Nani | స్వచ్ఛ రథాలకు నాని మద్దతు.. పవన్ కళ్యాణ్ పిలుపుతో ఏపీలో పరిశుభ్రత ఉద్యమానికి ఊపు
స్వచ్ఛ రథాలకు నాని మద్దతుఆంధ్రప్రదేశ్‌లో పరిశుభ్రతపై ప్రజల్లో చైతన్యం పెంచేందుకు ఉపముఖ్యమంత్రి పవన్ కల్‌జ్ఞౄన్ చేపట్టిన ‘స్వచ్ఛ రథాలు’ కార్యక్రమం వేగంగా ముందుకు సాగుతోంది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ సంచలనంగా మారంది.
Nani | స్వచ్ఛ రథాలకు నాని మద్దతుఆంధ్రప్రదేశ్‌లో పరిశుభ్రతపై ప్రజల్లో చైతన్యం పెంచేందుకు ఉపముఖ్యమంత్రి పవన్ కల్‌జ్ఞౄన్ చేపట్టిన ‘స్వచ్ఛ రథాలు’ కార్యక్రమం వేగంగా ముందుకు సాగుతోంది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ సంచలనంగా మారంది.
గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో ఈ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజలు తడి చెత్త, పొడి చెత్తను వేరు చేయాలని సూచిస్తూ, చెత్త నిర్వహణపై అవగాహన కల్పించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం.
నాని వీడియో సందేశం…
ఈ నేపథ్యంలో నాని ఒక వీడియో సందేశం విడుదల చేస్తూ ప్రజలకు ముఖ్యమైన సూచనలు చేశారు. చెత్తను వేరు చేయడం వల్ల పర్యావరణానికి, ఆరోగ్యానికి కలిగే లాభాలను వివరించారు. “మన పారిశుద్ధ్యం – మన బాధ్యత” అనే సందేశాన్ని బలంగా చాటిచెప్పారు.
‘స్వచ్ఛ రథాలు’ కార్యక్రమం ప్రత్యేకత ఏమిటంటే, ఇది కేవలం చెత్త సేకరణతో ఆగిపోదు. ప్రజలు తమ ఇళ్లలోని పొడి చెత్తను ప్రభుత్వానికి అందజేస్తే, దానికి బదులుగా నిత్యావసర సరుకులు అందిస్తారు. దీంతో ప్రజలకు ఆర్థిక లాభం కలగడమే కాకుండా గ్రామాలు కూడా శుభ్రంగా మారుతున్నాయి.
స్పష్టంగా చూపిస్తున్న గణాంకాలు..
ఈ కార్యక్రమం విజయాన్ని గణాంకాలు స్పష్టంగా చూపిస్తున్నాయి. ఒక్క ఏప్రిల్ నెలలోనే సుమారు 19 లక్షల కేజీల పొడి చెత్తను సేకరించారు. దానికి బదులుగా ప్రజలకు సుమారు 3.32 కోట్ల రూపాయల విలువైన నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఇది గ్రామీణ ప్రాంతాల్లో పరిశుభ్రత విప్లవం సాగుతోందని సూచిస్తోంది.
నాని ఇచ్చిన మద్దతుకు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సినీ, ఇతర రంగాల ప్రముఖులు కూడా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. సెలబ్రిటీలు చెప్పిన సందేశం ప్రజల్లో త్వరగా చేరుతుందని, దీంతో సమాజంలో మార్పు వేగంగా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
మొత్తంగా పవన్ కళ్యాణ్ ఆలోచనకు నాని వంటి ప్రముఖుల మద్దతు తోడవడంతో ఆంధ్రప్రదేశ్‌లో పరిశుభ్రత కార్యక్రమం కొత్త దిశగా సాగుతోంది. రాజకీయాలకు అతీతంగా మంచి కార్యక్రమాల కోసం ప్రముఖులు కలిసిరావడం మంచి పరిణామంగా భావిస్తున్నారు. ఈ ‘స్వచ్ఛ రథాలు’ కార్యక్రమం భవిష్యత్తులో మరిన్ని గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తుందని ఆశిస్తున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram