మ‌ధ్యాహ్న భోజ‌నం చేసిన త‌ర్వాత ఈ పండ్ల‌ను తింటున్నారా..? జ‌ర జాగ్ర‌త్త మ‌రి..!

ఇక వేస‌వి కాలం వ‌చ్చేసింది. ఎండ‌లు మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది శ‌రీరంలో చ‌ల్ల‌ద‌నం కోసం పండ్ల‌ను తింటుంటారు. అందులో సిట్ర‌స్ జాతికి చెందిన పండ్లను ఎక్కువ‌గా తినేందుకు ఇష్ట‌ప‌డుతుంటారు

మ‌ధ్యాహ్న భోజ‌నం చేసిన త‌ర్వాత ఈ పండ్ల‌ను తింటున్నారా..? జ‌ర జాగ్ర‌త్త మ‌రి..!

విధాత‌: ఇక వేస‌వి కాలం వ‌చ్చేసింది. ఎండ‌లు మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది శ‌రీరంలో చ‌ల్ల‌ద‌నం కోసం పండ్ల‌ను తింటుంటారు. అందులో సిట్ర‌స్ జాతికి చెందిన పండ్లను ఎక్కువ‌గా తినేందుకు ఇష్ట‌ప‌డుతుంటారు. ఎందుకంటే.. ఈ సిట్ర‌స్ జాతి ఫ్రూట్స్‌లో విట‌మిన్ సీ అధికంగా ఉంటుంది. ఇమ్యూనిటీని పెంచే శ‌క్తివంత‌మైన యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి.


అయితే చాలా మంది ఎండ‌ల నుంచి ఉప‌శ‌మ‌నం పొందేందుకు మ‌ధ్యాహ్నం భోజ‌నం త‌ర్వాత ఈ పండ్ల‌ను తినేందుకు ఆస‌క్తి చూపిస్తుంటారు. కానీ మ‌ధ్యాహ్న భోజ‌నం చేసిన త‌ర్వాత సిట్ర‌స్ జాతికి చెందిన పండ్ల‌ను తింటే ఆరోగ్యంపై ప్ర‌తికూల ప్ర‌భావం చూపే అవ‌కాశం ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే మధ్యాహ్నం భోజనం తర్వాత సిట్రస్ పండ్లను తినడం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి తెలుసుకుందాం.



బీపీ హెచ్చుత‌గ్గులు..


సిట్ర‌స్ జాతికి చెందిన పండ్ల‌లో స‌హ‌జ చ‌క్కెర‌లు ఉంటాయి. అయిన‌ప్ప‌టికీ భోజ‌నం చేసిన వెంట‌నే వాటిని తిన‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు వేగంగా పెరిగే అవ‌కాశం ఉంటుంది. కొన్ని సంద‌ర్భంగా షుగ‌ర్ లెవ‌ల్స్ ప‌డిపోయే ప్ర‌మాదం కూడా ఉంటుంది. కాబ‌ట్టి బీపీతో బాధ‌ప‌డేవారు మ‌ధ్యాహ్న భోజ‌నం త‌ర్వాత తిన‌క‌పోవ‌డ‌మే మంచిది.


జీర్ణ‌క్రియ‌పై ప్ర‌భావం..


సిట్ర‌స్ పండ్లు దాదాపుగా పుల్ల‌గా ఉంటాయి. మధ్యాహ్న భోజనం చేసిన వెంటనే వీటిని తింటే జీర్ణక్రియకు అంతరాయకం కలుగుతుంది. సిట్ర‌స్‌లో ఉండే ఆమ్లత్వం అసౌకర్యాన్ని కలిగిస్తుంది. అజీర్ణం లేదా గుండెల్లో మంటకు కారణం అవుతుంది. ముఖ్యంగా యాసిడ్ రిఫ్లెక్స్ గురయ్యే వారిలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది.


జీర్ణ స‌మ‌స్య‌లు సంభ‌వించే అవ‌కాశం..


కొంతమంది వ్యక్తులు భోజనం తర్వాత సిట్రస్ పండ్లను తినేటప్పుడు ఉబ్బరం లేదా గ్యాస్ వంటి స‌మ‌స్య‌లు ఏర్ప‌డే అవ‌కాశం ఉంటుంది. సున్నితమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారిలో ఎక్కువగా అసౌకర్యం ఉంటుంది. గ్యాస్ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డేవారు సిట్ర‌స్ జాతి పండ్ల‌కు దూరంగా ఉంటే మంచిది.


పోషకాల శోషణ ఆలస్యం..


మ‌ధ్యాహ్న భోజ‌నం త‌ర్వాత సిట్ర‌స్ పండ్ల‌ను తిన‌డంతో వాటిలో ఉండే కొన్ని స‌మ్మేళ‌నాల వ‌ల్ల నిర్ధిష్ట పోషకాలను గ్రహించడంలో ఆటంకం ఏర్పడే అవ‌కాశం ఉంటుంది. శరీరానికి కావాల్సిన ఖనిజాలు, విటమిన్ల లభ్యతను ప్రభావితం చేస్తుంది. పోషకాల శోషణను ప్రభావితం చేసే సిట్రస్ పండ్లలోని సమ్మేళనాలు పాలీఫెనాల్స్, టానిన్లు, ఆక్సలేట్‌లను కలిగి ఉంటాయి. భోజనం చేసిన తర్వాత వీటిని తింటే ఐరన్, ఖనిజాలు, కాంప్లెక్స్, కాల్షియం శోషణను తగ్గిస్తుంది.