osho ashrams । ఓషో ఆశ్రమంలో విశృంఖల లైంగిక కార్యకలాపాలు.. 12 ఏళ్ల వయసుకే 50 లైంగికదాడులకు గురయ్యా..
‘పిల్లలు లైంగిక కార్యకలాపాల గురించి మాట్లాడటం, పెద్దవాళ్లు లైంగిక కార్యక్రమాల్లో ఉన్నప్పుడు చూడటం అనేది చాలా సాధారణంగా పరిగణించేవారు’ అని ది టైమ్స్‌కు సర్గం చెప్పారు. చాలా చిన్న వయసులోనే తాను లైంగికకార్యకలాపాలకు ఎక్స్‌పోజ్ అయ్యానని తెలిపారు

osho ashrams । పాతతరం వారికి రజనీశ్ (rajaneesh) .. ఇప్పటి రీల్స్ చూసే తరానికి ఓషో (osho) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వ్యక్తిగత స్వేచ్ఛ (personal liberty) గురించి ఓషోగా పేరు మార్చుకున్న సెక్స్ గురు రజనీశ్ చెప్పే మాటల రీల్స్.. సామాజిక మాధ్యమాల్లో (social media) విస్తృతంగా కనిపిస్తుంటాయి. లైంగిక స్వేచ్ఛ (freedom) గురించి ఓషో నొక్కి చెబుతుంటాడు. వివాహ వ్యవస్థను (marriage) వ్యతిరేకిస్తాడు. జీవితాన్ని ఎంజాయ్ చేయాలని ఉద్భోదిస్తుంటాడు. అయితే.. ఓషో ఆశ్రమాల్లో లైంగిక విశృంఖలత ఉంటుందని 54 ఏళ్ల బ్రిటిష్ మహిళ పేర్కొన్నారు. ఓషో ఆశ్రమాల్లో జరిగే ఘోరాలపై ఆమె ఇటీవల ది టైమ్స్‌కు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. చిన్న వయసులోనే ఆశ్రమంలో లైంగిక కార్యకలాపాలకు ఎలా ఎక్స్‌పోజ్ అయ్యేవారో ఆమె వివరించారు. ‘ఏడేళ్ల వయసులోనే అదేదో చేయకూడని పని అని నాకు అనిపించింది’ అని ప్రేమ్ సర్గం అనే మహిళ తెలిపారు. ఓషో ఆశ్రమంలో చిన్న వయసులో తాను ఎదుర్కొన్న భయానక వేధింపులను ఆమె ఆ ఇంటర్వ్యూలో వివరించారు.
ఆరేళ్ల వయసులో తన తల్లితో కలిసి సర్గం.. పుణెలోని ఓషో ఆశ్రమానికి వచ్చారు. ఆశ్రమంలో జీవితాల పట్ల ప్రేరణ పొంది అక్కడ చేరారు. తన పేరును బలవంతంగా మార్చుకోవాల్సి వచ్చిందని, ఆరెంజ్ కలర్ దుస్తులు వేసుకోవాల్సి వచ్చిందని ఆమె తెలిపారు. తల్లిదండ్రుల లైంగిక స్వేచ్ఛకు (parental freedom) పిల్లలు అడ్డంకి అనే తత్వాన్ని అలవర్చుకోవాల్సి వచ్చిందని చెప్పారు. ‘పిల్లలు లైంగిక కార్యకలాపాల గురించి మాట్లాడటం, పెద్దవాళ్లు లైంగిక కార్యక్రమాల్లో ఉన్నప్పుడు (adults engaging) చూడటం అనేది చాలా సాధారణంగా పరిగణించేవారు’ అని ది టైమ్స్‌కు సర్గం చెప్పారు. చాలా చిన్న వయసులోనే తాను లైంగికకార్యకలాపాలకు ఎక్స్‌పోజ్ అయ్యానని తెలిపారు. ‘నేను నా స్నేహితులం అదే ఆశ్రమంలోని పెద్దవాళ్లతో లైంగిక కార్యకలాపాల్లో బలవంతంగా పాల్గొనాల్సి వచ్చేది. అదేదో చేయకూడని తప్పుడు పని అని అప్పట్లోనే తమకు అనిపించేది’ అని సర్గం తెలిపారు. ఆరాధన సమయంలో తాను మూడు సన్యాసిని ఆశ్రమాల్లో ఉన్నానని, బోర్డింగ్ స్కూలు నెపంతో తనను సఫ్లోక్‌లోని ఒక ఆశ్రమానికి ఒంటరిగా పంపించారని తెలిపారు. తనకు 12 ఏళ్ల వయసు వచ్చేనాటికే తాను 50కిపైగా లైంగిక దాడులకు గురయ్యానని వివరించారు. ఆరాధన పేరుతో చేరేవారికి అక్కడ జరుగుతున్న విషయాలు చట్టవ్యతిరేకమని కొద్దికాలానికే అర్థమైపోయేయని చెప్పారు. తనకు పదహారేళ్ల వయసు వచ్చేసరికి అసలు అక్కడ ఏం జరుగుతున్నదో తనకు పూర్తిగా అర్థమైందని సర్గం తెలిపారు. లైంగికకార్యకలాపాలకు పిల్లలను ఎక్స్‌పోజ్ చేయాలని, యుక్త వయసు వచ్చే క్రమంలో ఉన్న బాలికలకు మగవాళ్లు గైడ్ చేయాలని ఓషో మూమెంట్ నమ్ముతుంది.
1979లో స్థాపించిన రజనీస్ ఆరాధన స్థాపితమైంది. ఆధ్యాత్మిక జ్ఞానోదయం కోసం పశ్చిమదేశాలవాళ్లు రజనీశ్ పట్ల ఆకర్షితులయ్యారు. పేరుకు ధ్యానం, ఆధ్యాత్మిక జ్ఞానం అని చెప్పినా.. అనేక ఘోరాలు జరిగేవని విమర్శలు ఉన్నాయి. ప్రత్యేకించి చిన్నపిల్లలు లైంగిక వేధింపులకు గురయ్యేవారు. పుణెలో స్పిరిచ్యువల్ మూవ్‌మెంట్‌ను ప్రారంభించడానికి ముందు ఓషో (రజనీశ్) తత్వశాస్త్ర లెక్చరర్‌గా పనిచేసేవాడు. హద్దులు లేని వ్యభిచారం, భార్యల మార్పిడి వంటివాటిని ప్రోత్సహించేవాడు. ఆయనే చెప్పే లైంగిక స్వేచ్ఛతో ఆయనకు సెక్స్ గురు అనే పేరు వచ్చింది. ఆయన వద్ద సుమారు 93 విలాసవంతమైన కార్లు ఉండేవట. అందుకనే అమెరికాలో ఆయనను రోల్స్ రాయిస్ గురు అని పిలిచేవారు. వందల మంది చిన్నారులు వేధింపులకు గురైనా.. ఇప్పటి వరకూ వెలుగులోకి వచ్చినవి కొన్నే. అమెరికా బాలల రక్షణ విభాగం ఓషో ఆశ్రమాలపై దర్యాప్తు చేసింది.
సర్గంతోపాటు ఆ కూపం నుంచి తప్పించుకున్న మరో ఇద్దరు బ్రిటిష్ మహిళల కథలతో త్వరలో ఒక డాక్యుమెంటరీ కూడా రాబోతున్నది. ‘నాతోపాటు అసంఖ్యాకులకు జరిగినది ప్రపంచానికి తెలియాలని నేను కోరుకుంటున్నాను’ అని సర్గం చెప్పారు. ‘మేం అమాయకులైన చిన్నారులం. ఆధ్యాత్మిక జ్ఞానోదయం పేరిట వేధింపులకు, దోపిడీకి గురయ్యాం’ అని సర్గం చెప్పారు. ఆరేగాన్‌లో ఒక ఆదర్శ ధామ నగరాన్ని నిర్మించే ప్రయత్నాలు జరిగినప్పుడు ఓషో మూవ్‌మెంట్ పతనం ప్రారంభమైంది. మాస్ ఫుడ్ పాయిజనింగ్, హత్యాయత్నాల వంటి నేరాలపై ఓషో వ్యక్తిగత సహాయకురాలు మా ఆనంద్ శీలను అరెస్టు చేయగా, ఆమెకు 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఇప్పటికీ కొద్ది సంఖ్యలో రజనీశ్ అనుచరులు ప్రపంచవ్యాప్తంగా అక్కడక్కడ ఉన్నారు.