Jamun Fruit | నేరేడు పండ్లు గుండెకు ఔష‌ధం..! మ‌రి గ‌ర్భిణులు తినొచ్చా..?

Jamun Fruit | ప్ర‌తి ఒక్క‌రూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే.. ప్ర‌కృతి సిద్ధంగా ల‌భించే పండ్లు, కూర‌గాయలు త‌ప్పనిస‌రిగా తినాల్సిందే. అయితే ప్ర‌కృతిలో స‌హజంగా ల‌భించే పండ్ల‌లో అల్ల నేరేడు పండు ఒక‌టి. ఇప్పుడు మార్కెట్లో, రోడ్ల‌పై ఎక్క‌డ చూసినా ఆ పండ్లే ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. కొంచెం న‌లుపు రంగులో ఉండే నేరేడు పండ్లు నిగ‌నిగ‌లాడుతూ.. మ‌న‌ల్ని ఆక‌ర్షిస్తుంటాయి. ఇంకేముంది ఆ పండ్ల‌ను కొనుక్కొని ఆర‌గించేస్తుంటాం.. అయితే ఈ పండులో అనేక పోష‌కాలు ఉన్నాయి. గుండె, మెద‌డు ప‌నితీరుకు […]

  • Publish Date - June 28, 2023 / 03:41 AM IST

Jamun Fruit | ప్ర‌తి ఒక్క‌రూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే.. ప్ర‌కృతి సిద్ధంగా ల‌భించే పండ్లు, కూర‌గాయలు త‌ప్పనిస‌రిగా తినాల్సిందే. అయితే ప్ర‌కృతిలో స‌హజంగా ల‌భించే పండ్ల‌లో అల్ల నేరేడు పండు ఒక‌టి. ఇప్పుడు మార్కెట్లో, రోడ్ల‌పై ఎక్క‌డ చూసినా ఆ పండ్లే ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. కొంచెం న‌లుపు రంగులో ఉండే నేరేడు పండ్లు నిగ‌నిగ‌లాడుతూ.. మ‌న‌ల్ని ఆక‌ర్షిస్తుంటాయి. ఇంకేముంది ఆ పండ్ల‌ను కొనుక్కొని ఆర‌గించేస్తుంటాం.. అయితే ఈ పండులో అనేక పోష‌కాలు ఉన్నాయి. గుండె, మెద‌డు ప‌నితీరుకు చ‌క్క‌టి ఔష‌ధంగా ప‌ని చేస్తుంది. కొన్ని ర‌కాల రోగాల‌ను నియంత్రించే శ‌క్తి నేరేడు పండు సొంతం.. పండే కాదు.. ఆ ఆకులు, బెర‌డు కూడా ఎంతో మేలు చేస్తాయి. అల్ల నేరేడు పండు వ‌ల్ల క‌లిగే లాభాలు, న‌ష్టాలు ఏంటో తెలుసుకుందాం..

లాభాలు..

  • నేరేడు పండ్లు శ‌రీరానికి చ‌లువ‌ను ఇస్తాయి.
  • దీర్ఘ‌కాలిక వ్యాధులతో బాధ‌ప‌డేవారు ఈ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.
  • మూత్ర సంబంధ స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నాన్ని క‌లిగిస్తుంది.
  • క‌డుపులో పేరుకుపోయిన మ‌లినాల‌ను బ‌య‌ట‌కు పంపేందుకు ఎంతో దోహ‌దం చేస్తాయి.
  • కాలేయం ప‌నితీరు మెరుగ‌వుతుంది.
  • మెద‌డుకు, గుండెకు మంచి ఔష‌ధంగా ప‌ని చేస్తాయి.
  • నీర‌సంతో బాధ‌ప‌డే వారు ఈ పండ్లు తిన‌డంతో త‌క్ష‌ణ‌మే శ‌క్తి వ‌స్తుంది.
  • వెన్ను నొప్పి, న‌డుం నొప్పి, మోకాళ్ల నొప్పులు న‌యం అయ్యే అవ‌కాశం ఉంది.
  • నేరేడు పండును రోజుకొకటి చొప్పున తింటే వైద్యుల నుంచి దూరంగా ఉండవచ్చునని నిపుణులు చెబుతున్నారు.

న‌ష్టాలు..

  • నేరేడు పండ్లను ఖాళీ కడుపుతో అస్సలు తినకూడదు.
  • అతిగా తిన‌డం వ‌ల్ల శ్వాస స‌మ‌స్య‌లు సంభ‌విస్తాయి.
  • శ‌రీరంలో వాత దోషాన్ని తీవ్ర‌త‌రం చేస్తాయి.
  • గర్భిణులు, పాలిచ్చే తల్లులు డాక్టర్‌ సలహా లేకుండా నేరేడు తినడం మంచిది కాదు.
  • నేరేడు పండ్లు తిన్నప్పుడు వాంతులు, వికారం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. అలాంటివాళ్లు కూడా దూరంగా ఉండాలి.

Health Tips | అజీర్తితో బాధ‌ ప‌డుతున్నారా..? ఈ ర‌సం తాగితే క్ష‌ణాల్లో పొట్టంతా క్లీన్..!

Latest News