చెవి రింగు కోసం వెతికితే.. 1000 ఏండ్ల క‌ళాఖండం ల‌భ్యం

చెవి రింగు కోసం వెతికితే.. 1000 ఏండ్ల క‌ళాఖండం ల‌భ్యం

విధాత‌: ఇంటి ఆవ‌ర‌ణ‌లో పోగొట్టుకున్న‌ చెవి రింగు కోసం వెతుకుతున్న ఆ కుటుంబానికి ఊహించ‌ని నిధి ల‌భించింది. బంగారం, కాస్యంతో కూడిన 1000 క్రితం నాటి క‌ళాఖండం దొరికింది. ఈ ఘ‌ట‌న నార్వే దేశంలో తాజా చోటుచేసుకున్న‌ది. అస‌లు ఏం జ‌రిగిందంటే… నార్వేలో ఓ కుటుంబంలోని ఒక‌రి విలువైన చెవిరింగు పోయింది.


రింగ్ వెతికేందుకు సుల‌భంగా ఉంటుంద‌ని మెటల్ డిటెక్ట‌ర్‌ను బ‌య‌ట‌కు తీశారు. రింగ్ ద‌గ్గ‌ర‌గా ఉంటే మెట‌ల్ డిటెక్ట‌ర్ నుంచి శ‌బ్దం వ‌స్తుంది. ఇంటి వెనుక మైదానంలో మెట‌ల్ డిటెక్ట‌ర్ ద్వారా వెత‌క‌డం మొదలు పెట్టారు. పెద్ద చెట్టు ద‌గ్గ‌ర శ‌బ్దం రావ‌డం గ‌మ‌నించారు. అక్క‌డ కొంత లోతు త‌వ్వగా పురాత‌న క‌ళాఖండం ల‌భించింది. దానిని శవాల‌పై పెట్టే వ‌స్తువుగా గుర్తించారు.


పురాతన అవశేషాల్లో రెండు కాంస్య ఆభరణాలు ఉన్నాయి. అవి ఒకప్పుడు బంగారంతో కప్పబడి ఉన్నాయని చరిత్రకారులు చెప్పారు. వెస్ట్‌ఫోల్డ్, టెలిమార్క్ కౌంటీ కౌన్సిల్‌కు చెందిన పురావస్తు శాస్త్రవేత్త విబెకే లియా మాట్లాడుతూ.. వాటిలో ఒకటి సాధారణంగా మహిళల సమాధులలో కనిపించే ఓవల్ బ్రూచ్ రకం, అది భుజం పట్టీలను బిగించడానికి ఉపయోగించబడుతుందని చెప్పారు.


కాగా.. ఆభరణాలు, సమాధి కులీన కాలం మహిళకు చెందినవని సూచిస్తున్న‌ట్టు తెలిపారు. ఆ ప్రాంతంలో దున్న‌డం వంటి చ‌ర్య‌లు చేప‌ట్ట‌నందున క‌ళాఖండాలు మంచి స్థితిలో ఉన్నాయ‌ని వెల్ల‌డించారు. నార్వే ఆగ్నేయ తీరంలోని జోమ్‌ఫ్రూలాండ్‌లో కేవలం 75 మందితో ఒక మారుమూల ద్వీపం నివసించారు. ఆ యుగంలో చ‌నిపోయిన మ‌హిళ స‌మాధిపై ఆ క‌ళాఖండాన్ని పెట్టి ఉంటార‌ని చ‌రిత్ర‌కారులు వెల్ల‌డించారు.