Food | ఘుమఘుమలాడే కోడిగుడ్డు అంటు పులుసు.. నిమిషాల్లో రెడీ చేసుకోండిలా..!
Food : కోడిగుడ్లు ఎవరైనా సరే ఇష్టంగా తినే వంటకం. గుడ్డు చాలా రుచిగా కూడా ఉంటుంది. గుడ్డులో ప్రొటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీ రోజువారీ భోజనంలో, స్నాక్స్‌లో గుడ్లను చేర్చుకోండి. అంతేగాక గుడ్లను రకరకాలుగా వండుకోవచ్చు. గుడ్లను ఉడికించి వండుకోవచ్చు. కోడిగుడ్డు అంటు పులుసు తయారీ ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

Food : కోడిగుడ్లు ఎవరైనా సరే ఇష్టంగా తినే వంటకం. గుడ్డు చాలా రుచిగా కూడా ఉంటుంది. గుడ్డులో ప్రొటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీ రోజువారీ భోజనంలో, స్నాక్స్‌లో గుడ్లను చేర్చుకోండి. అంతేగాక గుడ్లను రకరకాలుగా వండుకోవచ్చు. గుడ్లను ఉడికించి వండుకోవచ్చు. పగులగొట్టి కూడా వండుకోవచ్చు. వీటిలో ఉడికించిన గుడ్లు ఆరోగ్యానికి మంచిది. ఉడికించిన కోడిగుడ్లతో అంటుపులుసు పెట్టుకుంటే యమా రుచిగా ఉంటుంది. ఈ రెసిపీ చేసుకోవడం కూడా పెద్ద కష్టమేం కాదు. సులువుగా నిమిషాల్లో వండుకోవచ్చు. కోడిగుడ్డు అంటు పులుసు తయారీ ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
కావాల్సిన పదార్థాలు
కోడిగుడ్లు – 5, నూనె – 2 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ – 1, టమాట – 1, కొబ్బరి తురుము – ఒక కప్పు, లవంగాలు – 6, అల్లం వెల్లుల్లి – ఒక టేబుల్ స్పూన్, కారం పొడి – ఒక టేబుల్ స్పూన్, ఎండు మిర్చీలు – అరకప్పు, ధనియాల పొడి – ఒక టేబుల్ స్పూన్, పసుపు పొడి – 1/4 టీ స్పూన్, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, రుచికి సరిపడ ఉప్పు.
తయారీ విధానం
ముందుగా కోడిగుడ్లను ఉడికించాలి. తర్వాత స్టవ్ మీద ఒక పాత్రపెట్టి నూనె పోయాలి. నూనె వేడయ్యాక అందులో కరివేపాకు, ఉల్లిపాయలు వేసి బాగా వేయించాలి. ఒక నిమిషం తర్వాత టమాట వేసి వేగనివ్వాలి. అనంతరం మిక్సీ జార్ తీసుకుని అందులో కొబ్బరి తురుము, అల్లం, లవంగాలు, వెల్లుల్లి, ధనియాల పొడి, ఎండుమిర్చి వేసి, నీళ్లు పోసి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ రుబ్బిన మసాలాను స్టవ్ మీద ఒక పాత్రలో వేసి, కొంచెం నీళ్లు, కొంచెం ఉప్పు వేసి కలుపాలి. తర్వాత మూత మూసి మూడు నిమిషాలు ఉడకబెట్టాలి. తర్వాత మూత తీసి ఉడికించి పెట్టుకున్న గుడ్లను పులుసులో వేసుకోవాలి.
కోడిగుడ్లను పులుసులో వేసుకున్న తర్వాత మూతపెట్టి మోతాదు మంట మీద 10 నుంచి 15 నిమిషాలు ఉడకనివ్వాలి. ఆ తర్వాత మూత తీసి, పులుసును కలియతిప్పి, చివరగా కొత్తిమీర తరుగువేసి కలుపుతూ స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే.. ఘుమఘుమలాడే కోడిగుడ్డు అంటు పులుసు రెడీ. వేడివేడి అన్నంలో కలుపుకుని తింటుంటే ఆ మజాయే వేరు.