పిల్ల‌ల ప‌ట్ల తల్లిదండ్రులు జాగ్ర‌త వ‌హించ‌క‌పోతే.. అంతే

పిల్ల‌ల‌ను పెంచి పెద్ద చేయ‌డంలో తల్లిదండ్రులు పాత్ర కీల‌కం. పిల్ల‌ల పెంప‌కంలో ఏదైన త‌ప్పు జ‌రిగినా అది తల్లిదండ్రుల‌దేనంటుంటూరు

  • By: Somu    health    Mar 23, 2024 11:43 AM IST
పిల్ల‌ల ప‌ట్ల తల్లిదండ్రులు జాగ్ర‌త వ‌హించ‌క‌పోతే.. అంతే

విధాత‌: పిల్ల‌ల‌ను పెంచి పెద్ద చేయ‌డంలో తల్లిదండ్రులు పాత్ర కీల‌కం. పిల్ల‌ల పెంప‌కంలో ఏదైన త‌ప్పు జ‌రిగినా అది తల్లిదండ్రుల‌దేనంటుంటూరు. పిల్ల‌ల ప్ర‌వ‌ర్త‌నలో, వారి న‌డ‌వ‌డిక‌లో మార్పులు తీసుకువ‌చ్చేది తల్లిదండ్రులే. అటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు తమ పిల్లలతో తెలివిగా ప్రవర్తించడం చాలా ముఖ్యం. తల్లిదండ్రులు ఒకటితో ఒకరు ఎలా ఉన్నారు వారి పిల్లలు కూడా అదే విధంగా ప్రవర్తిస్తుంటారు. పిల్ల‌ల మెరుగైన సంర‌క్ష‌ణ‌ను అందించాల‌నుకుంటే త‌ల్లిదండ్రుల మ‌ధ్య మంచి ప్ర‌వ‌ర్త‌న కొన‌సాగించాలి.


పిల్లలు ఆత్మవిశ్వాసం వారి జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఆత్మవిశ్వాసంతో పిల్లలు త‌మ‌ లక్ష్యాలను సాధించి జీవితంలో రాణించగలుగుతారు. కానీ కొన్నిసార్లు తల్లిదండ్రులు కొన్నిమాటలు పిల్లలలో ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తాయి. తల్లిదండ్రులు ఒక్కొక్కసారి తమకు తెలియకుండానే పిల్లలు ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తారు. ఇది మాత్ర‌మే కాదు అన్ని స‌మ‌యాల్లో పిల్ల‌ల ప‌ట్ల క‌ఠినంగా ప్ర‌వ‌ర్తిస్తే ఆ త‌రువాత పిల్లల్లో మార్ప‌లు ఉంటాయ‌ని సైకాల‌జీ నిపుణులు చెబుతున్నారు. తల్లిదండ్రులు ప్రవర్తించే తీరును బట్టి పిల్లలు వారికి దూరమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.

వేసవి కాలంలో పిల్లలు జాగ్రత్త


వేసవి కాలంలో వండిన పదార్థాలు ఎండవేడికి త్వరగా చెడిపోతాయి. అలాగని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తింటే ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. ఏమాత్రం ఆజాగ్ర‌త‌ వహించిన పిల్లలు వాంతులు విరేచనాల బారిన ప‌డ‌వ‌చ్చు. ఫ్రిడ్జ్ లో కూలింగ్ నీరు తాగడం వల్ల పిల్లలు వెంటనే జలుబు బారిన పడే అవకాశాలు ఉన్నాయి. అధిక వేడి పిల్లలు అనారోగ్యం పాలు చేస్తుంది. శరీర ఉష్ణోగ్రతలు పెరగడం వ‌ల్ల‌ నీరసం, వడదెబ్బకు గురి కావడం వంటివి జ‌రుగుతుంటాయి. పిల్లలు రోజంతా హైడ్రేట్‌గా ఉండేలా చూసుకోవాలి. పిల్లలు హైడ్రేట్‌గా ఉండాలంటే కొబ్బరి నీళ్ళు, పండ్ల‌ రసాలు, సిట్ర‌స్‌ పండ్లు మ‌రియు మజ్జిగ, నిమ్మకాయ నీరు వంటివి త‌ల్లిదండ్రులు ఇస్తూ ఉండాలి.