అయోడిన్‌ లోపం.. WHO ఏం చెప్తుందంటే..?

విధాత‌: ప్రపంచంలో 2 మిలియన్ల మంది అయోడిన్ లోపంతో బాధ పడుతున్నట్టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కలు తేల్చింది. పౌష్టిక ఆహారం లభించని దేశాల్లో ఈ లోపం ఎక్కువగా కనిపించవచ్చు. అయోడిన్ భోజనంలో దొరకని పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా అయోడిన్ లోపం ఉండొచ్చు. గర్భిణులకు అయోడిన్ ఎక్కువగా అవసరం ఉంటుంది. వీరిలో అయోడిన్ దొరకక పోతే పిండం ఎదుగుదలలో లోపం ఏర్పడే ప్రమాదం ఉంటుందని అపోలో డయాగ్నస్టిక్స్ కార్పొరేట్ పాథాలజిస్ట్ డాక్టర్ అశోక వర్షిణి […]

అయోడిన్‌ లోపం.. WHO ఏం చెప్తుందంటే..?

విధాత‌: ప్రపంచంలో 2 మిలియన్ల మంది అయోడిన్ లోపంతో బాధ పడుతున్నట్టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కలు తేల్చింది. పౌష్టిక ఆహారం లభించని దేశాల్లో ఈ లోపం ఎక్కువగా కనిపించవచ్చు. అయోడిన్ భోజనంలో దొరకని పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా అయోడిన్ లోపం ఉండొచ్చు.

గర్భిణులకు అయోడిన్ ఎక్కువగా అవసరం ఉంటుంది. వీరిలో అయోడిన్ దొరకక పోతే పిండం ఎదుగుదలలో లోపం ఏర్పడే ప్రమాదం ఉంటుందని అపోలో డయాగ్నస్టిక్స్ కార్పొరేట్ పాథాలజిస్ట్ డాక్టర్ అశోక వర్షిణి పంగా అంటున్నారు.

అయోడిన్ లోపం గుర్తించడం ఎలా?

  • గొంతు దగ్గర ఉండే థైరాయిడ్ గ్లాండ్ లో వాపు వస్తుంది. ఈ వాపుతో థైరాయిడ్ గ్లాండ్ కణితి లాగా కనిపిస్తుంది.
  • థైయిరాయిడ్ గ్లాండ్ పనితీరు తగ్గిపోవడం వల్ల శరీరంలో హార్మోన్ స్థాయిలు తక్కువగా ఉంటాయి. దీనిని హైపోథైరాయిడిజం అంటారు.

1- ఎక్కువ చలిగా అనిపిస్తుంది.
2- మలబద్దకం
3- చర్మం పొడిబారుతుంది.
4- కండరాలు బలహీన పడతాయి.
5- కొలెస్ట్రాల్ పెరుగుతుంది.
6- కండరాలు, కీళ్లు బిగుసుకుపోవడం వల్ల నొప్పి గా ఉంటుంది.
7- మూడ్ స్వింగ్స్ ఉంటాయి.
8- నెలసరి సమయంలో బ్లీడింగ్ ఎక్కువగా ఉండడం
9- మతి మరుపు
ఈ లక్షణాల్లో అన్నీఉండవచ్చు. లేదా కొన్ని ఉండవచ్చు. హైపోథైరాయిడిజానికి సరైన చికిత్స తీసుకోకపోతే దాని వల్ల చాలా సమస్యలు రావచ్చు.

గుండె పనితీరులో మార్పుల రావచ్చు. పర్యవసనంగా వచ్చే హార్ట్ ఫెయిల్యూర్, గుండె పరిమాణం పెరగడం వంటి ఇతర ప్రమాదకర సమస్యలు రావచ్చు.పెరీఫెరల్ న్యూరోపతి, డిప్రెషన్, మెదడు చురుకుదనం తగ్గడం వంటి నాడీ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు కూడా రావచ్చు.

గర్భిణుల్లో హైపోథైరాయిడిజం వల్ల పుట్టబోయే పిల్లల్లో పుట్టుకతో లోపాలు ఏర్పడవచ్చు. అంతేకాదు నెలలు నిండక ముందే ప్రసవం, గర్భస్థ శిశువు మరణం, అబార్షన్ ప్రమాదం కూడా ఉంటుంది. పుట్టబోయే పిల్లల్లో మెదడు పెరుగుదలలో లోపాలు, క్రెటినిజం వంటి తీవ్రమైన సమస్యలు కూడా గర్భవతుల్లో అయోడిన్ లోపం కారణాంగా రావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఎలా గుర్తించాలి?

అయోడిన్ లోపం ఏర్పడినట్టు అనుమానం ఉన్నపుడు నాలుగు రకాల పరీక్షలు చేయిస్తారు.

యూరిన్ టెస్ట్: తక్కువ సమయంలో చెయ్యగలిగే పరీక్ష ద్వారా కొన్ని నిమిషాల్లోనే ఫలితం వచ్చేస్తుంది. అయితే ఈ ఒక్క పరీక్ష సరిపోదు. మరింత వివరాణాత్మక పరీక్షలు అవసరం అవుతాయి.

బ్లడ్ టెస్ట్: అయోడిన్ లోపాన్నిరక్తపరీక్ష ద్వారా కూడా గుర్తించవచ్చు. ఇది కచ్చితమైన పరీక్ష కానీ ఫలితం రావడానికి చాలా సమయం పడుతుంది.

అయోడిన్ పాచ్ టెస్ట్: చర్మం మీద ఒక అయోడిన్ ప్యాచ్ ను అతికించడం ద్వారా 24 గంటల పాటు ఆబ్జర్వేషన్ లో ఉంచుతారు. అయోడిన్ లోపం ఉంటే ఈ ప్యాచ్ మాయం అవుతుంది. శరీరంలో అయోడిన్ లోపం ఉన్నపుడు అయోడిన్ ను చర్మం త్వరగా పీల్చుకుంటుంది.

చికిత్స

ఆహారం ద్వారా తగినంత అయోడిన్ అందనపుడు అయోడిన్ లోపాన్ని సరిచెయ్యడానికి అయోడిన్ సప్లిమెంట్స్ వాడాల్సి ఉంటుంది. వీగన్స్, వెజిటేరియన్స్, గర్భిణుల్లో ఆహారం ద్వారా సరిపడినంత అయోడిన్ అందదు. అందువల్ల వీరికి పోటాషియం అయోడేట్ రూపంలో అయోడిన్ సప్లిమెంట్ల రూపంలో ఇస్తారు. చాలా వరకు అయోడిన్ లోపం ఆహారంలో మార్పులు, సప్లిమెంట్లతో సరిచెయ్యడం సాధ్యపడుతుందని నిపుణుల చెబుతున్నారు.