Tollywood | వెండితెరపై రక్తపాతం ట్రెండ్.. ‘మార్కో’ నుంచి ‘యానిమల్ పార్క్’ వరకు హద్దులు మీరుతున్న హింస!
Tollywood | సినిమా అనేది వినోదానికి ప్రతీక. కానీ ఇటీవలి కాలంలో వెండితెరపై వినోదం కన్నా హింసాత్మక సన్నివేశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Tollywood | సినిమా అనేది వినోదానికి ప్రతీక. కానీ ఇటీవలి కాలంలో వెండితెరపై వినోదం కన్నా హింసాత్మక సన్నివేశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. స్టార్ హీరోల సినిమాల్లో మోతాదుకు మించి వయోలెన్స్ ఉండాల్సిందే అన్నట్టుగా ట్రెండ్ మారిపోయింది. ప్రతీకారం, పగ, రక్తపాతం నేపథ్యంగా హీరోలు కత్తులు, తుపాకులు దూస్తూ ‘బ్లడ్ బాత్’ సృష్టించడం ఇప్పుడు సాధారణమైపోయింది.
‘మార్కో’ బోర్డర్ క్రాస్!
మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన మార్కో ఈ హార్డ్ కోర్ వయోలెన్స్‌కు పరాకాష్టగా నిలిచింది. ఉన్నిముకుందన్ హీరోగా నటించిన ఈ సినిమాలో టైటిల్ కార్డ్ నుంచే రక్తపాతం హింట్ ఇచ్చారు. ప్రతి ప్రతీకార సన్నివేశం బ్లడ్ షేడ్స్‌తో నిండిపోయి, ప్రేక్షకులకు ఇది ఇండియన్ మూవీనేనా? అనే ఫీలింగ్ కలిగించేలా డిజైన్ చేశారు. హింసను ఎమోషనల్ ఎలిమెంట్‌గా కాకుండా విజువల్ షాక్‌గా ప్రెజెంట్ చేయడం ఈ సినిమాకు ప్రత్యేకత.
‘ధురంధర్’లోనూ అదే హార్డ్ కోర్ ట్రీట్మెంట్
బాలీవుడ్‌లో వచ్చిన ధురంధర్ కూడా హింసాత్మక సన్నివేశాల్లో హద్దులు దాటిన చిత్రంగా చెప్పుకుంటున్నారు. మార్కెట్‌లో బాబు డకాయత్ హత్య సన్నివేశం నుంచి, ఇండియన్ ఏజెంట్‌ను ఐఎస్‌ఐ ఏజెంట్ హింసించే ఎపిసోడ్స్ వరకు అనేక సీన్లు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి. దర్శకుడు ఆదిత్య ధర్ ఫస్ట్ పార్ట్‌లోనే ఈ స్థాయిలో రక్తపాతం చూపించగా, సెకండ్ పార్ట్‌లో మరింత తీవ్రత ఉంటుందని టీజర్, ట్రైలర్ ద్వారా సంకేతాలు ఇచ్చారు.
‘యానిమల్’ నుంచి ‘యానిమల్ పార్క్’ దాకా
హిందీలో సంచలనం సృష్టించిన యానిమల్ ఎండింగ్‌లో చూపించిన వయోలెన్స్ ప్రేక్షకులను షాక్‌కు గురి చేసింది. ఇప్పుడు రాబోయే యానిమల్ పార్స్‌లో అంతకుమించి హింసాత్మక సన్నివేశాలు ఉండనున్నాయని సమాచారం. హార్డ్ కోర్ యాక్షన్‌ను ఎమోషనల్ రివెంజ్ డ్రామాతో మేళవించడం ఈ సిరీస్ ప్రత్యేకతగా మారింది.
తెలుగు సినిమాల్లోనూ అదే బాట
ఇప్పటి వరకు మలయాళ, హిందీ చిత్రాల్లో ఎక్కువగా కనిపించిన ఈ ట్రెండ్ ఇప్పుడు తెలుగులోనూ వేగంగా విస్తరిస్తోంది. నేచురల్ స్టార్ నాని నటించిన హిట్ ది థర్డ్ కేస్‌లోని ఫైనల్ యాక్షన్ సీక్వెన్స్ హార్డ్ కోర్ ట్రీట్మెంట్‌తో ప్రేక్షకులను షాక్‌కు గురిచేసింది. దర్శకుడు శైలేష్ కొలను ఆ సన్నివేశాన్ని భయానకంగా డిజైన్ చేశాడు.
త్వరలో రానున్న ది ప్యారడైజ్‌లోను నాని రూత్‌లెస్ పాత్రలో కనిపించనున్నాడు. పీరియడ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ చిత్రంలో వయోలెన్స్ మరింత హైలైట్ కానుందని టాక్.
చిరు, యష్, విశ్వక్ సేన్ సినిమాలు కూడా అదే దారిలో?
అలాగే మెగాస్టార్ చిరంజీవి – దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో రానున్న చిత్ర అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో ఇద్దరూ చేతులకు రక్తం పూసుకుని కనిపించడం చర్చనీయాంశమైంది.
కన్నడ స్టార్ యష్ నటిస్తున్న టాక్సిక్ కూడా డార్క్ యాక్షన్ డ్రామాగా రాబోతోంది. మరోవైపు విశ్వక్ సేన్ ‘కల్ట్’తో, శర్వానంద్ హీరోగా రాబోతున్న భోగి (‘బ్లడ్ ఫెస్ట్’ క్యాప్షన్‌తో) కూడా హార్డ్ కోర్ వయోలెన్స్ ట్రెండ్‌ను కొనసాగించే అవకాశముంది.
హింస – అవసరమా?
ప్రేక్షకులను మరింత ఎగ్జైట్ చేయాలనే ఉద్దేశంతో దర్శకులు హింసాత్మక సన్నివేశాలను భారీ స్థాయిలో ప్రెజెంట్ చేస్తున్నారు. అయితే ఈ ట్రెండ్ ఎంతవరకు అవసరం? కథకు అవసరమైనంత హింస, లేక షాక్ వాల్యూ కోసం హద్దులు దాటుతున్నాయా? అన్న చర్చ సినీ వర్గాల్లో మొదలైంది.
వాస్తవానికి యాక్షన్ సినిమాలు ఎప్పుడూ ప్రేక్షకాదరణ పొందుతూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు రియలిస్టిక్ పేరుతో మరింత గ్రాఫిక్ వయోలెన్స్ చూపించడం కొత్త ధోరణిగా మారింది. రాబోయే సినిమాలు ఈ ట్రెండ్‌ను మరింత పెంచుతాయా? లేక మళ్లీ భావోద్వేగాలకు ప్రాధాన్యం పెరుగుతుందా? అనేది చూడాలి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram