Calcium | కాల్షియం సమస్యతో బాధ పడుతున్నారా..? ఎముకల బలానికి ఇవి బెస్ట్ ఫుడ్స్..!
Calcium | మానవ శరీరంలో కాల్షియం దృఢత్వాన్ని పెంచడంలో కీలకమైంది. శరీరంలో ఇతర ఖనిజాల కంటే ఎక్కువ కాల్షియం ఉంటుంది. అయితే, కాల్షియం లోపాన్ని తగ్గించుకునేందుకు ఎక్కువగా పాలు, పెరుగు తీసుకుంటారు. కానీ, కొందరికి పాల ఉత్పత్తులు తినడానికి ఇష్టముండదు. ఎముకలు దృఢంగా ఉండాలంటే కాల్షియం కీలకమైన విషయం అందరికీ తెలిసిందే. అయితే, పాలతో మాత్రమే ఈ అవసరం తీరుతుందనే భ్రమలో ఉంటారు. కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాలు పుష్కలంగా ఉన్నాయి. వాటిలో కొన్నింటిని గురించి తెలుసుకుని […]

Calcium | మానవ శరీరంలో కాల్షియం దృఢత్వాన్ని పెంచడంలో కీలకమైంది. శరీరంలో ఇతర ఖనిజాల కంటే ఎక్కువ కాల్షియం ఉంటుంది. అయితే, కాల్షియం లోపాన్ని తగ్గించుకునేందుకు ఎక్కువగా పాలు, పెరుగు తీసుకుంటారు. కానీ, కొందరికి పాల ఉత్పత్తులు తినడానికి ఇష్టముండదు. ఎముకలు దృఢంగా ఉండాలంటే కాల్షియం కీలకమైన విషయం అందరికీ తెలిసిందే. అయితే, పాలతో మాత్రమే ఈ అవసరం తీరుతుందనే భ్రమలో ఉంటారు. కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాలు పుష్కలంగా ఉన్నాయి. వాటిలో కొన్నింటిని గురించి తెలుసుకుని పరిశీలించి, వాటిని మీ రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
- శరీరంలో కాల్షియం, ప్రొటీన్ల లోపాన్ని భర్తీ చేయడానికి చాలా మంది పాలు తాగుతారు. కానీ, సోయా పాలు తాగితే, ఆవు పాలతో సమానమైన కాల్షియం ఉంటుంది. సోయా పాలల్లో విటమిన్ డీ ఎక్కువగా ఉంటుంది. రెగ్యులర్‌గా సోయా మిల్క్ తీసుకుంటే వస్తే కాల్షియం లోపాన్ని తగ్గించుకోవచ్చు.
- చియా గింజల్లో కాల్షియం, ప్రోటీన్, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి మంచి పోషకాలు ఉంటాయి. ఇవి ఎముకలను బలోపేతం చేస్తాయి. పాల ఉత్పత్తులను నివారించే వారికి కాల్షియం సహాయపడుతుంది. ఈ విత్తనాలతో కండరాలు బలంగా ఉంటాయి. కాల్షియం లోపాన్ని పూర్తి చేయాలనుకుంటే.. చియా విత్తనాలను తీసుకుంటే అద్భుత ఫలితం ఉంటుంది.
- కాల్షియం సమస్యతో బాధపడేవారికి మంచి ఫుడ్. ఎముకల బలానికి ఎంతో మంచి ఆహారం. మన శరీరానికి కావాల్సిన అతి ముఖ్యమైన పోషకాల్లో కాల్షియం ఒకటి. ఎదుగుతున్న పిల్లలకు ఎంతో అవసరం. మెదడుకు నరాల ద్వారా సందేశాలను పంపించడంలో కీలక పాత్రపోషిస్తుంది.