బ్రిటన్ ప్రధానికి దీపావళీ కానుకగా కోహ్లీ బ్యాట్

బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌, అక్షత దంపతులకు దీపావళీ కానుకగా భారత విదేశాంగ శాఖ మంత్రి జయంశంకర్‌, ఆయన సతీమణి క్యోకోతో కలిసి భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సంతకం చేసిన బ్యాట్‌ను, గణపతి విగ్రహాన్ని అందచేశారు

బ్రిటన్ ప్రధానికి దీపావళీ కానుకగా కోహ్లీ బ్యాట్
  • ప్రధాని మోడీ తరుపున అందించిన భారత విదేశాంగ మంత్రి


లండన్ : బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌, అక్షత దంపతులకు దీపావళీ కానుకగా భారత విదేశాంగ శాఖ మంత్రి జయంశంకర్‌, ఆయన సతీమణి క్యోకోతో కలిసి భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సంతకం చేసిన బ్యాట్‌ను, గణపతి విగ్రహాన్ని అందచేశారు. ప్రధాని నరేంద్రమోడీ తరుపున వారు ఈ కానుకలను రిషి సునాక్ దంపతులకు అందించారు.


భారత-బ్రిటన్‌ల మధ్య పలు కీలక చర్చలు, ఒప్పందాలకు సంబంధించి భారత ప్రభుత్వం తరుపునా విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ లండన్ పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా 10డౌనింగ్ స్ట్రీట్‌లోని బ్రిటన్ ప్రధాని నివాసం జయశంకర్ దంపతులను టీ పార్టీకి ఆహ్వానించింది. రిషి సునాక్‌, జయశంకర్‌లు ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులకు దీపావళీ శుభాకాంక్షలు తెలిపారు.


కాగా.. తనకు భారత ప్రధాని తరుపున అందిన గిఫ్టుల ఫోటోలను సునాక్ కార్యాలయంలో ట్వీట్టర్ ఎక్స్‌లో పోస్టు చేసింది. ఇటు బ్రిటన్ ప్రధాని ఆతిధ్యం పట్ల కృతజ్ఞతలు తెలుపుతూ జయశంకర్ కూడా ట్వీట్ చేశారు. భారతదేశం, బ్రిటన్‌ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి ఈ సమావేశం సహకరిస్తుందని, ప్రస్తుత ప్రపంచ ఆర్థిక రాజకీయ పరిణామాలలో ఇది స్వాగతించదగిన విషయమని జయశంకర్ తన ఎక్స్ ఖాతాలో  పోస్ట్ చేశారు