Mount Everest Storm | ఎవరెస్ట్ పై మంచు తుఫాన్ బీభత్సం..ప్రమాదంలో 1000మంది
ఎవరెస్ట్ పర్వతంపై వచ్చిన భారీ మంచు తుఫాన్‌లో దాదాపు 1000 మంది పర్వతారోహకులు చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

న్యూఢిల్లీ : ప్రపంచంలో అతిపెద్ద ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ పైన మంచు తుఫాన్ బీభత్సం సృష్టించింది. దీంతో దాదాపు 1000మంది పర్వాతారోహకులు మంచు తుఫాన్ లో చిక్కుకుని ఎవరెస్ట్ పై చిక్కుకుపోయారు. పర్వాతారోహకులను రక్షించేందుకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. టిబెట్‌లో ఎవరెస్ట్ పర్వతం తూర్పు వైపు ఆదివారం మంచు తుఫాన్ రాకతో క్యాంప్ సైట్ల వద్ద ఉన్న పర్వాతారోహకులు దాదాపుగా 1000మంది మంచులో చిక్కుకుపోయారు. వారిలో 400మంది వరకు భద్రతా సిబ్బంది కాపాడారు. అయితే ఎవరెస్ట్ పైకి వెళ్లే మార్గాల్లో భారీగా మంచు చరియలు పడి దారులు మూసుకుపోవడంలో సహాయక చర్యలకు ఆటకం ఏర్పడింది.
మంచు చరియలను తొలగించేందుకు స్థానికులు, సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. హెలికాప్టర్ల ద్వారా కూడా రక్షణ చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. తీవ్ర చలితో ఇప్పటికే కొంతమంది పర్వాతారోహకులు హైపోథెర్మియా బారినపడినట్లు రెస్క్యూ బృందం వెల్లడించింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా శనివారం నుంచి ఎవరెస్ట్ పైకి వెళ్లేందుకు అనుమతులు నిలిపివేశారు.