Killing of crows | భారత కాకులను నిర్ధాక్షిణ్యంగా చంపేస్తున్న కెన్యా.. ఎందుకంటే..!
Killing of crows | కెన్యా ప్రభుత్వం భారతదేశపు జాతులకు చెందిన కాకులపై యుద్దం ప్రకటించింది. భారత జాతులకు చెందిన 10 లక్షల కాకులను చంపాలని ప్లాన్ చేసింది. ఈ ప్లాన్ నేపథ్యంలో.. అసలు కెన్యా ప్రభుత్వం భారత కాకులపై ఎందుకంత కక్ష కట్టింది..? భారతీయ జాతుల కాకులతో కెన్యాకు వచ్చి్న ఇబ్బంది ఏమిటి..? మన కాకులు వాళ్లకు చేసిన నష్టమేంటి..? అనే సందేహాలు తలెత్తుతున్నాయి.

Killing of crows : కెన్యా ప్రభుత్వం భారతదేశపు జాతులకు చెందిన కాకులపై యుద్దం ప్రకటించింది. భారత జాతులకు చెందిన 10 లక్షల కాకులను చంపాలని ప్లాన్ చేసింది. ఈ ప్లాన్ నేపథ్యంలో.. అసలు కెన్యా ప్రభుత్వం భారత కాకులపై ఎందుకంత కక్ష కట్టింది..? భారతీయ జాతుల కాకులతో కెన్యాకు వచ్చి్న ఇబ్బంది ఏమిటి..? మన కాకులు వాళ్లకు చేసిన నష్టమేంటి..? అనే సందేహాలు తలెత్తుతున్నాయి.
భారతదేశం నుంచి పెద్ద ఎత్తున వలస వచ్చిన కాకులు తమ దేశ పర్యావరణాన్ని దెబ్బ తీస్తున్నాయంటూ కాకులపై కెన్యా కన్నెర్ర జేసింది. దేశంలో కాకి అరుపులే లేకుండా చేయాలని గత కొన్నేళ్లుగా ప్రయత్నిస్తూ విఫలమవుతున్న కెన్యా ప్రభుత్వం.. ఈ సారి పకడ్బందీగా ప్లాన్ చేసింది. సుమారు 10 లక్షల కాకులను అంతమొందించేందుకు పథకం ప్రకారం ముందుకెళ్తోంది.
భారత్ నుంచి వెళ్లిన కాకులు సంఖ్య బాగా పెరగడంతో కెన్యాలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆహారాన్ని దొంగలించడం, పంటలకు నష్టం కలిగించడం, స్థానిక పక్షులను వెంటాడి పొడిచి చంపడం లాంటివి భారత కాకులు చేస్తున్నాయి. దాంతో తమ దేశంలో అసలు కాకులే లేకుండా చేయాలని కెన్యా ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగానే కాకులను వేటాడుతోంది.
కెన్యాలోని సాధారణ ప్రజలే కాదు, పెద్దపెద్ద వ్యాపారవేత్తలు సైతం కాకులపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. తాము నెలకొల్పిన పరిశ్రమలను కాకులు దెబ్బ తీస్తున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. గుంపులు గుంపులుగా తమ వ్యాపార ప్రాంగణంలోకి వచ్చి తయారు చేసిన వస్తువులను సర్వనాశనం చేస్తున్నాయని ఆవేదన వెలిబుచ్చారు. మరోవైపు పర్యావరణ ప్రేమికులు కూడా కాకులు లేకుండా చేయాలని డిమాండ్ చేశారు.
భారతీయ కాకులతో పర్యావరణం పూర్తిగా దెబ్బతింటోందని పర్యావరణ ప్రేమికులు మండిపడుతున్నారు. భారత కాకుల కారణంగా కెన్యాలోని సముద్ర ప్రాంతాల్లో ఉండే చిన్న, స్థానిక పక్షుల సంఖ్య బాగా తగ్గిపోయిందంటున్నారు. భారత కాకులు.. స్థానిక పక్షుల గూళ్లు, వాటి గుడ్లు, పిల్లలను తింటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారత కాకులు లేకుంటేనే కెన్యాలో కీటకాలు, ఇతర చిన్న జీవులు సమృద్ధిగా పెరుగుతాయని భావిస్తున్నారు.