తెరుచుకున్న శబరిమల ఆలయం

విధాత‌: కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయం సోమవారం తెరుచుకుంది. సీజనల్ యాత్ర సందర్భంగా ఆలయ దర్శనం ప్రారంభమైంది. సోమవారం సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహించి.. మంగళవారం నుంచి భక్తులను అనుమతించనున్నట్లు దేవస్థానం బోర్డు తెలిపింది. కరోనా కారణంగా గతంలో అనేకసార్లు మూతబడిన దేవాలయం.. దాదాపు రెండేళ్ల తర్వాత పూర్తిస్థాయిలో తెరుచుకుంది. మంగళవారం నుంచి రోజూ 30 వేల మంది భక్తులను ఆలయంలోకి అనుమతించనున్నారు. వర్చువల్ క్యూ బుకింగ్ విధానం ద్వారా భక్తులకు ఎంట్రీ ఉంటుందని దేవస్థానం బోర్డు […]

తెరుచుకున్న శబరిమల ఆలయం

విధాత‌: కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయం సోమవారం తెరుచుకుంది. సీజనల్ యాత్ర సందర్భంగా ఆలయ దర్శనం ప్రారంభమైంది. సోమవారం సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహించి.. మంగళవారం నుంచి భక్తులను అనుమతించనున్నట్లు దేవస్థానం బోర్డు తెలిపింది. కరోనా కారణంగా గతంలో అనేకసార్లు మూతబడిన దేవాలయం.. దాదాపు రెండేళ్ల తర్వాత పూర్తిస్థాయిలో తెరుచుకుంది.

మంగళవారం నుంచి రోజూ 30 వేల మంది భక్తులను ఆలయంలోకి అనుమతించనున్నారు. వర్చువల్ క్యూ బుకింగ్ విధానం ద్వారా భక్తులకు ఎంట్రీ ఉంటుందని దేవస్థానం బోర్డు తెలిపింది. వర్షాలు, వాతావరణ ప్రతికూలతల దృష్ట్యా మొదటి మూడు రోజులపాటు తక్కువ మంది భక్తులకే ఆలయ ప్రవేశం ఉంటుందని పేర్కొంది. భక్తుల భద్రత దృష్ట్యా పంపానదిలో స్నానాలను నిషేధించినట్లు వెల్లడించింది

నిబంధనలివే..

కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారికి, ఆర్ టీపీసీఆర్ నెగెటివ్ ధ్రువపత్రం సమర్పించిన వారికే ఆలయ ప్రవేశం ఉంటుందని దేవస్థానం బోర్డు స్పష్టం చేసింది. క్యూలైన్లో భౌతిక దూరం, మాస్కు ధరించడం విధిగా పాటించాలని ఆదేశిం చింది. వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున..కొండపై రాత్రిళ్లు ప్రయాణించొద్దని ఆదేశించింది.

భక్తుల రద్దీ దృష్ట్యా కేరళ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దర్శనానికి వచ్చే భక్తుల ఆరోగ్య భద్రత దృష్ట్యా అన్ని జాగ్రత్త లు తీసుకున్నట్లు రాష్ట్ర వైద్యశాఖ మంత్రి తెలిపారు. ప్రసాద కౌంటర్ల వద్ద రద్దీని తగ్గించేందుకూ చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.