Fish Fry | చేప‌ల పులుసు బోర్ కొట్టిందా..! మ‌రి ఫిష్ ఫ్రై ట్రై చేయండిలా.. టేస్ట్ అదిరిపొద్ది..!!

Fish Fry | చికెన్( Chicken ), మ‌ట‌న్( Mutton ) తిని బోర్ వ‌చ్చిందా..? ఈ చ‌ల్ల‌ని వెద‌ర్‌కు వేడి వేడి ఫ్రై ఏదైనా తినాల‌నిపిస్తుందా..? అదేదో హెల్తీ ఫుడ్( Healthy Food ) అయితే ఇంకా బాగుంటుంది క‌దా..! ఆరోగ్యాన్ని ప‌దిలంగా ఉంచే చేప‌ల‌ను( Fish ) తింటే ఎంత బాగుంటుందో క‌దా..! మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఈ సండే చేప‌ల ఫ్రై( Fish Fry )ని ఆర‌గించేయండి.

  • By: raj    food    Jul 06, 2025 7:23 AM IST
Fish Fry | చేప‌ల పులుసు బోర్ కొట్టిందా..! మ‌రి ఫిష్ ఫ్రై ట్రై చేయండిలా.. టేస్ట్ అదిరిపొద్ది..!!

Fish Fry | చాలా మంది చేప‌ల‌ను( Fish ) ఇష్ట‌ప‌డుతారు. కొంద‌రు చేప‌ల పులుసును ఇష్ట‌ప‌డితే, ఇంకొంద‌రు చేప‌ల ఫ్రై( Fish Fry )ని ఇష్ట‌ప‌డుతుంటారు. వాతావ‌ర‌ణం కూడా కొంచెం చ‌ల్ల‌గా ఉండ‌డంతో.. పులుసు కంటే ఫ్రై బెట‌ర్. ఎందుకంటే.. నోటికి రుచినిచ్చే ఫిష్ ఫ్రైతో ఈ సండే ఎంజాయ్ చేయొచ్చు. ఈ స్టైల్లో చేప‌ల ఫ్రై చేస్తే చిన్న పిల్ల‌ల నుంచి వృద్ధుల వ‌ర‌కు లొట్టలేసుకుంటూ తింటారు. మ‌రి ఆ చేప‌ల ఫ్రై స్టైల్ ఏంటో తెలుసుకుందాం..

ఫిష్ ఫ్రైకి కావాల్సిన ప‌దార్థాలు ఇవే..

చేపలు – 1 కిలో, ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి ముద్ద – 2 టేబుల్‌ స్పూన్లు, కారం – 3 టీ స్పూన్లు, ఉప్పు – తగినంత, మసాలా పొడి – 2 టీ స్పూన్లు, పసుపు – కొద్దిగా, నూనె – త‌గినంత.

చేప‌ల ఫ్రై త‌యారీ విధానం ఇలా..

చేప ముక్క‌ల‌ను మార్కెట్ నుంచి ఇంటికి తీసుకొచ్చాక ఉప్పుతో వాటిని శుభ్రంగా క‌డ‌గాలి. ఉప్పుతో క‌డ‌గ‌డంతో చేప ముక్క‌ల‌కున్న దుర్వాస‌న వెళ్లిపోతుంది. క‌డిగిన చేప ముక్క‌ల‌ను ఒక పాత్ర‌లో వేసుకోవాలి. అనంత‌రం ఉల్లిపాయ‌ల‌ను స‌న్న‌గా త‌రిగి పేస్ట్ చేసుకోవాలి. మ‌రో పాత్ర‌లో అల్లం వెల్లుల్లి ముద్ద‌, కారం, ఉప్పు, ప‌సుపు, మ‌సాల పొడి వేసి బాగా క‌ల‌పాలి. ఈ మిశ్ర‌మంలో శుభ్రం చేసిన చేప ముక్క‌ల‌ను క‌ల‌పాలి. ఆ త‌ర్వాత గంట పాటు ఆ మిశ్ర‌మంలోనే చేప ముక్క‌ల‌ను ఉంచాలి.

గంట త‌ర్వాత మ‌రో పాత్ర‌ను తీసుకుని స్టౌ మీద పెట్టి త‌గినంత నూనె పోసి కాగ‌బెట్టాలి. నూనె కాగిన త‌ర్వాత‌.. మిశ్ర‌మంతో కూడిన చేప ముక్క‌ల‌ను నూనెలో వేసి ఫ్రై చేయాలి. లో ఫ్లేమ్‌లో చేప‌ల‌ను ఫ్రై చేస్తే మంచిగా ఫ్రై అవుతాయి. ఫ్రై చేసిన చేప ముక్క‌ల‌పై స‌న్న‌గా త‌రిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర వేసి ఆర‌గిస్తే టేస్ట్ అదిరిపోతుంది. అంద‌రూ క్ష‌ణాల్లో ఆర‌గించేస్తారు. మీరు కూడా చేప‌ల ఫ్రైని ఈ సండే వండి.. ఆర‌గించండి.