Diana Armstrong | అత్యంత పొడవైన గోళ్ల కలిగిన మహిళగా డయానా గిన్నిస్‌ రికార్డు.. ఆమె గోళ్ల పొడవెంతో తెలుసా..?

Diana Armstrong | అగ్రరాజ్యం అమెరికాకు చెందిన డయానా ఆర్మ్‌స్ట్రాంగ్ (Diana Armstrong) అనే మహిళ గోర్లు పొడవుగా పెంచి గిన్నిస్‌ రికార్డు (Guinness World Record) సృష్టించారు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన గోళ్లు కలిగిన మహిళగా ఆమె గిన్నిస్‌ రికార్డును సొంతం చేసుకున్నారు. ఆమె రికార్డు కోసం ఏళ్ల తరబడి పడ్డ శ్రమకు ఫలితం దక్కించుకున్నారు.

Diana Armstrong | అత్యంత పొడవైన గోళ్ల కలిగిన మహిళగా డయానా గిన్నిస్‌ రికార్డు.. ఆమె గోళ్ల పొడవెంతో తెలుసా..?

Diana Armstrong : అగ్రరాజ్యం అమెరికాకు చెందిన డయానా ఆర్మ్‌స్ట్రాంగ్ (Diana Armstrong) అనే మహిళ గోర్లు పొడవుగా పెంచి గిన్నిస్‌ రికార్డు (Guinness World Record) సృష్టించారు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన గోళ్లు కలిగిన మహిళగా ఆమె గిన్నిస్‌ రికార్డును సొంతం చేసుకున్నారు. ఆమె రికార్డు కోసం ఏళ్ల తరబడి పడ్డ శ్రమకు ఫలితం దక్కించుకున్నారు.

డయానా తన చేతి వేళ్లకు 1,306.58 సెంటీమీటర్లు అంటే 42 అడుగుల 10.4 అంగుళాల పొడవైన గోళ్లు కలిగి ఉన్నట్లు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు ప్రతినిధులు వెల్లడించారు. ఆమె 25 ఏళ్లుగా తన గోళ్లను పెంచుతోందని, అవి మినీ స్కూల్‌ బస్సు కంటే పొడవుగా ఉన్నాయని వారు తెలిపారు. 1997లో తన పెద్ద కుమార్తె లతీషా ఆస్తమాతో మరణించడంతో డిప్రెషన్లోకి వెళ్లానని డయానా తెలిపారు.

లతీషాకు పొడవైన గోళ్లంటే ఇష్టమని అందుకే అప్పటినుంచి తన కూతురి గుర్తుగా గోళ్లు పెంచుతున్నానని ఆమె చెప్పారు. అవి అందంగా కనిపించేందుకు వివిధ రంగులతో తరచూ పెయింట్‌ చేసుకుంటానని తెలిపారు. తాజాగా ప్రపంచ రికార్డు సాధించడంతో ఆమె ఆనందం వ్యక్తంచేశారు. దీనికి సంబంధించిన ఫొటోను గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ తన అధికారిక ఎక్స్‌ (ట్విటర్‌) ఖాతాలో పోస్టు చేసింది.