కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌తో గుండెకు ప్రమాదం.. కార్డియాలజిస్ట్‌ సంచలన వ్యాఖ్యలు..!

Covishield Vaccine | కరోనా మహమ్మారి నేపథ్యంలో వైరస్‌ కట్టడికి ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున కంపెనీలు టీకాలు ఉత్పత్తి చేస్తున్నాయి. అయితే, ఈ టీకాలతో దుష్ఫలితాలున్నాయని పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. తాజాగా ఆక్స్‌ఫర్డ్‌ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌తో గుండెపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలున్నాయని బ్రిటిష్‌ ఇండియన్‌ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ అసీమ్‌ మల్హోత్రా హెచ్చరించారు. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్‌ భారత్‌లో కొవిషీల్డ్‌ పేరుతో సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ఉత్పత్తి చేస్తున్నది. ఇంతకు ముందు ఎంఆర్‌ఎన్‌ఏ కొవిడ్‌-19 వ్యాక్సిన్ల […]

కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌తో గుండెకు ప్రమాదం.. కార్డియాలజిస్ట్‌ సంచలన వ్యాఖ్యలు..!

Covishield Vaccine | కరోనా మహమ్మారి నేపథ్యంలో వైరస్‌ కట్టడికి ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున కంపెనీలు టీకాలు ఉత్పత్తి చేస్తున్నాయి. అయితే, ఈ టీకాలతో దుష్ఫలితాలున్నాయని పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. తాజాగా ఆక్స్‌ఫర్డ్‌ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌తో గుండెపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలున్నాయని బ్రిటిష్‌ ఇండియన్‌ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ అసీమ్‌ మల్హోత్రా హెచ్చరించారు. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్‌ భారత్‌లో కొవిషీల్డ్‌ పేరుతో సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ఉత్పత్తి చేస్తున్నది. ఇంతకు ముందు ఎంఆర్‌ఎన్‌ఏ కొవిడ్‌-19 వ్యాక్సిన్ల పంపిణీని నిలిపివేయాలని అసీమ్‌ మల్హోత్రా పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

కొవిషీల్డ్‌, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌తో గుండెపోటు, స్ట్రోకులు, పక్షవాతం, రక్తం గడ్డకట్టం తదితర సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. కొవిషీల్డ్‌తో గుండెపై ఇంతకుమించిన స్థాయిలో నష్టాలు ఉంటాయన్నారు. బ్రిటన్‌లో ఈ టీకా పొందినవారిలో పది శాతం మందికి ఈ పరిస్థితి ఉత్పన్నమైందని వెల్లడించారు. డాక్టర్‌ మల్హోత్రా నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌లో శిక్షణ పొందారు. ఇటీవల ఆయన ఫైజర్‌, మోడెర్నా తయారు చేసిన ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్లను నిలిపివేయాలని అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ హృదయనాళాలు, గుండెపోటు, స్ట్రోక్‌, సోయిమ్‌ డెత్‌, క్లాటింగ్‌ ఫైజర్‌ ఎంఆర్‌ఎన్‌ఏ టీకా కంటే చాలా దారుణంగా ఉందని, చిన్నా, పెద్ద వయసున్న వ్యక్తుల్లో సమస్య ఉందన్నారు.

అయితే, తీవ్రమైన దుష్ర్ఫభావాల నేపథ్యంలో యూకే, యూరోపియన్‌ దేశాల్లో టీకా పంపిణీ నిలిపివేశారని, కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ను భారత్‌లో ఎందుకు వేస్తున్నారని ప్రశ్నించారు. వెంటనే టీకాలపై సస్పెన్షన్‌ విధించాల్సిన అవసరం ఉందన్నారు. కొవాగ్జిన్‌ టీకాపై స్పందిస్తూ ప్రస్తుతం తాను చేసిన డేటా మేరకు ఎలాంటి ప్రభావాలు ఉన్నట్లు సూచించలేదన్నారు. ఇంకా ఆయన స్పందిస్తూ 90శాతం కంటే ఎక్కువ మంది కొవిడ్‌కు గురయ్యారని, దీంతో సహజ రోగనిరోధకశక్తి ఉందన్నారు. ఈ రోగ నిరోధకశక్తి వైరస్‌ నుంచి రక్షణ కల్పిస్తుందన్నారు. భారత్‌లో ఎవరికీ టీకాలు వేయాల్సిన అవసరం లేదని డాక్టర్‌ మల్హోత్రా స్పష్టం చేశారు. ఖచ్చితంగా బూస్టర్‌ డోస్‌ వేయాల్సిన అవసరం లేదన్నారు. ఎక్కువ డోసులు వేస్తే తీవ్రమైన దుష్ప్రభావాలకు గురయ్యే అవకాశం ఎక్కువ ఉందన్నారు.