Iran President | కూలిన రైసీ హెలికాప్టర్‌ జాడను గుర్తించిన రెస్క్యూ టీమ్స్‌.. ఎవరూ బతికుండే ఛాన్స్‌ లేదని అనుమానం..!

Iran President | ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (Ebrahim Raisi) హెలికాప్టర్‌ జాడను రెస్క్యూ టీమ్స్‌ గుర్తించాయి. నిన్నటి నుంచి గాలిస్తున్న రెస్క్యూ బృందాలు ఎట్టకేలకు ఆ హెలికాప్టర్‌ కూలిన ప్రదేశాన్ని కనిపెట్టాయి. అయితే ఆ హెలికాప్టర్‌లో వెళ్లిన వాళ్లలో ఎవరైనా ప్రాణాలతో ఉన్నారా.. లేదా..? అనే ఆధారాలు మాత్రం ఇంకా లభ్యం కాలేదని తెలిపాయి. ఈ మేరకు ఇరాన్‌ ప్రభుత్వ టీవీ అయిన ప్రెస్‌ టీవీ ఒక ట్వీట్‌ చేసింది.

Iran President | కూలిన రైసీ హెలికాప్టర్‌ జాడను గుర్తించిన రెస్క్యూ టీమ్స్‌.. ఎవరూ బతికుండే ఛాన్స్‌ లేదని అనుమానం..!

Iran President : ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (Ebrahim Raisi) హెలికాప్టర్‌ జాడను రెస్క్యూ టీమ్స్‌ గుర్తించాయి. నిన్నటి నుంచి గాలిస్తున్న రెస్క్యూ బృందాలు ఎట్టకేలకు ఆ హెలికాప్టర్‌ కూలిన ప్రదేశాన్ని కనిపెట్టాయి. అయితే ఆ హెలికాప్టర్‌లో వెళ్లిన వాళ్లలో ఎవరైనా ప్రాణాలతో ఉన్నారా.. లేదా..? అనే ఆధారాలు మాత్రం ఇంకా లభ్యం కాలేదని, ఎవరూ బతికుండే ఛాన్సెస్‌ లేవని తెలిపాయి. ఈ మేరకు ఇరాన్‌ ప్రభుత్వ టీవీ అయిన ప్రెస్‌ టీవీ ఒక ట్వీట్‌ చేసింది.

కాగా ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఆదివారం సాయంత్రం క్రాష్‌ ల్యాండింగ్‌ అయ్యింది. ప్రతికూల వాతావరణమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. హెలికాప్టర్‌ క్రాష్‌ ల్యాండయిన వార్త తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్స్‌ ముమ్మరంగా గాలింపు చేపట్టాయి. ఎట్టకేలకు సోమవారం ఉదయం హెలికాప్టర్‌ కూలిన ప్రదేశాన్ని గుర్తించాయి.

ఆదివారం ఇరాన్‌లోని తూర్పు అజర్‌బైజాన్ ప్రావిన్స్‌లో పర్యటించిన రైసీ.. అక్కడి నుంచి తెబ్రిజ్ నగరానికి బయలుదేరారు. ఈ క్రమంలో ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు వాయవ్యంగా 600 కిలోమీటర్ల దూరంలో అజర్‌బైజాన్ సరిహద్దులోని జోల్ఫా పట్టణానికి సమీపంలో ప్రమాదం జరిగిందని ఇరాన్ అధికారిక మీడియా సంస్థలు వెల్లడించాయి.

కూలిన హెలికాప్టర్‌లో ఇరాన్‌ అధ్యక్షుడితోపాటు తూర్పు అజర్‌బైజాన్ గవర్నర్ అయతుల్లా అల్ హషీమ్, ఇరాన్ విదేశాంగ మంత్రి హోస్సేన్ అమీర్ అబ్దొల్లాహియాన్ ఉన్నారని మీడియా తెలిసింది. ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రహీం రైసీ కాన్వాయ్‌లోని మూడు చాపర్లలో ఒకటి ప్రమాదంలో చిక్కుందని మీడియా పేర్కొంది. ఆ సమయంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోందని తెలిపింది.

రైసీ ఆదివారం తెల్లవారు జామున అజర్‌బైజాన్‌లో ఆ దేశ అధ్యక్షుడు ఇల్హామ్ అలియేవ్తో కలిసి రెండు డ్యామ్లను ప్రారంభించారు. ఆరాస్ నదిపై రెండు దేశాలు కలిసి మూడు డ్యామ్లను నిర్మించాయి. ఇబ్రహీం రైసీ క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు ఇరాన్ సుప్రీం కమాండర్ ఆయతుల్లా అలీ ఖమేనీ పేర్కొన్నారు. ఆయన కోసం అందరూ ప్రార్థించండి అని దేశ ప్రజలను కోరారు.

భారత ప్రధాని నరేంద్రమోదీ ఈ ఘటనపట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధ్యక్షుడు రైసీ క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు, ఈ విపత్కర పరిస్థితుల్లో తాము రైసీ కుటుంబసభ్యులకు, ఇరాన్ ప్రజలకు అండగా ఉంటామని, వారికి తమ సంఘీభావాన్ని తెలుపుతున్నామని తన అధికారిక ఎక్స్‌ ఖాతాలో పేర్కొన్నారు.