షూలో దాక్కున్న మృత్యువు! వీడియో చూసిన నెటిజన్ల వెన్నులో వణుకు

ఆన్‌లైన్‌లో సంచలనంగా మారిన వీడియో
వీడియో చూసిన నెటిజన్ల వెన్నులో వణుకు
విధాత: ప్రపంచవ్యాప్తంగా నిమిషం వ్యవధిలో లక్షల సంఖ్యలో ఫొటోలు, వీడియోలు ఆన్‌లైన్‌లో పోస్టు అవుతున్నాయి. కొన్ని నవ్విస్తే, మరికొన్ని కవ్విస్తాయి. ఇంకొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. మరికొన్ని భయపెడతాయి. ఇటీవల ఇన్‌స్టాలో ఒకరు పోస్టు చేసిన వీడియో సంచలనంగా మారింది. దానిని చూసిన నెటిజన్లలో వణుకు పుట్టిస్తున్నది.
ఒక విషపూరిత పాము ఒకరి షూలోకి జరజర పాకుతూ వెళ్లింది. సాధారణంగా చూసినా కనిపించకుండా దాక్కున్నది. ఒకవేళ షూ దులపకుండా, చూడకుండా వేసుకుంటే పాము కాటేయడం ఖాయం. ప్రాణాలు హరీమనడం తథ్యం. కొన్ని సెకండ్లపాటు ఉన్న ఈ వీడియో ఆన్‌లైన్ సంచలనంగా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టుచేసిన కొన్ని గంటల వ్యవధిలోనే 5 వేల లైకులు వచ్చాయి. వేల మంది వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోను ఎక్కడ తీశారనే మాత్రం తెలియలేదు.