పేదలపై ఆగ్రహం, పెద్దలపై అనుగ్రహమా? ఒవైసీ ఆక్రమణలపై హైడ్రాకు తలంటిన హైకోర్టు

సల్కం చెరువు ఆక్రమణలపై హైడ్రా చర్యలలో వివక్ష ఉందా అని తెలంగాణ హైకోర్టు తీవ్రంగా ప్రశ్నించింది. ఒవైసీ విద్యాసంస్థ అక్రమ నిర్మాణాలపై చర్యలు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారులపై విచారణకు ఆదేశించింది.

పేదలపై ఆగ్రహం, పెద్దలపై అనుగ్రహమా? ఒవైసీ ఆక్రమణలపై హైడ్రాకు తలంటిన హైకోర్టు సల్కం చెరువు మధ్యలో నిర్మించిన ఫాతిమా ఓవైసీ విద్యాసంస్థల భవనాలు

“Anger on Poor, Leniency for Powerful?” Telangana HC Pulls Up Hydra Over Selective Demolitions

  • 🔴 సల్కం చెరువు 70% వరకు కబ్జా అయినట్లు హైడ్రా గుర్తింపు
  • 🔴 ఒవైసీ విద్యాసంస్థల నిర్మాణాలపై హైకోర్టు ప్రశ్నలు
  • 🔴 పేదలపై కూల్చివేతలు, పెద్దలపై మౌనం అంటూ విమర్శ
  • 🔴 రిటైర్డ్ అధికారులపై కూడా విచారణకు ఆదేశం
  • 🔴 విద్యార్థులకు ప్రభుత్వ విద్యాసంస్థల్లో సర్దుబాటు సూచన

 పేదలు, మధ్యతరగతి ప్రజల ఇళ్లపై కూల్చివేతల్లో కఠినంగా వ్యవహరించే హైడ్రా అధికారులు, పలుకుబడి కలిగిన పెద్దల అక్రమ నిర్మాణాల విషయంలో ఎందుకు మౌనం పాటిస్తుండటాన్ని తెలంగాణ హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. పాతబస్తీ లోని సల్కం చెరువు దాదాపుగా ఒవైసీ సోదరుల కబ్జా కోరల్లో చిక్కుకున్నట్లు బయటపడుతోంది. సల్కం చెరువు పరిధిలో జరుగుతున్న నిర్మాణాలు అధికారులకు కనిపించలేదా అంటూ నిలదీసింది. . మొత్తం చెరువులో సుమారు 70 శాతం వరకు ఆక్రమణలు జరిగాయని హైడ్రా గుర్తించినట్టు తెలుస్తోంది.

పదవీ విరమణ చేసినా బాధ్యత తప్పదన్న కోర్టు

Hydraa Commissioner AV Ranganath on Salkam Cheruvu encroachment issue

ఒవైసీ సోదరుల సల్కం చెరువు ఆక్రమణలపై హైడ్రాను ఆక్షేపించిన హైకోర్టు

జస్టిస్ ఎన్‌.వి. శ్రవణ్‌కుమార్ విచారణ సందర్భంగా “పేదలపై ఆగ్రహం, పెద్దలపై అనుగ్రహమా?” అని ఘాటుగా వ్యాఖ్యానించారు. చెరువు పూర్తి స్థాయి నీటి మట్టం(ఫుల్ ట్యాంక్ లెవల్ – FTL), బఫర్ జోన్‌లో నిర్మాణాలు కొనసాగుతున్నప్పటికీ, 2005 నుంచే అధికారులు చర్యలు తీసుకోకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.

బ్యారిస్టర్ ఫాతిమా ఓవైసీ ఎడ్యుకేషనల్ క్యాంపస్‌, సలార్-ఎ-మిల్లత్ ట్రస్ట్ నిర్మాణాలకు అనుమతులున్నాయా లేదా అన్నదానిపై ఇప్పటికీ స్పష్టత లేకపోవడాన్ని కోర్టు గమనించింది. ఈ అక్రమ నిర్మాణాలకు బాధ్యులైన అధికారులందరినీ గుర్తించి, వారు పదవీ విరమణ చేసినా విచారణ జరపాలని ఆదేశించింది.

మ్యాప్‌లలో బయటపడిన చెరువు ఆక్రమణలు

Salkam Cheruvu lake encroachment satellite map showing Fatima Owaisi college area

సల్కం చెరువు ఆక్రమణలపై శాటిలైట్ మ్యాప్ విశ్లేషణ

2012 శాటిలైట్ మ్యాప్‌లో గడ్డి మైదానం కనిపిస్తుండగా, 2014 మ్యాప్‌లో నిర్మాణాలు ప్రారంభమైనట్లు కోర్టు పేర్కొంది. 2014 నుంచి 2026 వరకు చెరువు ప్రాంతం దాదాపుగా పూర్తిగా ఆక్రమించబడిందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

గతంలో జారీ చేసిన ఆదేశాల తర్వాతే అధికారుల్లో కదలిక వచ్చిందని కోర్టు వ్యాఖ్యానించింది. ఇప్పటికైనా బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.

విద్యార్థుల భవిష్యత్తుపై కోర్టు దృష్టి

Asaduddin Owaisi and Akbaruddin Owaisi Hyderabad political leaders

ఒవైసీ సోదరులు – సల్కం చెరువు వివాదంలో చర్చ

ఒవైసీ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, వెళ్లిపోవాలనుకునే వారికి సహకరించాలని యాజమాన్యానికి సూచించింది. అలాంటి విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో సర్దుబాటు చేసి వారి విద్యకు అంతరాయం లేకుండా చూడాలని విద్యాశాఖకు ఆదేశించింది.

అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం ప్రదర్శించిన అధికారులను గుర్తించి జులై 3లోగా నివేదిక సమర్పించాలని కోర్టు ఆదేశించింది. విచారణను వాయిదా వేసింది.