Brain Stroke | బీ ఫాస్ట్ సూత్రంతో బ్రెయిన్ స్ట్రోక్‌ను అరికట్టొచ్చు!
18 ఏళ్లు దాటిన ప్రతీ ఒక్కరూ సంవత్సరానికి ఒక్కసారైనా బీపీ చెక్ చేయించుకోవాలి. బీపీ 140/90 కంటే ఎక్కువగా ఉంటే వెంటనే చర్యలు తీసుకోవాలి ఇలా చేస్తే 50% బ్రెయిన్ స్ట్రోక్లను నివారించవచ్చునని పేర్కొన్నారు. అలాగే BE FAST పద్ధతి...

Brain Stroke | ఈ మధ్య కాలంలో బ్రెయిన్ స్ట్రోక్ అనేది సర్వసాధారనమైంది. గతంలో అయితే వయసుపైబడ్డవారిలో ఎక్కువగా కనిపించే ఈ బ్రెయిన్ స్ట్రోక్, పక్షవాతం ఇప్పుడు రెండు పదుల వయసు కూడా నిండని యువతను సైతం బలి తీసుకుంటుంది. బ్రెయిన్ స్ట్రోక్, పక్షవాత భూతాన్ని అవగాహనతో వెంటనే అరికట్టవచ్చని ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ బృదం వెల్లడించింది. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్‌లోని వివాంటా హోటల్‌లో బ్రెయిన్ స్ట్రోక్- టైం టూ యాక్ట్ అనే అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
బ్రెయిన్ స్ట్రోక్ లేదా పక్షవాతం మన దేశంలో ప్రతి నలుగురిలో ఒకరికి వస్తుందని, వీరిలో 25 శాతం మంది 40 సంవత్సరాలు లోపు వారే ఉండటం గమనార్హం అని ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డా. విజయ తెలిపారు. ప్రతి 20 సెకన్లకు ఒకరికి పక్షవాతం వస్తున్నది. ప్రతి సంవత్సరం 18 లక్షల మంది పక్షవాత బారిన పడుతున్నారన్నారు. పక్షవాతానికి వైద్యం లేదనే అపోహ ఎక్కువ మందిలో ఉందన్నారు. అలా అనుకోవడం తప్పని దానికి విరుద్ధంగా ఇప్పుడు చాలా ఎవిడెన్స్ బేస్డ్ చికిత్స విధానాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. పక్షవాతంలో రెండు రకాలు ఉన్నా అధికంగా కపించేది ఇస్కెమిక్ స్ట్రోక్ అని దీన్ని థ్రోంబోలిసిస్ అనే ఇంజక్షన్‌తో నివారించవచ్చని ఆమె వెల్లడించారు. కానీ దీని వినియోగం మన దేశంలో కేవలం ఒక శాతం రోగులకు మాత్రమే అందుతుందని తెలిపారు.
థ్రోంబోలిసిస్ అనే ఇంజక్షన్ ద్వారా మెదడులో రక్తం గడ్డకట్టకుండా చేస్తుందని నిపుణులు వెల్లడించారు. ఈ చికిత్స కేవలం ఒక శాతం మంది రోగులకు మాత్రమే అందడానికి ప్రధాన కారణం స్ట్రోక్, పక్షవాత లక్షణాలను ఆలస్యంగా గుర్తించడంతోనే జరుగుతుందన్నారు. స్ట్రోక్ లక్షణాలు ఉన్నట్టుండి ఒకే సారి పట్టు కోల్పోవడం, మూతి వంకర అవ్వడం, చేతిలో తిమ్మిర్లు రావడం, మాటపడిపోవడం, కళ్లు తిరగడం, సడన్‌గా విపరీతమైన తలనొప్పి, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా 4 గంటల్లో స్ట్రోక్ స్ట్రోక్ రెడీ ఆసుపత్రికి తీసుకెళ్లాలని పేర్కొన్నారు. స్ట్రోక్ రెడీ ఆసుపత్రి అంటే సిటీ స్కాన్ చేసి, న్యూరలజిస్టులు ఉన్న ఆసుపత్రులని తెలిపారు.
18 ఏళ్లు దాటిన ప్రతీ ఒక్కరూ సంవత్సరానికి ఒక్కసారైనా బీపీ చెక్ చేయించుకోవాలి. బీపీ 140/90 కంటే ఎక్కువగా ఉంటే వెంటనే చర్యలు తీసుకోవాలి ఇలా చేస్తే 50% బ్రెయిన్ స్ట్రోక్లను నివారించవచ్చునని పేర్కొన్నారు. అలాగే BE FAST పద్ధతి
- B బ్యాలెన్స్ కోల్పోవడం (Balance loss)
- E (కంటి దృష్టి మార్పులు)
- F మూతి వంకర పోవడం (Face drooping)
- A చేయి చచ్చు బడి పోవటం (Arm weakness)
- S మాటలో ముద్దగా రావటం (Speech difficulty)
- T అత్యవసర సేవలకు కాల్ చేయడానికి సమయం (Time to call emergency services)
ఈ సూత్రాన్ని గుర్తుంచుకోవడం.. అంటే గోల్డెన్ అవర్స్‌లో స్ట్రోక్ రెడీ ఆసుపత్రికి చేరుకోవడం ఎంత ముఖ్యమని వివరించారు.