Egg Curry | కొత్త రకం కోడిగుడ్డు కూర.. నాలుగు ముద్దలు ఎక్కువే ఆరగిస్తారు..!
Egg Curry | రెగ్యులర్‌గా ఒకేరకం కోడిగుడ్డు కూర( Egg Curry ) తిని బోర్ కొడుతుందా..? అదే ఉడకబెట్టిన కోడిగుడ్డు లేదంటే ఎగ్ ఆమ్లెట్( Egg Omelette ).. ఈ రెండింటితో విసుగు చెందారా..? మరి ఇంకెందుకు ఆలస్యం.. ఈ ఆదివారం కొత్త రకం కోడిగుడ్డు కూర( New Style Egg Curry ) చేసుకోండి.. అదేనండి ఎగ్ ఆమ్లెట్ కర్రీ( Egg Omelette Curry ).. టేస్టీ అదిరిపోద్ది.

Egg Curry | చికెన్( Chicken ), మటన్( Mutton ), చేపలకు( Fish ) బదులుగా కోడిగుడ్డు( Egg )ను ఇష్టపడే వారు చాలా మంది ఉంటారు. కోడిగుడ్డును కొందరు ఉడకబెట్టి, మరికొందరు ఆమ్లెట్( Egg Omelette ) వేసుకుని, ఇంకొందరు కూర చేసుకుని తింటుంటారు. ఇందులో ఏదైనా సరే క్షణాల్లో రెడీ అయిపోతుంది. అలాగని ఎప్పుడు ఈ మూడింటిని ట్రై చేయకుండా.. ఈ సారి సరికొత్తగా ట్రై చేయండి. అందుకే ఈ సారి కొత్త రకం కోడిగుడ్డు కూర( Egg Curry )ను పరిచయం చేయబోతున్నాం. ఈ స్టైల్‌లో కోడిగుడ్డు కూర చేశారంటే ఇంట్లో ఉన్న వారంతా నాలుగు ముద్దలు ఎక్కువగానే ఆరగిస్తారు. ఇందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. పిల్లల నుంచి వృద్ధుల వరకు లొట్టలేసుకుంటూ తింటారు. మరి కొత్త రకం కోడి గుడ్డు కూర( New Stle Egg Curry ) ఎలా వండాలో ఈ కథనంలో తెలుసుకుందాం..
కొత్త రకం కోడిగుడ్డు కూరకు కావాల్సిన పదార్థాలు ఇవే..
నూనె – సరిపడా
పెద్ద సైజ్ ఉల్లిపాయలు – నాలుగు
పచ్చిమిర్చి – ఐదారు
కరివేపాకు – కొద్దిగా
ఉప్పు – రుచికి సరిపడా
మీడియం సైజ్ టమాటాలు – మూడు
పసుపు – పావు టీస్పూన్
కారం – రెండు టేబుల్ స్పూన్లు(రుచికి తగినంత)
వేయించిన జీలకర్ర పొడి – పావు టీస్పూన్
ధనియాల పొడి – 2 టీ స్పూన్లు
కోడి గుడ్డు మిశ్రమం కోసం..
కోడిగుడ్లు – మూడు
ఉప్పు – పావు టీస్పూన్
కారం – ఒక టీస్పూన్
పసుపు – పావు టీస్పూన్
పచ్చిమిర్చి – ఒకటి
ఉల్లిపాయ – ఒకటి
కోడి గుడ్డు కూర తయారీ విధానం ఇలా..
మొదటగా ఉల్లిపాయలను( Onions ), పచ్చిమిర్చి( Green Chilly )ని సన్నగా కట్ చేసుకోవాలి. టమాట( Tomato ) పండ్లను తురమాలి. అనంతరం స్టవ్ వెలిగించి ఒక పాత్రలో ఆయిల్ వేసి వేడి చేయాలి. నూనె కాస్త కాగగానే ఉల్లిపాయ, పచ్చి మిర్చి ముక్కలను వేయాలి. కరివేపాకు కూడా వేసి హై ఫ్లేమ్‌లో కలుపుతూ వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ రంగులోకి రాగానే.. తగినంత ఉప్పు వేసి కలపాలి. ఇక మూతపెట్టి ఫ్లేమ్‌లో అవి మెత్తగా అయ్యే వరకు మగ్గనివ్వాలి.
మధ్యలో అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. కాసేపటి తర్వాత ముందుగా తురిమి పెట్టుకున్న టమాటా గుజ్జును ఆ మిశ్రమానికి యాడ్ చేసుకోవాలి. కాసేపు మూతపెట్టి మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత పసుపు, కారం, వేయించిన జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి కలపాలి. తర్వాత కూర ఉడకడం కోసం సరిపడినన్ని నీళ్లు పోసి కలిపి మూతపెట్టి లో ఫ్లేమ్‌లో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అది ఉడికేలోగా ఒక గిన్నెలో గుడ్లను పగులకొట్టి పోసుకోవాలి. ఆపై అందులో ఉప్పు, కారం, పసుపు, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ తరుగు వేసి మిశ్రమం మొత్తం కలిసేలా బాగా కలపాలి. గుంత గరిటెలో ఈ గుడ్ల మిశ్రమాన్ని ఆమ్లెట్‌గా వేసుకోవాలి. ముందుగా ప్రిపేర్ చేసిన కర్రీలో ఈ ఆమ్లెట్‌లను వేసి మునిగేలా జాగ్రత్త తీసుకోవాలి. ఆపై పైన కొద్దిగా కొత్తిమీర తరుగు చల్లుకొని మూత పెట్టి లో ఫ్లేమ్‌లో ఐదు నిమిషాల పాటు ఉడికించుకొని దింపేసుకుంటే చాలు. అంతే, కోడిగుడ్డుతో సరికొత్త రుచితో అద్దిరిపోయే ఎగ్ ఆమ్లెట్ కర్రీ( egg omelette Curry ) రెడీ.
ఈ కొత్తరకం కోడిగుడ్డు కూరను అన్నంలో తినొచ్చు. చపాతీకి కూడా బాగుంటుంది. పిల్లలు అయితే లొట్టలేసుకుంటూ తింటారు. ఈ కర్రీ చేయడం చాలా ఈజీ. ఇంకా ఎక్కువ సమయం కూడా తీసుకోదు. మరి మీరు కూడా ఈ సండే కొత్త రకం కోడిగుడ్డు కూర వండుకుని కడుపు నిండా ఆరంగించండి.