ఉపాధి, ఆదాయం మార్గం విప్పసారా : ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
విప్ప పువ్వు ఉత్పత్తులతో ఆదివాసీలకు ఉపాధి, రాష్ట్రానికి లక్షల కోట్ల ఆదాయం సాధ్యమని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.
విధాత, హైదరాబాద్ : తెలంగాణ ఆదివాసీలు, గిరిజనుల ఉపాధితో పాటు రాష్ట్రానికి విప్ప పువ్వు ఉత్పత్తుల ఎగుమతుల ద్వారా రూ.2లక్షల నుంచి 3లక్షల కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని..విప్ప సారా ఉత్పత్తి, విక్రయాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కోరారు. విప్ప చెట్టుకు 5వేలు సంవత్సరాల చరిత్ర ఉందని, ఆదివాసీలకు పూజనీయమైందని, యూఎస్ నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ విప్ప సారా, ఉత్పత్తులపై పరిశోధనలు చేసి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిర్ధారించారని గుర్తు చేశారు. యాంటి డయాబెటిస్, యాంటి అక్సిడెంట్, యాంటి క్యాన్సర్, యాంటి అల్సర్ గా విప్ప సారా పనిచేస్తుందన్నారు. నేను కల్తీసారాకు, సారాకు వ్యతిరేకం అని, అయితే విప్ప పువ్వుతో తయారు చేసే సారాను తీసుకరావాలని కోరుతున్నానన్నారు. ప్రపంచ దేశాలు సొంత బ్రాండ్లతో లిక్కర్ ఎగుమతి చేస్తున్నాయని, అలాగే తెలంగాణ రాష్ట్రం విప్ప పువ్వుతో సొంత డ్రింక్, ఇతర ఉత్పత్తులు తయారు చేసి ఎగుమతి చేయడం ద్వారా రాష్ట్ర ఆదాయానికి పెంచడంతో పాటు ఆదివాసీలకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ఆలోచన చేయాలని కోరారు.
కుట్రతో నిషేధం పెట్టిన బ్రిటిష్ పాలకులు
1892లో బ్రిటీష్ వాళ్లు వారి లిక్కర్ అమ్మకాలను పెంచుకునే కుట్రతో ఆదివాసీల స్వీయ ఉత్పత్తియైన విప్ప సారాను మౌరా చట్టం తెచ్చి నిషేదించారని అనిరుధ్ రెడ్డి పేర్కొన్నారు. విప్పపువ్వుతో పోల్చితే మెక్సికో దేశం అర్గానిక్ టెకిలా డ్రింక్ తయారీతో రూ. 2లక్షల 34వేల కోట్ల టర్నోవర్ చేస్తున్నారని, చైనాలో జొన్నలు, గోదుములతో మౌతాయి డ్రింక్ ద్వారా రూ. 2లక్షల 26వేల కోట్లు, జపాన్ లో రైస్ గ్రేతో తయారు చేసే సాకీ అనే డ్రింక్ ద్వారా రూ. 2,600కోట్ల ఎగుమతులు సాగిస్తుందని, స్కాట్లాండ్ సొంత స్కాచ్ తో రూ. 56వేల కోట్ల టర్నోవర్ చేస్తున్నాయని గుర్తు చేశారు. మనదగ్గరున్న విప్ప పువ్వును మాత్రంబ్యాన్ చేశారన్నారు. విప్ప పువ్వు తాగి 100ఏళ్లు బతికితే లిక్కర్ తాగి 60ఏళ్లకే చనిపోతున్నామని ఆదివాసీ, గిరిజనులు చెప్పిన మాటలనే నేను ఇటీవల చెప్పడం జరిగిందన్నారు. విప్ప పువ్వును టీలో కలిపి తీసుకోవడం వల్ల డయాబెటిస్ నియంత్రణలో ఉంటుందని ఆయన వెల్లడించారు.
విప్ప పువ్వుతో కేక్, ఐస్ క్రీమ్, వైన్, లడ్డూ, టీ, విప్ప టానిక్, చాక్లెట్ తయారు చేసి ఎగుమతి చేయవచ్చని అనిరుధ్ రెడ్డి గుర్తు చేశారు. తద్వారా ఆదీవాసీ, గిరిజనుల ఆదాయం పెంచవచ్చన్నారు. ప్రధాని మోదీ కూడా విప్ప లడ్డునూ ప్రమోట్ చేయాలని సూచించారని గుర్తు చేశారు. విప్ప టానిక్ చేయవచ్చన్నారు. . విప్ప చాక్లెట్, విప్ప కోలా వంటి డ్రింక్ తయారు చేసి ఎగుమతి చేయవచ్చన్నారు.
ఒక చెట్టుకు 200కిలోల విప్ప పువ్వు వస్తుందని, రైతులు ప్రత్యామ్నయ పంటగా ఒక ఎకరానికి 60 విప్ప చెట్లు పెంచితే ఏడాదికి రూ.3లక్షలు సంపాదించవచ్చని, దిగుబడికి 8 ఏళ్లు పట్టినప్పటికి చెట్టు 100ఏళ్లు ఆదాయం ఇస్తుందన్నారు. దేశంలో ఐదు రాష్ట్రాలలో గోవా, ఒడిశా, చత్తీస్ ఘడ్ , మధ్యప్రదేశ్, మహారాష్ట్రాలు విప్ప పువ్వు సారా, ఉత్పత్తి, అమ్మకాలు, ఎగుమతులను అధికారికంగా నిర్వహిస్తున్నాయన్నారు. చత్తీస్ గఢ్ లో సైతం విప్ప పువ్వు ఉత్పత్తులతో 1లక్ష 60వేలు మంది, మధ్యప్రదేశ్ లో 3లక్షల 77వేల మంది సేకరణ, ఉత్పత్తులతో ఉపాధి పొందుతున్నారని, ఆ రాష్ట్రాలు ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయని తెలిపారు. భారత్ నుంచి యునైటెడ్ కింగ్ డమ్ లండన్ కంపెనీ, ఫ్రాన్స్ కంపెనీలు విప్ప పువ్వును దిగుమతి చేసుకుని ఉత్పత్తులతో భారీ ఆదాయాన్ని గడిస్తున్నాయని వెల్లడించారు. మన రాష్ట్రంలో కూడా విప్ప సారా, ఇతర ఉత్పత్తులు చేస్తే విదేశీ బ్రాండ్లను అధిగమించవచ్చన్నారు.
ఇవి కూడా చదవండి :
LPG Refill Booking Rules : ఎల్పీజీ బుకింగ్ లో నో చేంజేస్ : కేంద్రం కీలక ప్రకటన
పెట్రోల్, డీజిల్, ఎల్పీజీలకు కొరత లేదు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram