Vijay | సీఎంగా తొలి రోజే ప్రజలకు గుడ్ న్యూస్.. ఉచిత విద్యుత్, మహిళల భద్రతపై విజయ్ కీలక నిర్ణయాలు
Vijay | తమిళనాడు రాజకీయాల్లో కొత్త శకానికి శ్రీకారం చుడుతూ టీవీకే అధినేత విజయ్ ఆదివారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో విజయ్‌తో పాటు పలువురు మంత్రులు కూడా ప్రమాణం చేశారు.
Vijay | తమిళనాడు రాజకీయాల్లో కొత్త శకానికి శ్రీకారం చుడుతూ టీవీకే అధినేత విజయ్ ఆదివారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో విజయ్‌తో పాటు పలువురు మంత్రులు కూడా ప్రమాణం చేశారు.
సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే విజయ్ ప్రజలకు ఊరటనిచ్చే కీలక నిర్ణయాలు తీసుకోవడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రమాణ స్వీకారం చేసిన వేదికపైనే మూడు ముఖ్యమైన ఫైళ్లపై ఆయన తొలి సంతకాలు చేశారు.
వారికి పెద్ద ఊరట..
అందులో అత్యంత ప్రధానమైన నిర్ణయం గృహ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడం. ఇప్పటివరకు తమిళనాడులో 100 యూనిట్ల వరకు మాత్రమే ఉచిత విద్యుత్ సౌకర్యం ఉండేది. ఇప్పుడు ఆ పరిమితిని రెట్టింపు చేస్తూ 200 యూనిట్ల వరకు ఎలాంటి విద్యుత్ ఛార్జీలు వసూలు చేయబోమని విజయ్ ప్రకటించారు.
ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన కీలక హామీలలో ఇదొకటి కావడంతో, అధికారంలోకి వచ్చిన తొలి రోజే ఆ హామీ అమలుకు శ్రీకారం చుట్టడం ప్రజల్లో ఆసక్తి రేపుతోంది. ముఖ్యంగా మధ్యతరగతి, పేద కుటుంబాలకు ఈ నిర్ణయం పెద్ద ఊరటనిస్తుందని భావిస్తున్నారు.
మహిళ భద్రతకి ప్రాధాన్యం..
ఇక మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని విజయ్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా ‘సింగప్పెన్గళ్’ పేరుతో ప్రత్యేక భద్రతా దళాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇది ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్న షీ టీమ్స్ తరహాలో పనిచేయనున్నట్లు సమాచారం.
మహిళలపై వేధింపులు, నేరాలను అరికట్టడమే కాకుండా.. ప్రజల్లో భద్రతా భావన పెంపొందించడం ఈ ప్రత్యేక దళం ప్రధాన లక్ష్యంగా ఉండనుంది. నగరాలు, పట్టణాలు, విద్యాసంస్థలు వంటి ప్రాంతాల్లో ఈ బృందాలు ప్రత్యేక నిఘా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు డ్రగ్స్ నిర్మూలనపై కూడా విజయ్ ప్రభుత్వం తొలి రోజే కీలక నిర్ణయం తీసుకుంది. తమిళనాడును పూర్తిగా మాదకద్రవ్యాల రహిత రాష్ట్రంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం విజయ్ ప్రకటించారు.
కఠిన చర్యలు…
ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్స్ నిరోధక విభాగాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. స్కూళ్లు, కళాశాలల్లో ప్రత్యేక అవగాహన క్లబ్‌లు ఏర్పాటు చేసి యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడే దిశగా చర్యలు తీసుకోనున్నారు.
అలాగే డ్రగ్స్‌కు సంబంధించిన నేరాలను గుర్తించి కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి జిల్లాలో ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేసి డ్రగ్స్ మాఫియాపై కఠినంగా వ్యవహరించాలని అధికారులకు సీఎం విజయ్ సూచించారు.
సీఎంగా తొలి రోజే ప్రజలకు నేరుగా ఉపయోగపడే అంశాలపై నిర్ణయాలు తీసుకోవడం ద్వారా విజయ్ తన పాలన ప్రజాకేంద్రీకృతంగా ఉండబోతుందనే సంకేతాలు ఇచ్చారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా వేగంగా అడుగులు వేస్తున్న విజయ్ ప్రభుత్వం ఇప్పుడు తమిళనాడులో హాట్ టాపిక్‌గా మారింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram