High blood pressure | అధిక రక్తపోటుతో బాధపడుతున్నారా..? ఈ పండుతో చెక్‌ పెట్టండి..!

High blood pressure | మారుతూ వస్తున్న జీవనశైలి కారణంగా దీర్ఘకాలిక వ్యాధులు పెరుగుతున్నాయి. ఇందులో అధిక రక్తపోటు ఒకటి. రక్తనాళాల ద్వారా పెరిగే ఒత్తిడినే రక్తపోటుగా పిలుస్తుంటారు. సాధారణంగా చాలా మంది హైబీపీని తేలిగ్గా తీసుకుంటారు. చిన్న సమస్యలాగే అనిపించినా.. ప్రాణాంతకమైంది. అధిక రక్తపోటును అరికట్టకపోతే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత కాలంలో చిన్న వయసు నుంచే రక్తపోటు సమస్య వేధిస్తున్నది. హైబీపీ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దని సూచిస్తున్నారు. అయితే, […]

High blood pressure | అధిక రక్తపోటుతో బాధపడుతున్నారా..? ఈ పండుతో చెక్‌ పెట్టండి..!

High blood pressure | మారుతూ వస్తున్న జీవనశైలి కారణంగా దీర్ఘకాలిక వ్యాధులు పెరుగుతున్నాయి. ఇందులో అధిక రక్తపోటు ఒకటి. రక్తనాళాల ద్వారా పెరిగే ఒత్తిడినే రక్తపోటుగా పిలుస్తుంటారు. సాధారణంగా చాలా మంది హైబీపీని తేలిగ్గా తీసుకుంటారు. చిన్న సమస్యలాగే అనిపించినా.. ప్రాణాంతకమైంది. అధిక రక్తపోటును అరికట్టకపోతే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత కాలంలో చిన్న వయసు నుంచే రక్తపోటు సమస్య వేధిస్తున్నది.

హైబీపీ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దని సూచిస్తున్నారు. అయితే, కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా బీపీని అదుపులో ఉంచుకోవచ్చుని నిపుణులు పేర్కొంటున్నారు. అందులో ఒకటి అరటిపండు. ఈ పండును తీసుకుంటే రక్తపోటు అదుపులో ఉంటుంది. అరటిపండు తినడం వల్ల అనేక ప్రయోజనాలుంటాయి. ఈ పండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. దాంతో అధిక రక్తపోటు నియంత్రణలోకి వస్తుంది. రోజుకు ఒకటి లేదా రెండు పండ్లను తీసుకోవాలి. తద్వారా గుండె జబ్బులు, సడన్ స్ట్రోక్స్ నుంచి కాపాడుకోవచ్చు.

సోడియం ఎక్కువగా తీసుకుంటే శరంలో రక్తనాళాలపై ఒత్తిడి కలిగిస్తుంది. ఆ పొటాషియం అధికంగా ఉన్న ఆహారం తీసుకుంటే.. మూత్రపిండాలపై ఒత్తిడి తగ్గుతుంది. అలాగే శరీరంలోని అదనపు సోడియం మూత్రం ద్వారా బయటకు వెళ్తుంది. పొటాషియం ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుతుంది. అరటిపండుతో పాటు బచ్చలికూర, ఆకుకూరలు, ఓట్స్, పుచ్చకాయ, అవకాడో, దుంపలు, నారింజ, పొద్దుతిరుగుడు విత్తనాలు, క్యారెట్లు తదితరలను సరైన మోతాదులో తీసుకున్నా అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు.