించిన ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నానని పవన్ వివరించారు. పవన్ చెప్పిన ప్రతి విషయాన్ని ఓపికగా విన్న ప్రధాని మోదీ, పూర్తిగా కోలుకునే వరకు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది.
పవన్ కుటుంబంతో మోదీ ఆప్యాయ సంభాషణలు
పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులతో కూడా ప్రధాని మోదీ ఎంతో స్నేహపూర్వకంగా మాట్లాడారు. పవన్ భార్య అన్నా లెజినోవాతో కొన్ని రష్యన్ పదాలు పలుకుతూ సరదాగా ముచ్చటించారు.
చిన్న కుమారుడు మార్క్ శంకర్ స్వయంగా తయారు చేసిన ‘వెల్కమ్’ మరియు ‘థాంక్యూ’ కార్డులను ప్రధానికి అందించగా, వాటిని చూసి మోదీ ఎంతో ముచ్చటపడ్డారని సమాచారం. సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటనను ప్రస్తావిస్తూ, “నీ గురించి మేమందరం చాలా ఆందోళన చెందాం బాబూ” అంటూ మార్క్ శంకర్‌తో ప్రేమగా మాట్లాడినట్లు తెలిసింది.
అకీరా చెప్పిన హిందీ కవితకు ప్రధాని ప్రశంసలు
పవన్ కుమారుడు అకీరా నందన్ ప్రస్తుతం మార్షల్ ఆర్ట్స్, స్పోర్ట్స్ షూటింగ్‌లో శిక్షణ పొందుతున్నానని ప్రధానికి చెప్పాడు. దీనిపై స్పందించిన మోదీ, “ఇంట్లోనే ఒక మార్షల్ ఆర్ట్స్ స్టార్ ఉన్నారు.. నువ్వూ అదే దారిలో వెళ్తున్నావా?” అంటూ పవన్ కళ్యాణ్ వైపు చూసి సరదాగా వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.
అనంతరం ప్రముఖ హిందీ కవి రామ్‌దరి సింగ్ దిన్‌కర్ r రాసిన కవితను అకీరా వినిపించగా, కఠినమైన హిందీ భాషను నేర్చుకోవడం సాధారణ విషయం కాదని ప్రధాని ప్రశంసించారు.
కుటుంబంతో 20 నిమిషాల ప్రత్యేక భేటీ
ఆద్య కొణిదెల, పలీనా అంజనిలతో కూడా ప్రధాని హిందీ, ఇంగ్లీష్‌లో సరదాగా మాట్లాడారు. “మళ్ళీ కలిసేటప్పటికి హిందీలో మాట్లాడాలి” అంటూ పలీనాతో నవ్వులు పూయించినట్లు సమాచారం.
సుమారు 20 నిమిషాల పాటు కొనసాగిన ఈ ఆప్యాయ భేటీ అనంతరం పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు ప్రధానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. “మా ఇంటికి వచ్చి చూపించిన ప్రేమ, ఆప్యాయతను ఎప్పటికీ మర్చిపోలేం” అంటూ వారు భావోద్వేగంగా స్పందించినట్లు తెలిసింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram