Idiot Syndrome | మీరూ ఈ పని చేస్తున్నారా..? ‘ఇడియట్ సిండ్రోమ్’ బాధితులే..!
Idiot Syndrome | ప్రస్తుత కాలంలో ఇంటర్‌నెట్ వినియోగం విపరీతంగా పెరిగింది. అన్నింటి ఆరోగ్య సమస్యలను చిట్కాలు గూగుల్‌లో వెతికేస్తున్నారు. ఎవరికి వారు తమకు తోచిన మందులు తెచ్చుకుంటూ సొంత వైద్యం చేసుకుంటున్నారు. అయితే, అన్నింటికీ డాక్టర్ దగ్గరకు వెళ్లకుండా ఇంటర్‌నెట్‌పైనే ఆధారపడే లక్షణాలనే ‘ఇడియట్ సిండ్రోమ్’గా పిలుస్తుంటారు.

Idiot Syndrome | ప్రస్తుత కాలంలో ఇంటర్‌నెట్ వినియోగం విపరీతంగా పెరిగింది. అన్నింటి ఆరోగ్య సమస్యలను చిట్కాలు గూగుల్‌లో వెతికేస్తున్నారు. ఎవరికి వారు తమకు తోచిన మందులు తెచ్చుకుంటూ సొంత వైద్యం చేసుకుంటున్నారు. అయితే, అన్నింటికీ డాక్టర్ దగ్గరకు వెళ్లకుండా ఇంటర్‌నెట్‌పైనే ఆధారపడే లక్షణాలనే ‘ఇడియట్ సిండ్రోమ్’గా పిలుస్తుంటారు. ‘ఇంటర్‌నెట్ డిరైవ్డ్ ఇన్ఫర్మేషన్ అబ్‌స్ట్రక్షన్ టీట్‌మెంట్’ దీని అర్థం. అలాగే, దీన్నే సైబర్ క్రోండియా కూడా పిలుస్తుంటారు. సింపుల్‌గా చెప్పాలంటే మీకున్న అనారోగ్య లక్షణాలను ఇంటర్నెట్‌లో దొరికే వైద్య సమాచారంతో పోల్చుకొని తప్పుగా అన్వయించుకోవడమేనని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి వారి సంఖ్య పెరిగినట్లుగా ఓ అధ్యయనం వెల్లడించింది. ఏ ఆరోగ్య సమస్య వచ్చినా వైద్యుడి వద్దకు వెళ్లకుండా సొంతంగా ఇంటర్‌నెట్‌పై ఆధారపడే వ్యక్తులు తాము మేలు చేసుకుంటున్నామకుంటున్నారని.. కానీ ఇందులో కీడే ఎక్కువగా ఉందని అధ్యయనం స్పష్టం చేసింది.
ఈ లక్షణాలు కనిపించిన రోగులు.. ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న సమాచారంతో సొంత చికిత్స తీసుకుంటున్నారని పేర్కొంది. కొందరు డాక్టర్లు ప్రిస్క్రిప్షన్‌లో సూచించిన మందులతో పాటు చికిత్సను సైతం పక్కన పెట్టి సొంత వైద్యంపైనే ఆధారపడుతున్నారని.. ఇది ఎంతో ప్రమాదకరమని హెచ్చరించింది. నమ్మదగ్గ హెల్త్ వెబ్‌సైట్స్ ద్వారా రోగులు విశ్వసనీమయైన సమాచారం పొందడం వరకు మంచిదేనని.. కానీ, అర్హత కలిగి ఉన్న వైద్య నిపుణుడు చికిత్స సామర్థ్యానికి అది ఏమాత్రం సరిపోలేదని అధ్యయనం పేర్కొంది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌కి చెందిన ‘క్యూరియస్’లో ఈ అధ్యయనం ప్రచురితమైంది. సిండ్రోమ్ నుంచి బయటపడాలంటే ముందుగా సమస్యపై తీవ్రంగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మొబైల్ వాడకాన్ని తగ్గించాలని సూచిస్తున్నారు. ఎక్కువగా ఇలా వెతకడం వల్ల భవిష్యత్‌లో యాంగ్జయిటీ తదితర సమస్యలు వస్తాయని అధ్యయనం హెచ్చరించింది. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే తప్పనిసరిగా వైద్య నిపుణులనే సంప్రదించాలని సూచిస్తున్నారు.