దేశంలో కొత్త కొవిడ్ కేసులు 760

దేశంలో గ‌డిచిన 24 గంట‌ల్లో 760 కొత్త కొవిడ్ కేసులు న‌మోద‌య్యాయి. దాంతో యాక్టివ్‌ కేసుల సంఖ్య 4,423కు చేరింది. క‌రోనా వైర‌స్‌తో మరో ఇద్దరు చ‌నిపోయారు

దేశంలో కొత్త కొవిడ్ కేసులు 760
  • క‌రోనా వైర‌స్ కార‌ణంగా ఇద్ద‌రు మృతి
  • 4,423కు చేరిన యాక్టివ్ కేసు సంఖ్య‌


విధాత‌: దేశంలో గ‌డిచిన 24 గంట‌ల్లో 760 కొత్త కొవిడ్ కేసులు న‌మోద‌య్యాయి. దాంతో యాక్టివ్‌ కేసుల సంఖ్య 4,423కు చేరింది. క‌రోనా వైర‌స్‌తో మరో ఇద్దరు చ‌నిపోయారు. ఇప్పటివరకు JN.1 వేరియంట్ కేసులు 511 నమోదయ్యాయి. ఈ మేర‌కు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం ఉద‌యం హెల్త్ బులెటిన్‌ను విడుద‌ల చేసింది.


కేరళలో ఒక‌రు, కర్ణాటకలో మ‌రొక‌రు చ‌నిపోయారు. డిసెంబర్ ఐదు వరకు రోజువారీ కేసుల సంఖ్య రెండంకెలకు పడిపోయింది, కొత్త ప‌రిస్థితి, శీతల వాతావరణం కార‌ణంగా మళ్లీ కొవిడ్ కేసులు పెరిగాయి. 2020 ప్రారంభంలో క‌రోనా మహమ్మారి గరిష్ఠ స్థాయికి చేరింది. రోజువారీ కేసులు లక్షల్లో న‌మోద‌య్యాయి. 4.5 కోట్ల మందికి పైగా ప్రజలు వ్యాధి బారిన ప‌డ్డారు. అప్పటి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు దేశవ్యాప్తంగా సుమారు నాలుగేండ్ల‌లో 5.3 లక్షల మంది మరణించారు.


కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ప్రకారం.. వ్యాధి నుంచి కోలుకున్న వారి సంఖ్య జాతీయ రికవరీ రేటు 98.81 శాతంతో 4.4 కోట్లకు పైగా ఉన్న‌ది. మరణాల రేటు 1.18 శాతంగా ఉన్న‌ది. దేశంలో ఇప్పటివరకు 220.67 కోట్ల కొవిడ్ వ్యాక్సిన్లు ఇచ్చారు.