Skin Care Tips | ఈ కూరగాయలతో ఆరోగ్యంతో పాటు ముఖ సౌందర్యం

Skin Care Tips | రోజువారీ ఆహారంలో కూరగాయలను చేర్చుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో కొవ్వు, కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. దీంతో పోషకాలను కలిగి ఉంటాయి. అయితే, కొన్ని కూరగాయలు ముఖ సౌందర్యానికి కూడా వాడుకోవచ్చు. అవును మీరు చదివింది నిజమే.. కొన్ని కూరగాయలు ముఖం ఛాయ, అందాన్ని పెంచేందుకు పనికొస్తాయి. ఆరోగ్యకరమైన, మెరిసే చర్మం కావాలంటే కూరగాయలు తినడంతో పాటు చర్మ సౌందర్యానికి ఫేస్‌ప్యాక్‌ కూడా వాడుకోవచ్చు. అవేంటో ఓసారి తెలుసుకుందాం […]

Skin Care Tips | ఈ కూరగాయలతో ఆరోగ్యంతో పాటు ముఖ సౌందర్యం

Skin Care Tips | రోజువారీ ఆహారంలో కూరగాయలను చేర్చుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో కొవ్వు, కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. దీంతో పోషకాలను కలిగి ఉంటాయి. అయితే, కొన్ని కూరగాయలు ముఖ సౌందర్యానికి కూడా వాడుకోవచ్చు. అవును మీరు చదివింది నిజమే.. కొన్ని కూరగాయలు ముఖం ఛాయ, అందాన్ని పెంచేందుకు పనికొస్తాయి. ఆరోగ్యకరమైన, మెరిసే చర్మం కావాలంటే కూరగాయలు తినడంతో పాటు చర్మ సౌందర్యానికి ఫేస్‌ప్యాక్‌ కూడా వాడుకోవచ్చు. అవేంటో ఓసారి తెలుసుకుందాం రండి..

నిమ్మకాయ

నిమ్మకాయ సహజ బ్లీచింగ్ ఏజెంట్‌లాంటిది. ఇది మీ చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి దీన్ని ముఖానికి అప్లై చేసుకుంటే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దీన్ని అప్లై చేయడానికి, ఒక చెంచాలో కొన్ని చుక్కల నిమ్మకాయను తీసుకుని, దానికి తేనె కలపండి. ఆ తర్వాత ముఖంపై 30 నిమిషాల పాటు అప్లై చేయండి. తర్వాత ముఖాన్ని శుభ్రమైన నీటితో కడగాలి. ఇలా చేయడం వల్ల చర్మం మెరుస్తూ అందంగా మారుతుంది.

దోసకాయ

సున్నితమైన చర్మంపై శీతలీకరణ ఏజెంట్‌గా పనిచేస్తుంది. మీరు దీన్ని సహజ టోనర్‌గా ఉంటుంది. మరోవైపు, కండ్లు ఉబ్బినట్లుగా అనిపిస్తే.. దోసకాయ ఉపశమనం కలిగిస్తుంది.

బంగాళదుంప

బంగాళాదుంపలో అనేక ఖనిజాలు, విటమిన్లు ఉంటాయి. దీన్ని చర్మంపై అప్లై చేస్తే.. నల్ల మచ్చలు తొలగిపోతాయి. చర్మానికి సంబంధించిన ఏదైనా సమస్యలుంటే బంగాళదుంపను ముఖానికి అప్లై చేసుకుంటే మంచి ఫలితాలుంటాయి.

బీట్‌రూట్

బీట్‌రూట్‌ సైతం చర్మ ఆరోగ్యానికి ఉపయోకరంగా ఉంటుంది. చర్మం ప్రతిరోజూ రాస్తూ వస్తుంటే..చర్మం సహజమైన గులాబీ రంగులోకి మారుతుంది. రెండు స్పూన్‌ల బీట్‌రూట్ రసం, చెంచా పాలు కలిపి ముఖానికి పట్టించాలి. పావుగంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే ముఖానికి మంచి రంగు వస్తుంది.

క్యారెట్‌

క్యారెట్‌లో విటమిన్ ఎ ఉంటుంది. కాబట్టి ఇది బ్లాక్‌హెడ్స్‌ను తొలగించడానికి ఉపయోగిస్తారు. క్యారెట్ తినడంతో పాటు, మీరు వాటిని మీ ముఖానికి కూడా రాసుకుంటే మంచి ఫలితాలుంటాయి.