Cardiac Arrest | మీరు ఆటో గేర్ కారు నడుపుతున్నారా..? అయితే తస్మాత్ జాగ్రత్త..!
Cardiac Arrest | మీరు సుదీర్ఘ ప్రయాణం చేస్తున్నారా..? అది కూడా ఆటో గేర్ కారు( Auto Gear Car ) డ్రైవింగ్ చేస్తున్నారా..? అయితే తస్మాత్ జాగ్రత్తగా ఉండాల్సిందే. ఆటో గేర్ వాహనాలతో పాటు ఇతర వాహనాల్లో గంటల తరబడి కూర్చొని ప్రయాణం చేస్తున్న వారు గుండెపోటు( Cardiac Arrest )కు గురవుతున్నారు. కాళ్లను కదపకుండా ప్రయాణిస్తుండటంతో.. గుండెకు రక్తం సరఫరా అగిపోయి సడెన్ కార్డియాక్ అరెస్టు( Sudden Cardiac Arrest )కు గురవుతున్నారు. అంటే […]

Cardiac Arrest | మీరు సుదీర్ఘ ప్రయాణం చేస్తున్నారా..? అది కూడా ఆటో గేర్ కారు( Auto Gear Car ) డ్రైవింగ్ చేస్తున్నారా..? అయితే తస్మాత్ జాగ్రత్తగా ఉండాల్సిందే. ఆటో గేర్ వాహనాలతో పాటు ఇతర వాహనాల్లో గంటల తరబడి కూర్చొని ప్రయాణం చేస్తున్న వారు గుండెపోటు( Cardiac Arrest )కు గురవుతున్నారు. కాళ్లను కదపకుండా ప్రయాణిస్తుండటంతో.. గుండెకు రక్తం సరఫరా అగిపోయి సడెన్ కార్డియాక్ అరెస్టు( Sudden Cardiac Arrest )కు గురవుతున్నారు. అంటే గుండెపోటు రావడానికి గుండె సంబంధిత సమస్యలు మాత్రమే ఉండాల్సిన అవసరం లేదని డాక్టర్లు చెబుతున్నారు. ఆటో గేర్‌కు ఉపయోగించే ఎడమ కాలు నిశ్చలంగా ఉండిపోవడంతో.. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే వాల్వ్స్ గడ్డ కట్టడంతో గుండెపోటుకు గురవుతున్నారు. ఇలా ఆటో గేర్‌తో పాటు ఇతర వాహనాల్లో దూర ప్రయాణాలు చేసే వారు కొన్ని చిట్కాలు పాటిస్తే గుండెపోటుకు దూరంగా ఉండొచ్చు.
సౌరభ్ శర్మ(30) అనే యువకుడు పశ్చిమ ఢిల్లీలో నివసిస్తున్నాడు. తన స్నేహితుడితో కలిసి ఆటో గేర్ కారులో రిషికేష్ వెళ్లాలని ప్లాన్ చేసుకున్నాడు. ఈ క్రమంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొకుండా 233 కిలోమీటర్లు డ్రైవింగ్ చేశాడు సౌరభ్. రిషికేష్ నుంచి తిరిగి వస్తుండగా మార్గమధ్యలో సౌరభ్ తన కారును ఆపేశాడు. అనంతరం అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో అప్రమత్తమైన తన స్నేహితుడు సౌరభ్‌ను సమీప ఆస్పత్రికి తరలించాడు. అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లినప్పుడు హార్ట్ బీట్ చాలా వరకు తగ్గింది. డాక్టర్లు 45 నిమిషాల పాటు సీపీఆర్ చేసి, విలువైన మెడిసిన్స్ ఇవ్వడంతో సౌరభ్ ప్రాణాలతో బతికాడు.
సౌరభ్‌కు స్పృహ రావడంతో స్నేహితుడు ఎంతో సంతోషపడ్డాడు. అతనికి ఎలాంటి గుండె సంబంధిత సమస్యలు లేవని డాక్టర్లకు ఫ్రెండ్ చెప్పాడు. అయితే సౌరభ్ డీవీటీ ( Deep Vein Thrombosis ) అనే సమస్యతో బాధపడుతున్నట్లు నిర్ధారించారు.
మరి ఈ సమస్య రావడానికి కారణమేంటి..?
ఆటో గేర్ కారులో ఎక్కువ దూరం ప్రయాణిస్తున్నప్పుడు ఎడమ కాలు ఒకే స్థానంలో ఉండిపోతోంది. ఆ సమయంలో రక్త గడ్డ కట్టేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. రక్త గడ్డ కట్టిపోవడంతో కాలులో ఉన్న వాల్వ్స్ రక్తాన్ని గుండెకు సరఫరా చేయకుండా ఆగిపోతాయి. దీంతో ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యే అవకాశం ఉంటుంది. దీన్నే పల్మనరీ ఎంబోలిజం అని అంటారు. సౌరభ్ విషయంలో ఇదే జరిగింది.
కనీసం 2 గంటలకు ఒకసారి కారును ఆపాలి..
సౌరభ్ కేసును పరిశీలించిన అనంతరం డాక్టర్లు ఆటో గేర్ కార్లు నడిపే డ్రైవర్లకు పలు సూచనలు చేశారు. ఆటో గేర్ కార్లు నడిపై డ్రైవర్లు.. కనీసం గంటకోసారి లేదా రెండు గంటలకు ఒకసారి తమ కారును ఆపాలి. కారు నుంచి బయటకు దిగి కాసేపు నడవాలి. అప్పుడు రక్తం గడ్డ కట్టకుండా ప్రసరణ జరిగే అవకాశం ఉంటుంది. డ్రైవర్‌తో పాటు ఇతర ప్రయాణికులు కూడా కారును ఆపి.. కాసేపు నడిచేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి.
ఇండ్లలో, ఆఫీసులో ఉండేవారికి కూడా..
ఒక్క ఆటో గేర్ కారు నడిపే వారు మాత్రమే కాదు.. ఎవరైతే ఇంట్లో కానీ ఆఫీసులో కానీ గంటల తరబడి కూర్చొని ఉంటారు.. అలాంటి వారు కూడా.. ప్రతి 15 నిమిషాలకో సారి తమ చైర్‌లో నుంచి లేచి కాసేపు నడిస్తే గుండె పోటుకు దూరంగా ఉండొచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఊబకాయంతో బాధపడేవారు తప్పనిసరిగా ఈ చిట్కాలు పాటించాల్సిందే. చాలా మంది నడకను మానేసి, కుర్చీలకు పరిమితమవున్న వారిలో డీవీటీ కేసులు ఎక్కువయ్యాయని వైద్యులు పేర్కొంటున్నారు.
పిల్లల నుంచి వృద్ధుల దాకా గుండెపోటుకు గురవుతున్నారు. కొందరు వాహనాలు నడుపుతూనే గుండెపోటుకు గురవుతున్నారు. మరికొందరు వ్యాయామం చేస్తూ సడెన్ కార్డియాక్ అరెస్టుకు గురవుతున్నారు. ఇంకొందరు ఇతర పనులు చేస్తుండగానే కుప్పకూలిపోతున్నారు. అలా చావు ఎవర్నీ ఎప్పుడు పలుకరిస్తుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొని ఉంది. మన దేశంలో ఏడాదికి 15 లక్షల మంది సడెన్ కార్డియాక్ అరెస్టుతో చనిపోతున్నారు అని నివేదికలు చెబుతున్నాయి. ప్రతి రోజు 4 వేల మంది చనిపోతున్నట్లు తెలుస్తోంది. అయితే సడెన్ కార్డియాక్ అరెస్టు ద్వారా చనిపోతున్న వారి సంఖ్యను సీపీఆర్ ప్రక్రియ ద్వారా తగ్గించుకోవచ్చు.